తొలి రోజే 750 కోట్లా! | Avengers Endgame Writes New Records at The Chain Box office | Sakshi
Sakshi News home page

తొలి రోజే 750 కోట్లా!

Published Thu, Apr 25 2019 2:08 PM | Last Updated on Thu, Apr 25 2019 2:08 PM

Avengers Endgame Writes New Records at The Chain Box office - Sakshi

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా అన్ని రికార్డ్‌లను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 20 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో కూడా ఈ సినిమాకు అడ్వన్స్‌ బుకింగ్స్‌ అదే స్థాయిలో కనిపిస్తున్నాయి.

మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ టికెట్ల కోసం థియేరట్ల ముందు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. అయితే చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో ఈ సినిమా విడుదలైంది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా తొలి రోజు సంచనాలు నమోదు చేసింది. ఒక్క రోజులోనే దాదాపు 750 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చెప్పుతున్నారు.

దీంతో తొలి రోజు ఆసియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ చరిత్ర సృష్టించింది. ఈ ఊపు చూస్తుంటే అవతార్ సినిమా రికార్డ్‌లు కూడా బద్ధలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement