ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరగనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరగనున్న ఈ పరపతి కమిటీ సమావేశం సందర్భంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) 35 బేసిస్ పాయింట్లవరకూ తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. శక్తికాంత్ దాస్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే ఆర్‌బీఐ రెపోరేటు అరశాతం తగ్గిన సంగతి తెలిసిందే. రేటు తగ్గింపు ఖాయమన్న అంచనాలకు ప్రధాన కారణాలను చూస్తే...
♦ అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతంలోపు కొనసాగుతోంది.
♦ మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణులు పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి.
♦ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది.
♦ ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు స్పీడ్‌కు రెపో రేటు తగ్గింపునకే అవకాశాలు ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల విశ్వాసం.
రేటు తగ్గింపు ఖాయం!
Published Wed, Jun 5 2019 10:27 AM | Last Updated on Wed, Jun 5 2019 10:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment