స్టార్ హీరోలు పాటలు పాడడం పరిపాటిగా మారింది. కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. కాగా తాజాగా మరో మల్టీ టాలెంటెండ్ హీరో విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన 'కరా' అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడారు. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరా.
దీని విశేషం ఏమిటంటే మొసలి ఇతి వృత్తంతో రూ పొందడం. ఈ చిత్రం ద్వారా నటి సాహిబా బాసిన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు జీవా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో మొట్టై రాజేంద్రన్, సేలం వేంగై కె.అయ్యనార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవానీ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై రాజేంద్రకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవతార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్చు రాజామణి సంగీతాన్ని, గీరీశన్ ఏజీఏ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మొసలి తమిళ పేరు కరా అని చెప్పారు. ఈ చిత్రం కోసం నటుడు విజయ్‌సేతుపతి పాడిన కాదల్ కుమారు వైరల్ ఆనారు అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రేండింగ్ అవుతోందని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారు వరకూ ఆనందించే మంచి జనరంజకమైన కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment