బాలీవుడ్ సింగర్ పై ఎఫ్ఐఆర్ నమోదు | FIR Against Singer Abhijeet Bhattacharya | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ సింగర్ పై ఎఫ్ఐఆర్ నమోదు

Published Fri, Jul 15 2016 10:58 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

FIR Against Singer Abhijeet Bhattacharya

ముంబై: బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ప్రీతీ శర్మ మీనన్ సైబర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిజీత్ మహిళా జర్నలిస్టుపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఆమె ముంబై పోలీసు కమీషనర్ కు ట్వీట్ చేశారు. ఇందులో సింగర్ అసభ్య పదజాలం వాడాడని మీనన్ ఆరోపించారు. దీంతో అభిజీత్ పై ఐపీసీ సెక్షన్ 500,509, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 ప్రకారం పోలీసులు కేసును ఫైల్ చేశారు.
 
ఇటీవల చెన్నైలో చోటు చేసుకున్న ఇన్ఫోసిన్ ఉద్యోగి స్వాతి   దారుణ హత్యకు కారణం 'లవ్ జిహాద్' అని  అభిజీత్ ట్వీట్ చేశారు. 
హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసిన విషయాన్ని తెలుపుతూ స్వాతి చతుర్వేది అనే మహిళా జర్నలిస్ట్ రీట్వీట్‌ చేశారు.

పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ... జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. దీనిపై స్వాతి గతంలోనే  ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ మీనన్ ఫిర్యాదుతో అభిజీత్ పై ఎఫ్ ఐఆర్ నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement