
సాక్షి,ముంబై: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌లో బిజినెస్ టైకూన్‌లు, కార్పొరేట్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ , మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఎండీ పవన్ గోయంకా, ఆది గోద్రెజ్ తదితర దిగ్గజాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితోపాటు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ముంబైలో ఓటు వేశారు.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బీఎస్‌సీ సీఎండీ అశిష చౌహాన్, ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్, మోర్గాన్ స్టాన్లీ ఎంఈ రిధ్ దేశాయ్ ఈ రోజు వేసిన కార్పొరేట్ ప్రముఖుల్లో ఉన్నారు. దేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని, ఉద్యోగావకాశాలను లభిస్తాయని ఆనంద్ మహీంద్ర ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment