
దీపావళీ కానుకగా నవంబర్ 4న డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు ఎటర్నెల్స్ అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు, భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. థేనా అనే సూపర్ వుమెన్ గెటెప్ లో ఏంజెలీనా తన ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఎవెంజర్స్‌కి మించిన పవర్స్‌తో ఎటర్నెల్స్‌లో సూపర్ హీరోలు అద్భుతమైన విన్యాసాలు చేయనున్నారు. అలానే ఈ సినిమాలో ఇండియన్ వెడ్డింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయని డిస్నీ ఇండియా బృందం తెలిపింది. బిగ్ స్క్రీన్ పై ఎటర్నెల్స్ లో ఉన్న సూపర్ హీరోలు ప్రేక్షకులకి వీనుల విందు ఇవ్వనున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించింది.
చదవండి: అవెంజర్స్ నటుడు క్రిస్ ఎవాన్స్‌తో పాప్ సింగర్ సెలెనా డేటింగ్?

Comments
Please login to add a commentAdd a comment