ట్విట్టర్‌లోకి కొత్త ఖాతాతో మళ్లీ వచ్చారు | Abhijeet Bhattacharya back on Twitter with new account | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లోకి కొత్త ఖాతాతో మళ్లీ వచ్చారు

Published Mon, May 29 2017 5:45 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

ట్విట్టర్‌లోకి కొత్త ఖాతాతో మళ్లీ వచ్చారు

ట్విట్టర్‌లోకి కొత్త ఖాతాతో మళ్లీ వచ్చారు

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అభిజీత్‌ భట్టాచార్య తిరిగి ట్విటర్‌లోకి వచ్చారు. ఆయన ఖాతాను ట్విటర్‌ సంస్థ సస్పెండ్‌ చేసి వారం రోజులు అవుతుండగా ఆయన కొత్త ఖాతాతో తిరిగి అడుగుపెట్టారు. ఓ వీడియోతో ఆయన తన ట్విటర్‌ అభిమానుల్ని పలకరించారు. నేరపూరితమైన ముఖ్యంగా మహిళలను కించపరిచేలాగా అభిజీత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేస్తుండటంతో ఆయన ఖాతాను ట్విటర్‌ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో జాతి వ్యతిరేకులపై తన గొంతు ఎప్పటికీ అపలేరు అంటూ తాజా వీడియోతో కొత్త ఖాతా ద్వారా ఆయన ట్విటర్‌లోకి సోమవారం ప్రవేశించారు.

‘ఇది నా కొత్త ట్విటర్‌ ఖాతా. ఇప్పటి వరకు కూడా నా వెరిఫైడ్‌ ఖాతా ఇంకా యాక్టివ్‌ అవ్వలేదు.. దయచేసి నన్ను ఈ ఖాతాలో ఫాలో అవండి. నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలన్నీ కూడా ఫేక్‌. నా పేరును చెడగొట్టాలనే కొందరు వాటిని ఉపయోగిస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేసిన తొలి వీడియోలో అభిజీత్‌ పేర్కొన్నారు. అంతేకాదు యాష్‌ ట్యాగ్‌తో వందే మాతరం.. ఐయామ్‌ బ్యాక్‌ అంటూ జాతి వ్యతిరేక శక్తులు నా గొంతును ఆపలేరు.. భారత ఆర్మీకి నా వందనం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement