ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : ఈ షూటర్ స్టయిల్‌కి నెటిజన్లు ఫిదా ఫోటో వైరల్‌ | Paris Olympics 2024 Turkey Olympic shooter is the hottest meme | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : ఈ షూటర్ స్టయిల్‌కి నెటిజన్లు ఫిదా ఫోటో వైరల్‌

Published Thu, Aug 1 2024 1:02 PM | Last Updated on Thu, Aug 1 2024 3:17 PM

Paris Olympics 2024 Turkey Olympic shooter is the hottest meme

‘వీడేరా ఫ్రొపెషనల్‌ హిట్‌ మ్యాన్‌’ టర్కీ  ఎయిర్‌ పిస్టల్‌ షూటర్‌పై మీమ్స్‌

ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా టర్కీ ఎయిర్ పిస్టల్ షూటర్

ఒలింపిక్స్‌  క్రీడలు అంటే  హోరా హోరీ పోటీలు,  విజేతలు, రికార్డులు, పతకాలు. అంతేకాదు  అరుదైన ఘట్టాలు, విశేషాలు ఇంకా చాలానే ఉంటాయి. తాజా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో టర్కీ ఒలింపిక్ షూటర్ ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. నాన్‌ ఈస్తటిక్‌ థింక్స్‌ అనే ఎక్స్‌ ఖాతా షేర్‌ చేసిన పోస్ట్‌ ఏకంగా 78 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.  ఎలాంటి ఫ్యాన్సీ పరికరాలు లేకుండా, అతని స్పెషల్‌ లుక్స్‌ నెట్టింట చర్చకు దారి తీశాయి. పలు ఫన్నీ కామెంట్స్‌ మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.  ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా స్పందించారు. విషయం ఏమిటంటే..

టర్కీ ఎయిర్ పిస్టల్ షూటర్ యూసుఫ్ డికేక్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు.   51 ఏళ్ల అథ్లెట్ తన జేబులో  చేయి పెట్టుకుని స్టయిల్‌గా, క్యాజువ్‌ ఇయర్‌ బడ్స్‌తో ,మినిమల్ గేర్‌తో  గురి చూస్తున్న ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. సాధారణంగా షూటర్‌లు రెండు ప్రత్యేకమైన లెన్స్‌లను ఉపయోగిస్తారు, ఒకటి బ్లర్‌ను నివారించడానికి, మరోటి మెరుగైన ఖచ్చితత్వం కోసం, అలాగే బయటి శబ్దాలు డిస్ట్రబ్‌ చేయకుండా ఉండేందుకు స్పెషల్‌ హెడ్‌ఫోన్స్‌ ధరిస్తారు.

కళ్లద్దాలు, బ్లర్‌ను నివారించడానికి లెన్స్‌లు, ఇయర్ ప్రొటెక్టర్‌లతో సహా ప్రత్యేకమైన ఇతర జాగ్రత్తలేవీ లేకుండా, పోటీదారులకు పూర్తి విరుద్ధంగా, యూసుఫ్ డికేక్ గురి పెట్టి విజేతగా నిలిచాడు. దీంతో నెటిజన్లు ప్రొఫెషనల్‌ హిట్‌మ్యాన్‌ అంటూ కమెంట్‌ చేశారు. ఇంకా మీమ్స్ , జోకులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. టర్కీ  రహస్య గూఢచారిని లేదా హిట్‌మ్యాన్‌ని ఒలింపిక్స్‌కు పంపిందంటూ కొంతమంది ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా  తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించడానికి స్వర్ణం గెలవకుండా తప్పించుకున్నాడని  మరికొంతమంది అభిప్రాయపడ్డారు.

టర్కీకి చెందిన యూసుఫ్ డికేక్ , సెవ్వల్ ఇలయిడా తర్హాన్ ఫ్రాన్స్‌లోని డియోల్స్‌లోని చటౌరోక్స్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన ఇదే ఈవెంట్‌లో చారిత్రాత్మక పతకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్రను లిఖించారు. షూటింగ్‌లో టర్కీకి ఇదే తొలి ఒలింపిక్ పతకం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement