రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈరోజు (ఆగస్టు 8) ప్రకటించారు. రెపో రేటు తొమ్మిదవ సారి కూడా మారలేదు. కాబట్టి రెపో రేటు 6.5 శాతం వద్ద ఉంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) తన మూడవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని ఆగస్టు 6 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించింది.
#WATCH | RBI Governor Shaktikanta Das says, "Real GDP growth for 2024-25 is projected at 7.2% with Q1 at 7.1%, Q2 at 7.2%, Q3 at 7.3%, and Q4 at 7.2%. Real GDP growth for Q1 of 2025-26 is projected at 7.2%."
(Video source: RBI) pic.twitter.com/KCBKg11Qd0— ANI (@ANI) August 8, 2024
రెపో రేటు
ఆర్‌బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్‌బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.
రివర్స్ రెపో రేటు
వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్‌బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment