I Want To Act In Baahubali 3: Samuel Jackson - Sakshi
Sakshi News home page

బాహుబలి 3లో నటించాలనుంది!

Mar 12 2019 3:11 AM | Updated on Mar 12 2019 10:50 AM

I want to star in 'Baahubali 3 - Sakshi

సామ్యూల్‌ ఎల్‌ జాక్సెన్‌

దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’తో  తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి మార్కెట్‌ను ఏర్పరిచారు. తాజాగా హాలీవుడ్‌ నటులు సైతం ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వాలనుందనే ఆకాంక్షను వ్యక్తపరచడం విశేషం. హాలీవుడ్‌లో ‘అవెంజెర్స్‌’ సిరీస్‌ను బాగా ఫాలో అయ్యేవాళ్లకు నిక్‌ఫ్యూరీ పాత్రధారి సామ్యూల్‌ ఎల్‌ జాక్సెన్‌ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. లేటెస్ట్‌గా సామ్యూల్‌ ‘క్యాప్టన్‌ మార్వెల్‌’ చిత్రంలో కనిపించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ‘ఇండియన్‌ సినిమాల్లో (బాలీవుడ్‌) భాగమవాలనుకుంటే ఏ సినిమాలో నటిస్తారు? అని సామ్యూల్‌ని అడగ్గా ‘బాహుబలి 3’లో నటించాలనుంది అన్నారు. ‘బాహుబలి 3’ ఉంటుందో లేదో చెప్పలేం కానీ హాలీవుడ్‌ నటులను సైతం ‘బాహుబలి’ చిత్రం ఏ స్థాయిలో ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement