నివేధా పేతురాజ్
తమ కథను ఎక్కువ మందికి చేరాలని ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకుంటాడు. అందుకే కేవలం తమ ప్రాంతానికే పరిమితం అయిపోకుండా తమ ఇండస్ట్రీలను దాటి పక్క ఇండస్ట్రీల్లోకి ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలనే ముమ్మరంగా చేస్తున్నారు తమిళ భామ నివేధా పేతురాజ్. ‘తిమిరు పుడిచవాన్, టిక్ టిక్ టిక్’ వంటి సినిమాల్లో కనిపించారు. తెలుగులో ‘మెంటల్ మదిలో’ నటించారు.
లేటెస్ట్‌గా నివేధా తన అదృష్టాన్ని హాలీవుడ్‌లో టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. హాలీవుడ్‌లో ‘అవెంజర్స్’ ఫ్రాంచైజ్‌లో ఓ పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్తున్నారామె. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘మే, జూన్ నెలల్లో ఆడిషన్స్ కోసం అమెరికా వెళ్లి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని... ఎప్పటి నుంచో అది నా డ్రీమ్. హాలీవుడ్‌లో ఏదో ఒకటి సాధిస్తాననే నమ్మకం నాకుంది’’ అని ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం నివేధ చేతిలో మూడు తమిళ చిత్రాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment