బంగారం వృత్తి వ్యాపారంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధించినందుకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా జోగిపేటలో స్వర్ణకారుల దుకాణాలు మూసివేశారు.
బంగారం వృత్తి వ్యాపారంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధించినందుకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా జోగిపేటలో స్వర్ణకారుల దుకాణాలు మూసివేశారు. బంగారంపై సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ కిష్టయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 17వ తేదీ వరకు దుకాణాలను మూసివేత కొనసాగించనున్నట్లు తెలిపారు.