ముంబై: కఠిన ద్రవ్య విధాన బాటలో పయనిస్తున్న ప్రస్తుత కీలక సమయంలో.. రెపో రేటు పెంపును అపరిపక్వంగా నిలుపుచేయడం తీవ్ర విధానపరమైన లోపం అవుతుందని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నెల 5 నుంచి 7 మధ్య జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమీక్ష మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి.
ఈ సమావేశంలో 35 బేసిస్ పాయింట్ల కీలక రెపో రేటు పెంపునకు కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్‌బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్!
Comments
Please login to add a commentAdd a comment