Abhijeet Bhattacharya
-
యుద్ధకాలంలో ఆహారమే ముఖ్యం
యుద్ధాలు ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తాయని చరిత్ర పదే పదే రుజువు చేస్తోంది. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణ కంటే మిన్నగా రైతు, ఎరువు, ఆహారం, దుర్భిక్షం అనేవి అందరినీ కలవరపరుస్తున్నాయి. మందుగుండు సామర్థ్యం, బాంబులు, క్షిపణులు ఇవేవీ ప్రపంచానికి ఇప్పుడు ముఖ్యం కాదు. మెరిసే మెట్రో భవంతులు, స్టాక్ మార్కెట్ బూమ్, పెరుగుతున్న మల్టీ బిలియనీర్ల సంఖ్య ఏ విధంగానూ దేశాలకు రక్షక పాత్ర పోషించలేవు. ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఆహార ధాన్యాల నిల్వ పెంచుకోండి అన్నది ఇప్పుడు అత్యవసర సూత్రం. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద వరి, గోధుమ ఉత్పత్తి దేశాలు కూడా మరింత ఉత్పత్తి కోసం పాట్లు పడుతున్నాయి. ‘‘తిండి లేకుండా ఇది రెండో రోజు. మేమంతా శరీరంలో నీటి చుక్క అనేది లేకుండా అల్లాడిపోయాం. ఇప్పటికే 60 గంటలపాటు మాకు తిండి లేదు. మా సైనికులూ, నేనూ ఎంతకాలం పోషణ లేకుండా ఉంటామో తెలీదు. నా వాచ్ కేసి చూశాను. సరిగ్గా ఉదయం 9.22 నిమిషాలు. 1962 అక్టోబర్ 22 సోమవారం. నేను చైనా ప్రజా విముక్తి సైన్యం ఖైదీగా ఉన్నాను. ఆ సమయానికి 66 గంటలుగా నేను తిండి లేకుండా ఉన్నాను. అలిసిపోయాను. ఆకలితో అలమటించిపోతున్నాను. గడ్డం గీసుకోలేదు. నిరుత్సాహం ఆవరించింది.’’ (హిమాలయన్ బ్లండర్; పేజీ: 390; బ్రిగేడియర్ జాన్ పి. దల్వీ) సార్వభౌమాధికార దేశ యోధులకు తిండి లేకపోతే జరిగేది అదే. సురక్షితమైన స్థావరం నుంచి మండుతున్న హిమాలయ సరిహద్దుకు ఆహార పదార్థాలు సరఫరా చేయడంలో రాజ్య యంత్రాంగం ప్రదర్శిం చిన నేరపూరితమైన నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇది. యుద్ధరంగంలోని ముందు వరుస యోధుల ఆహార సంక్షోభాన్ని ఎత్తిచూపేలా, సుమారు నెలరోజులపాటు సైనికంగా చైనా అవమానకరమైన దెబ్బ కొట్టింది. ఆకలితో అలమటించిన యోధులు తప్పనిసరై లొంగిపోయి శత్రువు కారాగార అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. స్పష్టంగా యుద్ధాలు సరిహద్దుల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ కూడా ఆహార సంక్షేభాన్ని పుట్టిస్తాయి. అదృష్టవశాత్తూ, ప్రపంచ యుద్ధాలు మనకు దూరంగానే ఉంటూ వచ్చాయి. కానీ 1962 నాటి యుద్ధం భారత్ భూభాగంలోనే జరి గింది. కాకపోతే, రెండో ప్రపంచ యుద్ధం తూర్పు భారతదేశంలో విధ్వంసకరమైన దుర్భిక్షాన్ని కొనితెచ్చింది. 1962 చైనా ముట్టడి సమ యంలో భారతీయ సైనికులు ఆకలితో అలమటించడానికి ముందు 150 సంవత్సరాల క్రితం 1812లో నెపోలియన్ రెజిమెంట్‌కు చెందిన సైన్యాలు భయంకరమైన ఆహార సరఫరా వైఫల్యం కారణంగా ఆకలి దప్పులతో అలమటించి రష్యా చేతిలో ఊచకోతకు గురయ్యాయి. దాంతో శక్తిమంతమైన ఫ్రాన్స్ సైన్యాలు తక్కువ అంచనా ఉన్న జార్ రోమనోవ్ సైన్యం చేతిలో ఘోర పరాజయం పొందాయి. జార్ గుర్రాలు ఆహార సరఫరాలను సజీవంగా ఉంచడమే రష్యా సైనికుల విజయానికి కారణం. నేటి రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణ కూడా ఆహార ఉత్పత్తి, వినియోగం, పంపిణీకి సంబంధించి కనీవినీ ఎరుగని అంతర్జాతీయ భయాందోళనలను సృష్టించింది. టోక్యో నుంచి చికాగో వరకు, ఢిల్లీ నుంచి ఢాకా వరకు, కెనడా నుంచి అర్జెంటీనా వరకు ఆహార ధాన్యా లను అధికంగా ఉత్పత్తి చేసే ప్రతి దేశం కూడా యుద్ధ ప్రాంతానికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ ఆందోళన చెందుతున్నాయి. రష్యా– ఉక్రెయిన్ సైనిక ఘర్షణ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుందనీ, దాని భారం ప్రపంచంపై ఈ స్థాయిలో పడుతుందనీ ఎవరూ ఊహించ లేదు. అయితే, పోరాడుతున్న ప్రపంచం కంటే ఆహారం పండిస్తున్న ప్రపంచమే అగ్రగామి అనే ఎరుక ఇప్పుడు అందరి అనుభవంలోకీ వస్తోంది. కాబట్టే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ (ఏటా 3.60 కోట్ల టన్నులు) తన నిల్వలను పెంచుకోవడానికి భారత్, వియత్నాంలతో 3 లక్షల 30 వేల టన్నుల వరిధాన్యం దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకుంది. యుద్ధ దుష్ఫలితాలతో పెరుగుతున్న దేశీయ ఆహార ధరల వేడిని చల్లార్చుకోవడమే బంగ్లాదేశ్ లక్ష్యం. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా (ఏటా 12 కోట్ల టన్నులు), మూడో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా (ఏటా 10.04 కోట్ల టన్నులు) ఉండి, ఎగుమతులు చేస్తోంది. కానీ జాతీయ ఉత్పత్తిలో పావుశాతం వాటా ఉన్న బెంగాల్, ఉత్తరప్రదేశ్ లలో బలహీనమైన రుతుపవనాల కారణంగా ప్రస్తుత సీజన్లో వరి ఉత్పత్తి ప్రమాదంలో పడింది. దీంతో భారత్ కూడా దేశీయ ధరల పెరుగుదలకూ, లాభాలు తెచ్చిపెట్టే ఎగుమతులకూ, బిగుసుకు పోయిన సరఫరా మార్గాలకూ మధ్య సమతుల్యతను తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో వరి నాటు 8 శాతం తగ్గింది. అమెరికా ప్రభుత్వం కూడా, ఒక పంటకు బదులుగా రెండు పంటలు వేయాలని రైతుల మీద ఒత్తిడి తెస్తోంది. ప్రపంచంలో అయిదో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా (5.5 కోట్ల టన్నులు), ఎగుమతిదారుగా ఉన్న అమెరికాను సైతం యూరప్ యుద్ధం భయ పెడుతోంది. ఎందుకంటే స్తంభించిపోయిన ఓడరేవుల్లో గోధుమ పంట ఇరుక్కుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పంపిణీకి, వినియోగ దారుకూ మధ్య ఉన్న గొలుసు తెగిపోయింది. అయితే, ఉత్పత్తి పెంచడం వల్ల ఆసియా, యూరప్ వినియోగదారులను చేజిక్కించు కునే మార్గం కూడా అమెరికాకు సుగమం కానుంది. కాబట్టి, ఉక్రెయిన్ యుద్ధం అదనంగా గోధుమ పండించే ఉత్పత్తిదారులకు లాభాలను పండించే మార్గాలను తెరిచింది. ఉక్రెయిన్ పతనం అమెరికాకు లాభంగా మారుతోందన్నమాట. జపాన్ విషయానికి వస్తే, ఆ ద్వీప భౌగోళిక పరిమితుల కారణంగా ఆహారం నిత్య సమస్యగానే ఉంటోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టే ప్రపంచంలోనే తొమ్మిదో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉంటున్నప్పటికీ (77 లక్షల టన్నులు) జపాన్ ఆహార ధాన్యాల దిగుమతిదారుగానే ఉంటోంది. అటు చైనా తైవాన్ ఘర్షణల ప్రమాదం, ఇటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆహార స్వావలంబన ప్రాముఖ్యతను జపాన్ గుర్తిస్తోంది. స్వదేశంలో పంటల ఉత్పత్తి, ఎరువులు, గింజల విష యంలో వీలైనంత అధికోత్పత్తిని దేశం సాధించాల్సి ఉంటుందని విధాన నిర్ణేతలు గుర్తిస్తున్నారు. పైగా ఆసియాలో తిరుగులేని నావికా శక్తిగా జపానీయులు గుర్తింపు పొందిన రోజులకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఈరోజు ప్రత్యక్ష యుద్ధంలో జపాన్ పాల్గొనాల్సి వస్తే దాని ఆహార పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒక్క జపాన్ మాత్రమే కాదు, ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించని చాలా దేశాలకూ ఇదే వర్తిస్తుంది. రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ కంటే మిన్నగా రైతు, ఎరువు, ఆహారం, దుర్భిక్షం అనే అంశాలు సామూహికంగా అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంటున్నాయి. మందుగుండు పేలుళ్ల సామర్థ్యం, బాంబులు, క్షిపణులు, తుపాకులు ఇవేవీ ఇప్పుడు ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక పతనం ఎంతగా ఆందోళన కలిగిస్తున్నదంటే, ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారైన కెనడా మరింతగా గోధుమ ఉత్పత్తి చేయడానికి పూనుకుంటోంది. ఆహార సరఫరా, పంపిణీ వ్యవస్థ దీర్ఘకాలం సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తున్న తరుణంలో... ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఆహార ధాన్యాల నిల్వ పెంచుకోండి అనేదే ఇప్పుడు అన్ని దేశాలకూ తారక మంత్రం అయిపోయింది. ఇక భారత్‌లో పాలకుల విధానాల కారణంగా రైతులకు రుణ భారం గుదిబండగా మారుతున్నప్పటికీ, ఆహార స్వావలంబన విష యంలో దేశం అద్భుతమైన విజయాలు సాధించిందనడంలో సందేహం లేదు. 1960 నుంచి ఆయా ప్రభుత్వాలు రైతులకు కల్పిం చిన ప్రోత్సాహకాలే ఈ విజయానికి కారణం. వ్యవసాయేతర ఆర్థిక సామర్థ్యం కోసం వ్యవసాయాన్నీ, ఆహారోత్పత్తినీ తమ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడంపై ఇప్పుడు జపానీయులు ఆగ్రహిస్తున్నారు. భారత్ సైతం 130 కోట్లకు పైగా జనాభాకు తిండి పెట్టడం తన అత్యంత ముఖ్యమైన బాధ్యత అని గుర్తించి తీరాలి. సుదూర ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో ఆహారోత్పత్తి, వ్యవసాయం దుఃస్థితికి గురై దుర్భిక్షం కారణంగా సామూహిక ఆకలి పెరిగిన పక్షంలో... మెరిసే మెట్రో భవంతులు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్ బూమ్, పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య ఏ విధంగానూ రక్షక పాత్ర పోషించలేవు. ఖాళీ కడుపుతో ఉన్న మనిషికి ఆహారమే దేవుడు అని గాంధీజీ సరిగ్గానే చెప్పారు. కాబట్టి సంక్షుభిత సమయాల్లో జాగరూకతతో, చురుగ్గా ఉండటం చాలా అవసరం. అభిజిత్ భట్టాచార్య వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇప్పటి యుద్ధం ఎప్పుడో మొదలైంది..!
ఒక్కోసారి ఎవరు బాధితులు, ఎవరు పీడకులు అని తేల్చడం పరీక్షే. ఎందుకంటే నిర్వచనాలకు ఏకాభిప్రాయం కుదరదు. ఒకరికి ఉగ్రవాదం అనిపించేది, ఇంకొకరికి అణచివేత వ్యతిరేక పోరాటం. ఒకటైతే స్పష్టం. పాశ్చాత్య దేశాలు రష్యాను ఒంటరిని చేశాయి. వాటికీ, రష్యాకూ మధ్య పరస్పర విశ్వాసం ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. జార్జియాను నాటోలో చేర్చుకోవడం కోసం ఏర్పరిచిన ‘నాటో జార్జియా కమిషన్’, అనంతరం ‘నాటో ఉక్రెయిన్ కమిషన్’ సహా ఇంకా ఎన్నో కారణాలు రష్యాను గాయపడేట్టు చేశాయి. అందుకే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమీ కాదు. దశాబ్దాలుగా రగులుతున్న అసహనం యుద్ధం స్థాయికి చేరాలంటే కాలం పండాలి. కారణం ఏమైనా దీని నష్టాన్ని అనుభవిస్తున్నది యావత్ ప్రపంచం. అవినీతి, ఉగ్రవాదం, ‘వరల్డ్ ఆర్డర్’... ఈ మూడు అంశాల గురించి ఏ అంతర్జాతీయ వేదికపై చర్చ జరిగినా వాటికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వడం, ఆయా అంశాలపై ఏకాభిప్రాయం ఏర్పడటం దాదాపు అసాధ్యం. ఎందు కంటే... ఈ మూడు పదాల విషయంలో ఒక్కో దేశం నిర్వచనం, అభిప్రాయం వేర్వేరుగానే కాదు, పరస్పర వ్యతిరేకంగానూ ఉండేం దుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఒకరికి ఉగ్రవాదం అనిపించేది, ఇంకొకరికి అణచివేతకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కావచ్చు. అలాగే మరికొందరికి ఉగ్రవాది కాస్తా స్వాతంత్య్ర సమరయోధుడు అవుతాడు. వరల్డ్ ఆర్డర్ విషయానికి వస్తే.. దీనికి హద్దులే లేవు. అందుకే మెజారిటీ కలిగిన దేశాల ఆర్థిక, మిలిటరీ శక్తులకు బాధితు లమయ్యామని ఏదైనా దేశం భావిస్తే అదో జోక్ మాత్రమే అవుతుంది. అందుకే... యూరప్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ వరల్డ్ ఆర్డర్ ఏమిటన్న అంశంపై కొంచెం లోతుగా పరిశీలించా ల్సిన అవసరం ఏర్పడుతోంది. గడచిన 200 ఏళ్ల ప్రపంచ చరిత్రను ఒకసారి తిరగేస్తే... దేశాల మధ్య ఎన్నో చిత్ర, విచిత్రమైన భాగస్వామ్యాలు ఏర్పడినట్లూ, దౌత్య చర్చలు జరిగినట్లూ సులువుగానే అర్థమవుతుంది. బలమున్న వాడిదే బర్రె అన్నట్లు వీటన్నింటిలోనూ శక్తిమంతమైన వారే ఆధిపత్యాన్ని చలాయించారనీ, వరల్డ్ ఆర్డర్‌ను నిర్ణయించారనీ తెలుస్తుంది. అయిన ప్పటికీ గత రెండు శతాబ్దాల్లో ఎన్నో వరుస యుద్ధాలు జరిగాయి. వీటి పర్యవసానం 1919లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు! ఆ తరువాత 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపన! ఈ రెండింటి వెనుక ఉన్నది విజయాలను చేజిక్కించుకున్నప్పటికీ యుద్ధాలతో చితికిపోయిన పాశ్చాత్య దేశాలే. కనీసం అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల వరకూ యుద్ధం లేని ప్రపంచాన్ని ఏర్పరచడం వీటి లక్ష్యం. సంపదను సృష్టిం చడంతోపాటు అందులో సింహభాగం తమవద్దే ఉండేలా చూసేం దుకూ పాశ్చాత్య దేశాలు ఈ కొత్త వరల్డ్ ఆర్డర్ ద్వారా లక్ష్యించాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య మాత్రమే కాకుండా... పశ్చిమ దేశాల కారణంగానే ఆ ప్రాంతాల్లోనే పదే పదే యుద్ధాలు చెలరేగుతూండటం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే 20వ శతాబ్దం సాక్షిగా ఈ పాశ్చాత్య యుద్ధకాంక్షలో అనవసరంగా పశ్చిమేతర దేశాలు చిక్కుకు పోతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అన్నింటికీ కొరత ఏర్పడు తోంది. వాణిజ్యం, ఆహారం, ఆర్థికం, ఇంధనం వంటి అనేక రంగాల్లో వ్యాపారం అస్తవ్యస్తమవుతోంది. పాశ్చత్య దేశాలు గడచిన 30 ఏళ్లుగా ప్రపంచీకరణ, ఇంటర్ కనెక్టివిటీలకు అవసరానికి మించిన ప్రాధాన్యం కల్పించాయి. ప్రతి దేశం సుస్థిరత సాధన కోసం తన ఇరుగు పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల ఆధారంగా పనిచేస్తుంది కానీ వరల్డ్ ఆర్డర్ ప్రకారం కాదన్న వాస్తవాన్ని పాశ్చాత్య దేశాలు మరచి పోయాయి. ఇంకోలా చెప్పాలంటే అంతర్జాతీయ దౌత్యానికి ద్వైపాక్షిక సంబంధాలే మూలం. లేదంటే వేర్వేరు దేశాల్లో తమ దేశ దౌత్య వేత్తలను నియమించుకోవడం వెనుక తర్కం ఏమిటి చెప్పండి? మొత్తమ్మీద చూస్తే దౌత్యం, సంప్రదాయాలు, బహు పాక్షిక ఒప్పం దాలు అన్నింటినీ కూడా అంతర్జాతీయ సంబంధాలను దృఢపరుచు కునేందుకూ... ఏకాభిప్రాయం, అంగీకారాల ద్వారా దౌత్యాన్ని సాధిం చేందుకూ ఉపయుక్తమైన అంశాలుగానే చూడాలి. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఇప్పుడు అనేకానేక బహుపాక్షిక ఒప్పందాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఒప్పందాలన్నింటికీ... పాశ్చాత్యదేశాల భద్రతకు మధ్య స్పష్టమైన సంబంధం కూడా ఉంది. అదే సమయంలో వీరందరికీ ఉమ్మడి శత్రువు కూడా దెబ్బతిన్న రష్యానే కావడం గమనార్హం. అంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 2022 నుంచి అమెరికా, రష్యాలు మరింత ప్రబల మైన బద్ధ శత్రువులుగా మారిపోయాయి అనుకుంటే ‘బైలాటరల్ కన్సల్టేటివ్ కమిషన్’ (బీసీసీ) పరిస్థితి ఏమిటి? అణ్వాయుధాలు మరింత తగ్గించేందుకూ, పరిమితులు విధించుకునే చర్యలు చేపట్టేం దుకూ 2010లో ఈ బీసీసీ ఏర్పడింది. తాజా యుద్ధం నేపథ్యంలో 1992లో ఏర్పాటై– డెన్మార్క్, ఎస్తోనియా, యూరోపియన్ యూని యన్, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్లాండ్, లాత్వియా, లిథువేనియా, నార్వే, పోలండ్, స్వీడన్లతోపాటు రష్యా కూడా భాగమైన ‘కౌన్సిల్ ఆఫ్ ద బాల్టిక్ సీ స్టేట్స్’ (సీబీఎస్‌ఎస్)లో ఇప్పుడు రష్యా ఎలా ఇమడ గలదు? పన్నెండు దేశాలతో ఏర్పాటై బాల్టిక్ సముద్ర ప్రాంత దేశాల మధ్య సహకారం కోసం కృషి చేయాల్సిన సీబీఎస్ఎస్లో 11 దేశాలు ఇప్పుడు రష్యాకు వ్యతిరేకం! ఇంకో విషయం. తెలిసో తెలియకో పాశ్చాత్య దేశాలిప్పుడు యూరప్‌లో ఓ దీర్ఘకాలిక ఘర్షణకు బీజం వేశాయని స్పష్టమవుతోంది. విల్నియస్ (లిథువేనియా రాజధాని) సరిహద్దు నుంచి వ్లాడివోస్టోక్ (రష్యా నగరం) వరకూ ఉండే భారీ తూర్పు దేశం (రష్యా)తో అవి ఎలాగూ సంబంధాలను మెరుగుపరచుకోలేకపోయాయి. పాశ్చాత్య దేశాలకూ, రష్యాకూ మధ్య పరస్పర విశ్వాసం ఎప్పుడూ లేకపోవడం ఇక్కడ ఇంకోసారి చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల కారణంగానే 1994లో మెడిటిరేనియన్ డైలాగ్ ఒకటి ఏర్పాటైంది. నాటో సభ్యదేశాలకూ, అల్జీరియా, ఈజిప్ట్, ఇజ్రాయిల్, జోర్డాన్, మారిటానియా, మొరాకో, ట్యునీసియా వంటి మధ్యదరా దేశాల మధ్య రాజకీయ చర్చలకు వేదికగా మారిన ఈ మెడిటరేనియన్ డైలాగ్ దూకుడు కారణంగా నాటో 2008లోనే ‘నాటో జార్జియా కమిషన్’ ఏర్పరిచి రష్యాను చికాకు పరిచేందుకు ప్రయత్నించింది. జార్జియా లక్ష్యమైన నాటోలో చేరడం కోసం రాజకీయ సంప్రదింపులు ఏర్పరుస్తూ వాస్తవిక సహకారాన్ని అందించడం కోసం ఇది ఉద్దేశించినది. అలాగే 2008లోనే యూరోపియన్ యూనియన్ నేతృత్వంలో రీజినల్ కో ఆపరేషన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటైంది. ఆగ్నేయ యూరప్ దేశాల మధ్య సహకారం కోసం ఈ సంస్థ ఏర్పాటు కాగా... పొరుగునే ఉన్న రష్యా ఇందులో భాగం కాలేకపోయింది. బోలెడన్ని అనుమా నాలు రేకెత్తించే అంశమిది. పునరాలోచన చేస్తే.. ప్రస్తుత పరిస్థితులకు బీజం ఇక్కడే పడిందేమో అనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల సమర్థనతో ఏర్పాటైన అనేకానేక నెట్‌వర్క్‌లలో ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపించేది ‘నాటో ఉక్రెయిన్ కమిషన్’. 1997లో రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై సంప్రదింపుల కోసం ఇది ఏర్పాటైంది. ఘర్షణ నివారణ పరిష్కారాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, ఆయుధ టెక్నాలజీలు, ఇత రాల బదలాయింపులు కూడా ఈ కమిషన్ లక్ష్యాలే. ఉక్రెయిన్, నాటో సభ్యదేశాలన్నీ ఇందులో భాగం వహించాయి. సోవియట్ యూని యన్ విచ్ఛిన్నమైన ఆరేళ్లకు ఈ కమిషన్ ఏర్పాటు కావడాన్ని రష్యా నిశ్శబ్దంగా, తన గర్వాన్ని దాచుకుని మరీ వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కమిషన్ ఏర్పాటు కాస్తా ఉక్రెయిన్ లోపలికి నాటోను తీసుకొచ్చినట్లు అయ్యింది. ఏతావాతా... ఈనాటి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమీ కాదు. దశాబ్దాలుగా రగులుతున్న అసంతృప్తి, అసహనం వంటివి యుద్ధం స్థాయికి చేరాలంటే కాలం పండాలి మరి! మూడు నెలలకుపైగా యుద్ధం కార్చిచ్చులా దహిస్తూంటే... జనవరిలో భారత్‌లో మాట్లాడుతూ జర్మన్ నావికాదళాధిపతి కే–అచిమ్ షోన్బాక్ చేసిన వ్యాఖ్య ఒకటి గుర్తుకు వస్తోంది. ‘‘నేరుగా చూస్తే పుతిన్‌కు గౌరవం ఇవ్వాల్సిందే. దీనికి పెద్దగా ఖర్చేమీ కాదు. ఒకరకంగా చూస్తే ఉచితం కూడా. అతడు కోరుతున్న గౌరవాన్ని ఇవ్వడం సులువు కూడా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జనరల్ అచిమ్ షోన్బాక్ భవి ష్యత్తును ముందే ఊహించారా? లేక పాశ్చాత్య దేశాలకు వాతపెట్టి, రష్యా చెవి పిండిన పోప్ కరెక్టా? ఒక్కటైతే వాస్తవం. ఈ పరస్పర విధ్వంస రచన ఎప్పుడు ఆగుతుందో? మానవాళి నశించిపోవడం వెంటనే ఆగుతుందో లేక వాయిదా పడుతుందో కాలమే చెప్పాలి. వ్యాసకర్త రాజకీయాంశాల వ్యాఖ్యాత, రచయిత అభిజిత్ భట్టాచార్య (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ఇప్పుడు షారూఖ్ స్థాయి లుంగీ డాన్స్‌కి దిగజారింది’
చాలా కాలం పాటు తన గాత్రంతో బాలీవుడ్ జనాలను ఊర్రూతలూగించాడు ప్లేబాక్ సింగర్ అభిజిత్ భట్టాచార్య. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానముందని చెప్పుకొనే అభిజిత్... షారూఖ్ ఖాన్‌కు.. ‘ఛల్తే ఛల్తే’., ‘మై కోయీ ఐసా గీత్ గావూన్’ వంటి సాంగ్స్‌తో హిట్ల మీద హిట్లు ఇచ్చాడు. అయితే గత కొంత కాలంగా షారూఖ్‌కు పాడటం మానేశాడు అభిజిత్. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఎన్నోసార్లు మాటల యుద్ధం కూడా కొనసాగింది. అయితే తాజాగా మరోసారి షారూఖ్‌పై విరుచుకుపడ్డాడు అభిజిత్. గాంధీ జయంతి సందర్భంగా ఇండియా టుడే సఫాయిగిరీ కార్యక్రమంలో పాల్గొన్న షారూఖ్‌కి పాడటం మానేయడం వెనుక గల కారణాలను వెల్లడించాడు. ‘నా వాయిస్‌తో ఎంతో మందిని సూపర్ స్టార్లను చేశాను. నేను షారూఖ్‌కి పాడినంత కాలం అతడు రాక్‌స్టార్‌గా పేరొందాడు. కానీ నేనెప్పుడైతే తనకి పాడటం మానేశానో లుంగి డాన్స్‌కి తన స్థాయి పడిపోయింది’ అంటూ షారూఖ్‌ను ఘాటుగా విమర్శించాడు. అసలు కారణం అదే.. ‘మై హూనా సినిమా ఎండింగ్లో స్పాట్ బాయ్ మొదలుకొని ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరిని స్క్రీన్‌పై చూపించారు. కానీ సింగర్స్‌కు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. అలాగే ఓం శాంతి ఓం సినిమాలో కూడా. అందులో ధూమ్ తనా సాంగ్‌కి నా గాత్రం అరువిచ్చాను. అందుకు ప్రతిగా నాకు దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కలేదు. ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాబట్టే అతడికి పాడటం మానేశాను’ అంటూ అసలు కారణాన్ని బయటపెట్టారు అభిజిత్. -
బాలీవుడ్ గాయకుడికి మరోసారి చుక్కెదురు
ముంబయి: సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసి భంగపడ్డ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య (58)కు మరోసారి చుక్కెదురైంది. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ మరో సారి అభిజిత్ ఖాతాను సస్పెండ్ చేసింది. సోమవారం ఉదయం ఖాతా యాక్టివేట్ అయిన కొద్ది సమయంలోనే అతనికి నిరాశ ఎదురైంది. అభిజిత్ ట్విట్టర్ ఖాతా మళ్లీ సస్పెండ్ అయింది. అభిజీత్ తాజాగా తన ట్విటర్ లో మరో ఖాతాను ఓపెన్ చేశారు. ఇది నా అధికారిక ట్విట్టర్ అకౌంట్.. మిగతావన్నీ ఫేక్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇటీవల తాను ట్విట్టర్‌కు దూరంగాతో ఉండడంతో తన ప్రతిష్టను భంగపర్చడానికి కొన్ని నకిలీ ఖాతాలు వచ్చాయని ఈ వీడియో క్లిప్ లో పేర్కొన్నారు. వందేమాతరం ..తాను మళ్లీ వచ్చేశాననీ, దేశద్రోహులు తన నోరు మూయించలేరని వ్యాఖ్యానించారు. భారత సైన్యానికి తన సెల్యూట్’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ట్విట్ చేసిన కొద్ది గంటల్లోనే అభిజీత్ ఖాతా మళ్లీ సస్పెండ్ కావడం విశేషం. కాగా ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని గురించి ట్విటర్లో అసభ్యకరంగా వ్యాఖ్యానించాడన్న కారణంగా అతని ట్విటర్ ఖాతాని ట్విట్టర్ బ్లాక్ చేయడం, దీనికి నిరసనగా మరో బాలీవుడ్ సింగర్ ట్విటర్ ఖతాను ఉపసంహరించుకోవడం తెలిసిన విషయాలే. అయితే ఈ వ్యవహారంపై అభిజీత్ ఇంకా స్పందించలేదు. -
ట్విట్టర్లోకి కొత్త ఖాతాతో మళ్లీ వచ్చారు
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య తిరిగి ట్విటర్‌లోకి వచ్చారు. ఆయన ఖాతాను ట్విటర్ సంస్థ సస్పెండ్ చేసి వారం రోజులు అవుతుండగా ఆయన కొత్త ఖాతాతో తిరిగి అడుగుపెట్టారు. ఓ వీడియోతో ఆయన తన ట్విటర్ అభిమానుల్ని పలకరించారు. నేరపూరితమైన ముఖ్యంగా మహిళలను కించపరిచేలాగా అభిజీత్ ట్విట్టర్లో పోస్ట్‌లు చేస్తుండటంతో ఆయన ఖాతాను ట్విటర్ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో జాతి వ్యతిరేకులపై తన గొంతు ఎప్పటికీ అపలేరు అంటూ తాజా వీడియోతో కొత్త ఖాతా ద్వారా ఆయన ట్విటర్‌లోకి సోమవారం ప్రవేశించారు. ‘ఇది నా కొత్త ట్విటర్ ఖాతా. ఇప్పటి వరకు కూడా నా వెరిఫైడ్ ఖాతా ఇంకా యాక్టివ్ అవ్వలేదు.. దయచేసి నన్ను ఈ ఖాతాలో ఫాలో అవండి. నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలన్నీ కూడా ఫేక్. నా పేరును చెడగొట్టాలనే కొందరు వాటిని ఉపయోగిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేసిన తొలి వీడియోలో అభిజీత్ పేర్కొన్నారు. అంతేకాదు యాష్ ట్యాగ్‌తో వందే మాతరం.. ఐయామ్ బ్యాక్ అంటూ జాతి వ్యతిరేక శక్తులు నా గొంతును ఆపలేరు.. భారత ఆర్మీకి నా వందనం అని పేర్కొన్నారు. -
సినీ గాయకుడికి ట్విట్టర్ షాక్!
-
సినీ గాయకుడికి ట్విట్టర్ షాక్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్యకు ట్విట్టర్ మంగళవారం షాక్ ఇచ్చింది. మహిళల పట్ల అభ్యంతరకరమైన ట్వీట్లు చేయడంతో ఆయన ట్విట్టర్ ఖాతాను రద్దు చేసింది. అనుచితమైన, అవమానకరమైన భాషను వాడుతున్నందుకే ఆయన ఖాతాను రద్దు చేశామని ఆయన పేజీలో ట్విట్టర్ పేర్కొంది. మహిళా జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిని ఉద్దేశించి రెచ్చగొట్టే, విద్వేషపూరిత ట్వీట్లు చేయడంతో గత ఏడాది అభిజీత్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని, హక్కుల కార్యకర్త షెహ్లా రషీద్ పట్ల పలు అభ్యంతరకరమైన ట్వీట్లు చేశాడు. ‘ఆమె రెండుగంటల కోసం డబ్బులు తీసుకొని.. క్లయింట్‌కు సంతృప్తినివ్వలేదన్న రూమర్ ఉంది’ అంటూ వెకిలి కామెంట్లు చేశాడు. పలువురు ఇతర మహిళా నెటిజన్లపైనా ఆయన ఇదేవిధంగా నీచమైన కామెంట్లు చేశాడు. దీనిపై నెటిజన్లు ఫిర్యాదు చేయడంతో ఆయన పేజీని ట్విట్టర్ రద్దు చేసింది. -
దర్శకుడిపై దాడిని సమర్థించిన గాయకుడు
ముంబై: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య దూషణలకు దిగాడు. సినిమా పరిశ్రమపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. బాలీవుడ్ లో హిందూ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తాడు. హిందీ చిత్రపరిశ్రమలో హిజ్రాలు, స్వలింగ సంపర్కులు(గే) ఆధిపత్యం చెలాయిస్తున్నారని మండిపడ్డాడు. సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ లు దాడి చేయడాన్ని అభిజీత్ సమర్థించాడు. ‘హిందు అతివాదుల చర్యలతో హిందువులంతా గర్విస్తున్నారు. ఎవరైనా హిందువులను అగౌరవపరచాలని ప్రయత్నిస్తే దాడులు తప్పవ’ని ట్విటర్ లో హెచ్చరించాడు. అభిజీత్ దూషణలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు పలువురిపై ఆయన నోరు పారేసుకున్నాడు. పద్మావతి సినిమా షూటింగ్ సందర్భంగా జైపూర్ లో సంజయ్ లీలా భన్సాలీపై రాజ్‌పుత్ కర్నిసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
మోదీనే ప్రశ్నిస్తావా.. ఎంత ధైర్యం నీకు?
ముంబై: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై గాయకుడు అభిజీత్ భట్టాచార్య విరచుకుపడ్డారు. కశ్యప్ ను ఊరికే వదిలిపెట్టబోనని హెచ్చరించారు. 'ఎంత ధైర్యం? ఏమాత్రం ప్రాధాన్యత లేని పాకిస్థాన్ నటీనటుల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తావా. నువ్వు అథమస్థాయికి పడిపోతావు. పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడేవారిని వదిలిపెట్టబోము' అని ట్విటర్ లో మండిపడ్డారు. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కశ్యప్ ట్వీట్ చేసిన నేపథ్యంలో అభిజీత్ ఈవిధంగా స్పందించారు. గతేడాది డిసెంబర్ 25న పాకిస్థాన్ ప్రధానమంత్రిని కలిసినందుకు మోదీ ఇంకా క్షమాపణ చెప్పలేదు. అదే సమయంలో కరణ్ జోహర్ 'యే దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్ జరుపుకుంద'ని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. 'యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు మద్దతుగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కశ్యప్ వ్యాఖ్యలను దర్శకుడు మధుర్ బండార్కర్ కూడా తప్పుబట్టారు. ‘అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు తప్పు. బీజేపీగానీ, ప్రభుత్వంగానీ పాకిస్థాన్ నటీనటుల సినిమాలను నిషేధించాలని చెప్పలేదు. ప్రధాని మోదీని విమర్శించడం ట్రెండ్‌గా మారింది’ అని మధుర్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ సింగర్ పై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై: బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ప్రీతీ శర్మ మీనన్ సైబర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిజీత్ మహిళా జర్నలిస్టుపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఆమె ముంబై పోలీసు కమీషనర్ కు ట్వీట్ చేశారు. ఇందులో సింగర్ అసభ్య పదజాలం వాడాడని మీనన్ ఆరోపించారు. దీంతో అభిజీత్ పై ఐపీసీ సెక్షన్ 500,509, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 ప్రకారం పోలీసులు కేసును ఫైల్ చేశారు. ఇటీవల చెన్నైలో చోటు చేసుకున్న ఇన్ఫోసిన్ ఉద్యోగి స్వాతి దారుణ హత్యకు కారణం 'లవ్ జిహాద్' అని అభిజీత్ ట్వీట్ చేశారు. హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుపుతూ స్వాతి చతుర్వేది అనే మహిళా జర్నలిస్ట్ రీట్వీట్ చేశారు. పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ... జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. దీనిపై స్వాతి గతంలోనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ మీనన్ ఫిర్యాదుతో అభిజీత్ పై ఎఫ్ ఐఆర్ నమోదైంది.