మీరు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? చేస్తే మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో ఈ బ్యాంకు డిపాజిట్లు అంత శ్రేయస్సకరం కాదు. ఎందుకంటే ఒక వేళ మీరు డిపాజిట్ చేసిన బ్యాంకుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి దివాళా తీస్తే? ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆర్‌బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందిస్తుంది. ఆ పథకం గురించి మీకు తెలుసా?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) అన్ని బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ అందించే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను అమలు చేస్తుంది.
ఈ పథకంలో భాగంగా కొత్త మొత్తాన్ని బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. ఒకవేళ ఆ బ్యాంకు ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నా, రూ.5లక్షల వరకు డిపాజిట్‌ను ఖాతాదారులు తిరిగి పొందే వీలుంది.
అర్హులైన ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్‌డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇవ్వబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment