న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ), ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. వెరసి ఆర్‌ఐఎల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాలు(వయాకామ్18, డిజిటల్18), వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా మధ్య విలీన పథకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది.
ఇప్పటికే ఈ డీల్‌కు కొన్ని స్వచ్చంద సవరణల తదుపరి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా రూ. 70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా దిగ్గజం ఆవిర్భావినికి మరింత దారి ఏర్పడింది. తమ పరిశీలన ప్రకారం విలీన పథకం సక్రమంగానే ఉన్నట్లు ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. అను జగ్‌మోహన్ సింగ్ (మెంబర్, టెక్నికల్), కిషోర్ వేములపల్లి (మెంబర్, జ్యుడీíÙయల్)లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేకపోవడంతోపాటు ప్రజావిధానాలకు వ్యతికేరంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్య కంపెనీ(విలీన సంస్థ) రెండు ఓటీటీలతోపాటు 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. ఆర్‌ఐఎల్‌కు 63.16 శాతం వాటా లభించనుండగా.. వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాను పొందనుంది. మీడియా దిగ్గజాలు సోనీ, నెట్‌ఫ్లిక్స్‌తో మరింత తీవ్రస్థాయిలో పోటీకి దిగేందుకు వీలుగా ఆర్‌ఐఎల్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment