Mufasa: The Lion King Trailer: లయన్‌ కింగ్‌ ఒక్కటే ఉండాలి! | Mufasa: The Lion King Final Trailer Out | Sakshi
Sakshi News home page

Mufasa: The Lion King Trailer: లయన్‌ కింగ్‌ ఒక్కటే ఉండాలి!

Published Sun, Nov 10 2024 4:03 PM | Last Updated on Sun, Nov 10 2024 4:37 PM

Mufasa: The Lion King Final Trailer Out

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ది లయన్‌ కింగ్‌ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ అనే చిత్రం  రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ పతాకంపై అడెలె రోమన్‌ స్కీ, మార్క్‌ సెరియాక్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబరు 20న ‘ముఫాసా: ది లయన్‌  కింగ్‌’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్‌  అవుతోంది. ఆల్రెడీ తెలుగు ట్రైలర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

కాగా తాజాగా  ‘ముఫాసా: ది లయన్‌  కింగ్‌’ ఇంగ్లీష్‌ ఫైనల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. ‘‘ఈ కథ స్కార్‌ అనే ప్రిన్స్‌కి, ఓ అనాథ అయిన ముఫాసాకి చెందినది. వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఓ కొత్త సామ్రాజ్యం కోసం ఓ ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు, నా పేరు ముఫాసా, లయన్‌ కింగ్‌ అనేది ఒక్కటే ఉండాలి, మనల్ని ట్రాప్‌ చేశారు.. ఇప్పుడు ఏం చేయాలి’’ అంటూ అర్థం వచ్చే ఇంగ్లీష్‌ డైలాగ్స్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ సినిమా ఇంగ్లీష్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

ఇక ‘ముఫాసా: ది లయన్‌  కింగ్‌’ సినిమాలోని ప్రధాన పాత్రధారులు అయిన ముఫాసాకు హాలీవుడ్‌ నటుడు అరోన్‌  పియర్, టాకా (ఈ పాత్ర ఆ తర్వాత స్కార్‌గా మారుతుంది)కు కెల్విన్‌  హరిసన్‌  జూనియర్‌ వాయిస్‌ ఓవర్స్‌ ఇచ్చారు. ఇక  ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ తెలుగు వెర్షన్‌ లో ముఫాసా  పాత్రకు మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement