Samuel Jackson
-
బాహుబలి 3లో నటించాలనుంది!
దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’తో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి మార్కెట్‌ను ఏర్పరిచారు. తాజాగా హాలీవుడ్ నటులు సైతం ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వాలనుందనే ఆకాంక్షను వ్యక్తపరచడం విశేషం. హాలీవుడ్లో ‘అవెంజెర్స్’ సిరీస్‌ను బాగా ఫాలో అయ్యేవాళ్లకు నిక్ఫ్యూరీ పాత్రధారి సామ్యూల్ ఎల్ జాక్సెన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. లేటెస్ట్గా సామ్యూల్ ‘క్యాప్టన్ మార్వెల్’ చిత్రంలో కనిపించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ‘ఇండియన్ సినిమాల్లో (బాలీవుడ్) భాగమవాలనుకుంటే ఏ సినిమాలో నటిస్తారు? అని సామ్యూల్‌ని అడగ్గా ‘బాహుబలి 3’లో నటించాలనుంది అన్నారు. ‘బాహుబలి 3’ ఉంటుందో లేదో చెప్పలేం కానీ హాలీవుడ్ నటులను సైతం ‘బాహుబలి’ చిత్రం ఏ స్థాయిలో ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. -
బాహుబలి 3లో నటిస్తా : హాలీవుడ్ స్టార్
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకువచ్చిన విజువల్ వండర్ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించింది. పలు హాలీవుడ్ చిత్రాల కన్నా ఎక్కువ కలెక్షన్లు సాదించిన బాహుబలి హాలీవుడ్ స్టార్లను సైతం ఆకట్టుకుంది. తాజాగా హాలీవుడ్ యాక్టర్ సామ్యూల్ ఎల్ జాక్సన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ అవకాశం ఇస్తే బాహుబలి 3లో నటిస్తానన్నారు. ఎవెంజర్స్ సీరిస్‌లోని నిక్ ఫ్యూరీ పాత్రలో ఫేమస్ అయిన సామ్యూల్ ఇండియన్ సినిమాలో నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా బాహుబలి సీరిస్‌లో నటించాలనుందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. మరి ఈ హాలీవుడ్ స్టార్ కోరికను రాజమౌళి తీరుస్తాడో లేదో చూడాలి. -
పుజారా డబుల్ సెంచరీ
శామ్యూల్ జాక్సన్ శతకం ఇండియా బ్లూ 693/6 డిక్లేర్డ్ ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్ 16/2 గ్రేటర్ నోయిడా: చతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ డబుల్ సెంచరీ (363 బంతుల్లో 256 నాటౌట్; 28 ఫోర్లు)తో చెలరేగాడు. దీంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్స్‌ను 168.2 ఓవర్లలో 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శామ్యూల్ జాక్సన్ (204 బంతుల్లో 134; 15 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా రవీంద్ర జడేజా (66 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అంతకుముందు 362/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బ్లూ జట్టు... అదే స్కోరు వద్ద దినేశ్ కార్తీక్ (69 బంతుల్లో 55; 8 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. అయితే జాక్సన్ సహకారంతో పుజారా చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఆటతీరుతో రెడ్ బౌలర్లు బెంబేలెత్తారు. ఐదో వికెట్‌కు ఏకంగా 243 పరుగులు జత చేరాయి. అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ రెండు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. రోజు ముగిసే సమయానికి 9 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 16 పరుగులతో ఉంది. క్రీజులో శిఖర్ ధావన్ (14 బ్యాటింగ్), యువరాజ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.