దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)కు సమయపాలన లేదంటున్నాడు సింగర్ అభిజీత్ భట్టాచార్య. చెప్పిన సమయానికి పని పూర్తి చేయడంటూ అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా అభిజీత్ భట్టాచార్య (Abhijeet Bhattacharya) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్ ఊపందుకున్న సమయంలో ఏ నజ్నీన్ (Ae Nazneen Suno Na..) పాట ఆఫర్ ఇచ్చారు. చెప్పిన సమయానికి వెళ్లాను. కానీ అక్కడ నన్ను గంటలకొద్దీ వెయిట్ చేయించారు. తీరా రెహమాన్ వెళ్లిపోవడంతో నన్ను రాత్రికి అదే హోటల్‌లో ఉండిపోమన్నారు. మరుసటి రోజు సాంగ్ రికార్డ్ ఉంటుందని చెప్పారు. సరేలేనని నేను నిద్రకుపక్రమించాను. ఇంతలో అర్ధరాత్రి రెండు గంటలకు స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది.
నిద్రపోతున్న సమయంలో..
త్వరగా వచ్చి పాట పాడమని అడిగారు. ఉదయం రెండు గంటలకు సాంగ్ రికార్డింగ్ ఏంటని ఒప్పుకోలేదు. నేను ఇప్పుడే నిద్రపోతున్నాను.. ఈ సమయంలో ఎలా కుదురుతుందని చెప్పి.. తెల్లారాక స్టూడియోకు వస్తానన్నాను. తీరా వెళ్లేసరికి రెహమాన్ అక్కడ లేడు. అతడి అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్లు ఓ పద్ధతి ప్రకారం పని చేయరు. ఎప్పుడు పడితే అప్పుడే పని చేస్తున్నారు. నేనేమో ఏదైనా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటాను. సమయపాలన పాటిస్తాను. క్రియేటివిటీ పేరు చెప్పి ఉదయం మూడున్నర గంటలకు సాంగ్ పాడమనడమేంటో నాకిప్పటికీ అర్థం కాదు.
(చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు)
సినిమా ఫ్లాప్.. సాంగ్స్ హిట్
ఆ రోజు స్టూడియోలో ఏసీ ఎక్కువ పెట్టడం వల్ల నాకు జలుబైంది. ఆ విషయం చెప్పినా సరే వాళ్లు వినిపించుకోలేదు. ఏం పర్లేదని పాడమన్నారు. పాట పాడటం పూర్తయ్యాక రెహమాన్ గురించి అడిగితే సరైన స్పందనే లేదు. అలా ఆయన్ను కలవకుండానే అక్కడి నుంచి వెనుదిరిగాను. నేను ఎన్నో సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమాలకు హిట్ సాంగ్స్ పాడాను. అందులో ఒకటే ఇది కూడా! ఈ సినిమా ఎవరూ చూడలేదు. కానీ పాటలు మాత్రం వైరలయ్యాయి. దానికి క్రెడిట్ అంతా రెహమాన్‌కే వచ్చింది. ఎన్నో సార్లు రెహమాన్‌ను కలవాలని ప్రయత్నించాను. కానీ నాకు అవతలివైపు నుంచి సరైన స్పందన రాలేదు. ఇలా ఒకరిని వెయిట్ చేయించడం వల్ల ఎవరూ గొప్పోళ్లు అయిపోరు.
సినిమా..
199లో వచ్చిన దిల్ హై దిల్ మే సినిమా (Dil Hi Dil Mein)లో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఏ నజ్నీన్ సునో నా.. పాటను అభిజీత్ ఆలపించాడు. తర్వాత రెహమాన్‌తో ఎన్నడూ అభిజీత్ జత కట్టలేదు. దిల్ హై దిల్ మే సినిమా విషయానికి వస్తే ఇందులో కునాల్ సింగ్ హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది కానీ అభిజీత్ పాడిన పాట మాత్రం బాగా హిట్టయింది.
పర్సనల్ లైఫ్
ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ గతేడాది తన భార్యతో విడిపోయాడు. 29 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న రెహమాన్-సైరా భాను జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరిద్దరికీ 1995లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. గతేడాది నవంబర్‌లో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
చదవండి: మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment