దర్శకుడిపై దాడిని సమర్థించిన గాయకుడు | Singer Abhijeet's passes bizarre comments on Sanjay Leela Bhansali | Sakshi
Sakshi News home page

దర్శకుడిపై దాడిని సమర్థించిన గాయకుడు

Published Mon, Jan 30 2017 1:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

దర్శకుడిపై దాడిని సమర్థించిన గాయకుడు

దర్శకుడిపై దాడిని సమర్థించిన గాయకుడు

ముంబై: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య దూషణలకు దిగాడు. సినిమా పరిశ్రమపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. బాలీవుడ్ లో హిందూ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తాడు. హిందీ చిత్రపరిశ్రమలో హిజ్రాలు, స్వలింగ సంపర్కులు(గే) ఆధిపత్యం చెలాయిస్తున్నారని మండిపడ్డాడు.

సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ లు దాడి చేయడాన్ని అభిజీత్ సమర్థించాడు. ‘హిందు అతివాదుల చర్యలతో హిందువులంతా గర్విస్తున్నారు. ఎవరైనా హిందువులను అగౌరవపరచాలని ప్రయత్నిస్తే దాడులు తప్పవ’ని ట్విటర్ లో హెచ్చరించాడు. అభిజీత్ దూషణలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు పలువురిపై ఆయన నోరు పారేసుకున్నాడు.

పద్మావతి సినిమా షూటింగ్ సందర్భంగా జైపూర్ లో సంజయ్ లీలా భన్సాలీపై రాజ్పుత్ కర్నిసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement