ఆ నటుడితో సింగర్‌ డేటింగ్‌? | Selena Gomez confessed she has a crush on Chris Evans | Sakshi
Sakshi News home page

Selena Gomez And Chris Evans: క్రిస్ ఎవాన్స్‌తో పాప్‌ సింగర్‌ సెలెనా డేటింగ్‌?

Published Sat, Oct 9 2021 12:31 PM | Last Updated on Sat, Oct 9 2021 2:07 PM

Selena Gomez confessed she has a crush on Chris Evans - Sakshi

మార్వెల్‌ సం​స్థ నిర్మించిన అవెంజర్స్‌ సిరీస్‌లో కెప్టెన్‌ అమెరికాగా చేసిన క్రిస్ ఎవాన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాగే పాప్‌ సింగర్‌ సెలెనా గోమెజ్‌కి కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి గురించి క్రేజీ రూమర్‌ ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

గతంలో ఓ షోలో పాల్గొన్న సెలెనాని ‘ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు, మీ నంబర్ వన్ హాలీవుడ్ క్రష్ ఎవరు? అని హోస్ట్‌ అడగగా.. ‘నాకు  క్రిస్ ఎవాన్స్‌పై క్రష్‌ ఉంది. అతను చాలా అందంగా ఉంటాడ’ని తెలిపింది. కాకపోతే అతనితో ప్రేమ అనేది జరగక పోవచ్చని ఈ బ్యూటీ చెప్పింది.

అయితే తాజాగా కెప్టెన్‌ అమెరికా నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెలెనాని ఫాలో అవ్వడం స్టార్ట్‌ చేశాడు. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వారి అభిమానులు సైతం వారు ప్రేమలో ఉన్నారంటూ కొన్ని పిక్స్‌ను వైరల్‌ చేస్తున్నారు. కాగా వారిద్దరూ కలిసినట్లు ఫోటోకి ఒకటి కూడా లేకపోవడం గమనార్హం. కాగా క్రిస్‌ ఇంతకుముందు  జెస్సికా బీల్‌, జెన్నీ స్లేట్‌తో డేటింగ్‌ చేయగా.. ఈ పాప్‌ సింగర్‌ ఫేమస్‌ పాప్‌ గాయకుడు జస్టిన్‌ బీబర్‌, ప్రియాంక చోప్రా హజ్బెండ్‌తో డేటింగ్‌ చేసింది.

చదవండి: జేమ్స్‌ బాండ్ స్టార్ డేనియల్‌ క్రెగ్‌కి అరుదైన గౌరవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement