మోదీనే ప్రశ్నిస్తావా.. ఎంత ధైర్యం నీకు? | Abhijeet Bhattacharya attacks Anurag Kashyap: You dare to question PM Modi over Pakistanis? | Sakshi
Sakshi News home page

మోదీనే ప్రశ్నిస్తావా.. ఎంత ధైర్యం నీకు?

Published Mon, Oct 17 2016 12:24 PM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

మోదీనే ప్రశ్నిస్తావా.. ఎంత ధైర్యం నీకు? - Sakshi

మోదీనే ప్రశ్నిస్తావా.. ఎంత ధైర్యం నీకు?

ముంబై: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై గాయకుడు అభిజీత్ భట్టాచార్య విరచుకుపడ్డారు. కశ్యప్ ను ఊరికే వదిలిపెట్టబోనని హెచ్చరించారు. 'ఎంత ధైర్యం? ఏమాత్రం ప్రాధాన్యత లేని పాకిస్థాన్ నటీనటుల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తావా. నువ్వు అథమస్థాయికి పడిపోతావు. పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడేవారిని వదిలిపెట్టబోము' అని ట్విటర్ లో మండిపడ్డారు.

ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కశ్యప్ ట్వీట్ చేసిన నేపథ్యంలో అభిజీత్ ఈవిధంగా స్పందించారు. గతేడాది డిసెంబర్ 25న పాకిస్థాన్ ప్రధానమంత్రిని కలిసినందుకు మోదీ ఇంకా క్షమాపణ చెప్పలేదు. అదే సమయంలో కరణ్ జోహర్ 'యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా షూటింగ్ జరుపుకుంద'ని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. 'యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాకు మద్దతుగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కశ్యప్ వ్యాఖ్యలను దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ కూడా తప్పుబట్టారు. ‘అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలు తప్పు. బీజేపీగానీ, ప్రభుత్వంగానీ పాకిస్థాన్ నటీనటుల సినిమాలను నిషేధించాలని చెప్పలేదు. ప్రధాని మోదీని విమర్శించడం ట్రెండ్‌గా మారింది’ అని మధుర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement