Top Rated Movies in BookMyShow | 2019 | Best Rated Telugu Movies in BMS - Sakshi
Sakshi News home page

2019: భారత్‌లో టాప్‌ టెన్‌ సినిమాలు

Published Tue, Dec 31 2019 12:49 PM | Last Updated on Tue, Dec 31 2019 1:32 PM

2019 Roundup: Top Movies In India - Sakshi

భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. బయోపిక్‌ ట్రెండ్‌లను దాటి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న ప్రధాన సంఘటనలను కూడా తెరకెక్కించవచ్చని ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌, మిషన్‌ మంగళ్‌ నిరూపించాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్న జనం చిన్న సినిమాలను ఆదరిస్తున్నారని ప్రాంతీయ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి కావాల్సిన కొలమానాలు మారిపోయాయి.

కేవలం కలెక్షన్లు వచ్చిన సినిమాలే కాకుండా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్‌ పరీక్షలో పాస్‌ అయినట్టు లెక్క. ఇది కొత్తసంవత్సరంలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఏడాది భారత చిత్రపరిశ్రమలో సాహసాలు చేసిన సినిమాలు కొన్ని అంచనాలకు మించి సక్సెస్‌ అవుతే మరికొన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. సినిమా బాగుందంటే చాలు.. ప్రాంతీయ, జాతీయ బేధాలను లెక్క చేయకుండా ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుని ఆదరించడమే భారతీయ చిత్ర పరిశ్రమ లక్షణం. ఈ క్రమంలో 2019కు గానూ జాతీయ అంతర్జాతీయ సినిమాలు ఏవి టాప్‌లో నిలిచాయో రౌండేద్దాం..

బుక్‌మైషోలో రికార్డు
ఒకప్పటిలా సినిమా చూడాలంటే పొద్దునే లేచి బారెడంత క్యూలో నిలబడాల్సిన పని లేదు. సినిమా విడుదల కాక ముందే ఫోన్‌లో ఉన్న యాప్‌తో టికెట్‌ కొనేసి రెడీగా ఉండచ్చు. ఇలాంటి యాప్‌లు ఈ మధ్య కాలంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే సినిమా టికెట్లతో పాటు, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు సైతం టికెట్లు బుక్‌ చేసుకునే ‘బుక్‌ మై షో’ ఓ ముఖ్య విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది బుక్‌మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘అవెంజర్స్‌: ది ఎండ్‌గేమ్‌’ అనే హాలీవుడ్‌ మూవీ రికార్డు సృష్టించింది. 5.7 మిలియన్ల టికెట్ల అమ్మకాలతో భారతీయ చిత్రం ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విమ

టాప్‌ టెన్‌ ఇండియన్‌ సినిమాలు
అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌
ఉరి: ద సర్జికల్‌ స్టైక్‌
కబీర్‌ సింగ్‌
సాహో
వార్‌
ద లయన్‌ కింగ్‌
మిషన్‌ మంగళ్‌
సింబా
గల్లీబాయ్‌
చిచోరే

భారత్‌లో హవా కనబర్చిన అంతర్జాతీయ సినిమాలు

  • జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌
  • వండర్‌
  • వెధరింగ్‌ విత్‌ యు
  • పాడింగ్‌టన్‌ 2
  • బ్లూ ప్లానెట్‌ 2
  • హస్ట్లర్స్‌
  • విలేజ్‌ రాక్‌స్టార్స్‌
  • మైల్‌ 22
  • హరే కృష్ణ
  • ఎ ప్రైవేట్‌ వార్‌

టాప్‌ 5 తెలుగు సినిమాలు

⇔ సైరా సరసింహ రెడ్డి
⇔ సాహో
⇔ మహర్షి
⇔ ఎఫ్‌2
⇔ మజిలీ

టాప్‌ 5 బెంగాలీ సినిమాలు

♦ దుర్గేష్‌గోరర్‌ గుప్తోధోన్‌
♦ గుమ్నామీ
♦ కొంఠో
♦ మిటిన్‌ మషి
♦ గోట్రో

టాప్‌ 5 తమిళ సినిమాలు

⇒ బిగిల్‌
⇒ పేట
⇒ విశ్వాసం
⇒ నెర్కొండ పార్వై
⇒ ఖైదీ

టాప్‌ 5 మరాఠీ సినిమాలు

ముంబై పుణె ముంబై 3
ఠాక్రే
హిర్కానీ
ఆనంది గోపాల్‌
భాయ్‌- వ్యక్తి కి వల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement