అవెంజర్స్‌ సూపర్‌ విలన్‌పై మ్యాన్‌ క్రష్‌ ఉందంటున్న ఆక్వామ్యాన్‌ స్టార్‌ | AquaMan Star Jason Momoa Reveals That He Had Man Crush on Avengers Super Villain | Sakshi
Sakshi News home page

అవెంజర్స్‌ సూపర్‌ విలన్‌పై మ్యాన్‌ క్రష్‌ ఉందంటున్న ఆక్వామ్యాన్‌ స్టార్‌

Published Mon, Oct 18 2021 3:16 PM | Last Updated on Mon, Oct 18 2021 3:16 PM

AquaMan Star Jason Momoa Reveals That He Had Man Crush on Avengers Super Villain - Sakshi

హాలీవుడ్‌ మూవీ ఆక్వామ్యాన్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో  లీడ్‌ రోల్‌ చేసిన జాసన్ మోమోవాకి ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఈ యాక్షన్‌ హీరో ప్రస్తుతం చేస్తున్న మూవీ డ్యూన్‌. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇందులో తన కో-స్టార్‌ జోష్‌ బ్రోలిన్‌పై క్రష్‌ ఉందని తెలిపాడు.

డ్యూన్‌ సినిమాలో పనిచేయడంతో తన ఫేవరెట్‌ యాక్టర్స్‌తో నటించే అవకాశం కలిగిందని జాసన్ తెలిపాడు. అతను మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పనిచేసిన చాలా మందిపై నాకు మ్యాన్‌ క్రష్‌ ఉంది. ముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్‌’లో విలన్‌గా చేసిన జోష్‌ బ్రోలిన్‌పై ఇంకా ఎప్పటినుంచో ఉండేది. అతను నాకు సోదరుడిలాంటి వాడు. చాలా విషయాల్లో మాకు పోలికలు ఉంటాయి. మేము ఈ బ్రోమాన్స్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాం’ అని చెప్పాడు. కాగా అకాడమీ అవార్డు నామినేషన్‌ దక్కించుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 22న ఇండియాలో విడుదల కానుంది.

చదవండి: జేమ్స్‌ బాండ్ స్టార్ డేనియల్‌ క్రెగ్‌కి అరుదైన గౌరవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement