పుజారా డబుల్ సెంచరీ
శామ్యూల్ జాక్సన్ శతకం
ఇండియా బ్లూ 693/6 డిక్లేర్డ్
ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్ 16/2
గ్రేటర్ నోయిడా: చతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ డబుల్ సెంచరీ (363 బంతుల్లో 256 నాటౌట్; 28 ఫోర్లు)తో చెలరేగాడు. దీంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్స్‌ను 168.2 ఓవర్లలో 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శామ్యూల్ జాక్సన్ (204 బంతుల్లో 134; 15 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా రవీంద్ర జడేజా (66 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అంతకుముందు 362/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బ్లూ జట్టు...
అదే స్కోరు వద్ద దినేశ్ కార్తీక్ (69 బంతుల్లో 55; 8 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. అయితే జాక్సన్ సహకారంతో పుజారా చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఆటతీరుతో రెడ్ బౌలర్లు బెంబేలెత్తారు. ఐదో వికెట్‌కు ఏకంగా 243 పరుగులు జత చేరాయి. అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ రెండు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. రోజు ముగిసే సమయానికి 9 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 16 పరుగులతో ఉంది. క్రీజులో శిఖర్ ధావన్ (14 బ్యాటింగ్), యువరాజ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.