ఆకట్టుకుంటున్న మార్వెల్‌ ‘హాక్‌ ఐ’ ట్రైలర్‌ | Marvel Cinematic Universe Hawkeye Trailer Release | Sakshi
Sakshi News home page

Marvel Cinematic Universe Hawkeye: ఆకట్టుకుంటున్న మార్వెల్‌ ‘హాక్‌ ఐ’ ట్రైలర్‌

Published Tue, Sep 14 2021 10:45 AM | Last Updated on Tue, Sep 14 2021 11:16 AM

Marvel Cinematic Universe Hawkeye Trailer Release - Sakshi

హాలీవుడ్‌ సినిమాల్లో మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌(ఎమ్‌సీయూ) మూవీస్‌కి ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ఆ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎమ్‌సీయూ నుంచి 2019లో వచ్చిన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. జేమ్స్‌ కామెరూన్‌ ఫాంటసీ మూవీ ‘అవతార్‌’ని దాటి ప్రపంచంలోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా అవెంజర్స్‌ నిలిచింది. ఆ ఫ్రాంఛైజీలో ఇప్పటికే 25కి పైగా సినిమాలు, కొన్ని టీవీ సిరీస్‌లు రిలీజై ప్రేక్షకుల ఆదరణ పొందాయి.

తాజాగా ఆ ఎమ్‌సీయూ నుంచి వస్తున్న మరో టీవీ సిరీస్‌ ‘హాక్‌ ఐ’. దీనికి సంబంధించి ఇంగ్లీష్‌ ట్రైలర్‌ సోమవారం (సెప్టెంబర్‌ 13న) విడుదలైంది. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తర్వాత నుంచి కథ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్వెల్‌ మూవీస్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ సిరీస్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 24న విడుదల కానుంది. అయితే ఇటీవల ఈ ఫ్రాంఛైజీ నుంచి ‘షాంగ్ చీ: ది లెజెండ్‌ ఆఫ్‌ టెన్‌ రింగ్స్‌’ విడుదలై ఎమ్‌సీయూలోనే బెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement