
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన హ్యట్రిక్ చిత్రం ‘పుష్ప’. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవలె రిలీజ్ అయిన పుష్ప టీజర్ ప్రస్తుతం కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. ఇందులోని మ్యూజిక్‌ను దేవీ కాపీ కొట్టారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి. బన్నీ బర్త్‌డే(ఏప్రిల్ 8) సందర్భంగా విడుదలైన టీజర్...ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్, 9 లక్షలకు పైగా లైకులు సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ బీజీఎంను ప్రముఖ హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి దేవీ శ్రీ కాపీ కొట్టాడని పలువరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
టీజర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచిన దేవీ మ్యూజిక్ తన సొంతంగా కంపోజ్ చేసింది కాదని, ఇది పక్కా కాపీ పేస్ట్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై మూవీ టీం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
It's just a coincidence franss 🏃
— Chandu Tarak ⚡ (@ChanduTarak99) April 7, 2021
Paavam DSP !! pic.twitter.com/T3Svk9g7yK
చదవండి : పుష్ప : అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతంటే?
బన్నీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. అది ‘పుష్ప’కే సొంతం
Comments
Please login to add a commentAdd a comment