కరోనా : రంగంలోకి దిగిన స్పైడర్‌ మ్యాన్‌! | Man In Spiderman Dress Helping To The Elderly In Turkey | Sakshi
Sakshi News home page

కరోనా : రంగంలోకి దిగిన స్పైడర్‌ మ్యాన్‌!

Published Mon, Apr 20 2020 4:09 PM | Last Updated on Mon, Apr 20 2020 4:15 PM

Man In Spiderman Dress Helping To The Elderly In Turkey - Sakshi

స్పైడర్‌ మ్యాన్‌ వేషధారణలో బురఖ్‌ సోయ్‌లు

అంకారా : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవటానికి మార్వెల్‌ సూపర్‌ హీరో రంగంలోకి దిగాడు. భవంతుల మీద గెంతులేయకుండా, కంటికి కనిపించని శత్రువుతో పోరాడకుండా తన వంతు సహాయం చేస్తున్నాడు. అతీత శక్తుల్లేని ఈ సూపర్‌ హీరో నేల మీద నడుస్తూ తన చుట్ట పక్కల ఇళ్ల వారికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన బురఖ్‌ సోయ్‌లు స్పైడర్‌ మ్యాన్‌లా డ్రెస్‌ వేసుకుని లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లనుంచి బయటకు కదలలేక ఇబ్బంది పడుతున్న పొరిగిళ్ల ముసలి వారికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. ( గ్లోబల్‌ విలేజ్‌కు మహమ్మారి తూట్లు.. )

నిత్యావసరాలను కొని వారి ఇళ్ల దగ్గరకు చేరుస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అతన్ని అడిగినపుడు ‘‘  పొరిగింటి వారికి సహాయం చేయటమే నాకున్న అద్భుత శక్తి’’ అని అన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఈ స్పైడర్‌ మ్యాన్‌ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. అద్భుత శక్తుల్లేని సూపర్‌ హీరో అంటూ పొగిడేస్తున్నారు. ( సిగ‌రెట్‌తో రాకెట్ల లాంచింగ్‌.. )

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

స్పైడర్‌ మ్యాన్‌ వేషధారణలో బురఖ్‌ సోయ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement