
న్యూయార్క్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు తెలిపింది. అయితే సంస్థలో 67శాతం తాత్కాళిక ఉద్యోగులనే తొలగించినట్లు పేర్కొంది. అమెరికా థీమ్ పార్క్‌లలో పని చేసే 28 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు పేర్కొంది. అయితే డిస్నీ నష్టాలను తగ్గించుకునేందుకు ఏయిర్‌లైన్స్ గ్రూప్ తదితర రంగాలల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరోవైపు ఖర్చులు తగ్గించుకున్నా, కరోనా ప్రతికూల పరిస్థితులు వ్యాపారంపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని డిస్నీ పార్క్ చైర్మన్ జోష్ డి అమారో పేర్కొన్నారు.