మహేశ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఎప్పుడో వస్తుందో తెలీదు. ఎందుకంటే రాజమౌళితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చు. ఈ మూవీకి ముందే మహేశ్.. ఓ హాలీవుడ్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో మహేశ్ నటించట్లేదు, డబ్బింగ్ చెప్పాడంతే! అదే 'ముఫాసా: ద లయన్ కింగ్'.
డిసెంబర్ 20న ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ప్రచారంలో మహేశ్ కనిపించట్లేదు. కానీ కొన్నిరోజుల క్రితం భార్య నమ్రత.. 'ముఫాసా' ఈవెంట్‌లో పాల్గొంది. ఇప్పుడు కూతురు సితార కూడా 'ముఫాసా' మూవీపై ఓ వీడియో రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష‍్మి)
'ముఫాసా తెలుగు వెర్షన్‌కి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా ఉంది. నిజజీవితంలోనూ నాన్నకు ముఫాసాతో పోలికలు ఉన్నాయి. ఎందుకంటే అంతలా ప్రేమిస్తారు, అండగా ఉంటారు. నాన్న ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతారనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆయన కంటే నేనే.. డిస్నీ సంస్థలో 'ఫ్రోజెన్' మూవీ కోసం పనిచేశా. ఈ విషయంలో మాత్రం ఆటపట్టించాను. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు చాలా ప్రాక్టీస్ చేశారు. తొలిసారి అయినా సరే పాత్రకు సరిగ్గా సరిపోయారు. ట్రైలర్ చూసిన ప్రతిసారి.. సినిమా ఎప్పుడు వస్తుందా, చూస్తానా అనిపిస్తుంది' అని సితార తన ఆనందాన్ని బయటపెట్టింది.
2019లో 'ద లయన్ కింగ్' పేరుతో సినిమా రిలీజైంది. దీనికి ప్రీక్వెలే ఇప్పుడొస్తున్న 'ముఫాసా: ద లయన్ కింగ్'.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు తెలుగులో మహేశ్ బాబు, బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్ తదితరులు డబ్బింగ్ చెప్పారు. హిందీలో షారుక్, తమిళంలో అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలతో పాటు పెద్దవాళ్లని కూడా ఎంటర్‌టైన్ చేసే ఈ మూవీ క్రిస్మస్ వీకెండ్‌లో ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment