క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిటర్లు, లేదంటే లబ్ధిదారులు గుర్తించేందుకు గాను వెబ్‌పోర్టల్‌లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆర్‌బీఐ వివరాల ప్రకారం.. ఇటీవల ఆర్‌బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో రూ. 35,012 కోట్లు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా వీటిని ఎవరూ క్లెయిం చేయలేదు. అంటే ఈ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా ఫ్యామిలీలకు బహుశా ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు పేరుకుపోయి ఉంటాయి.
ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు పేరుకుపోయాయని వాటిని ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. అన్ క్లయిమ్ డిపాజిట్ల కోసం వెబ్ పోర్ట్‌లలో డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా బ్యాంక్‌లు ఆ డేటా బేస్‌లో అన్ క్లయిమ్ డిపాజట్ల గురించి తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు తెలిపారు.
అన్‌క్లయిమ్ డిపాజిట్లపై పిల్ దాఖలు
ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్, రచయిత సుచేతా దలాల్ తాజాగా అన్ క్లయిమ్ డిపాజిట్ల గురించి డేటా బేస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (పిల్‌కు) దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు ఆర్థిక శాఖకు మరింత సమయం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరినట్లు సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment