హాలీవుడ్ భామ, వీరులపై ' ఆల్ ఇండియా బక్చోడ్' | Comedy collective 'All India Bakchod' came up with a bunch of fake movie posters | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ భామ, వీరులపై ' ఆల్ ఇండియా బక్చోడ్'

Published Sat, Apr 9 2016 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

Comedy collective 'All India Bakchod' came up with a bunch of fake movie posters

హాలీవుడ్ కండల వీరులు, భామలతో తయారుచేసిన ఫేక్ మూవీ పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరీ కింద ఉన్న వాటిపై ఓ సారి చూద్దాం.


జయహో రాంబో పేరుతో విడుదల చేసిన పోస్టర్లో జయ్ మాతా దీ అని రాసి ఉన్న శాలువాతో,  ఈ చిత్రానికి ఎమ్ఎమ్ మిఠాయివాలా దర్శకత్వం వహించారని చూపుతున్నాయి. నా ఫాస్ట్ నా ఫ్యూరియస్ పేరుతో ఫాస్ట్ అండ్ ఫూరియస్ వీరులు నెత్తి మీద నెహ్రూ టోపీతో కనిపిస్తున్నారు.


ఇక హల్క్ చిత్రంపై తయారుచేసిన ఫోటోలో ఎడ్వర్డన్ నార్టన్ నటించిన ది ఇన్క్రిడబుల్ ఇండియా హల్క్ పేరుతో ఉంచారు. కుంగ్ పాండాలోని పాండా పూజారి వేషంలో పూజ చేస్తున్న కనిపించే చిత్రంతో అలరిస్తోంది. హాలీవుడ్ భామలు అచ్చమైన చీరకట్టుతో నిల్చున్న చిత్రంతో పవిత్ర అప్సరసలు అనే పేరుతో ఉంచారు.

సర్కారీ ఇన్స్పెక్ట్రీ పేరుతో సమీర్ మన్దేశాని దర్శకత్వం అని రాశారు. కె క్రిష్ ఇవాన్షీ ఇన్ పెష్వా అమెరికా అన్న పదాలతో చివరిగా కెప్టెన్ అమెరికా హీరో చిత్రాన్ని ఎడిట్ చేశారు. వీటన్నింటిని ఫోటోషాప్ ద్వారా చిత్రికరించి జోక్లుగా తయారు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement