ఇంతవరకు ప్రముఖులు, సెలబ్రిటీలు వాడిన వస్తువులు వేలంలో అధిక ధర పలుకుతాయని మనకు తెలుసు. ఇంకొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువులను పిచ్చి వ్యామోహంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనడం చూశాం. అంతేందుకు ప్రముఖుల నవలలు, పుస్తకాలు కూడా అత్యధిక ధరకు అమ్ముడవడం కూడా చూశాం. పుస్తకంలోని ఒక పేజీ కోట్లలో అమ్ముడవడం గురించి తెలుసా మీకు!.
అసలు విషయంలోకెళ్తే...1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పేజీ వేలంలో రూ. 24 కోట్లకు అమ్ముడుపోయింది. స్పైడర్ మ్యాన్ 1962 నాటి ప్రచురణతో కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి. కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఇది అందరీ ఇంటి పేరుగా మారిపోయింది. అంతేకాదు చలన చిత్రాలు, వెబ్‌సీరీస్, యానిమేటెడ్ చిత్రాల వరకు ఈ స్పైడరమేన్ పాత్ర విస్తరిస్తూనే ఉంది.
ఇటీవల డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ హిట్ అయిన విధానాన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది ఆ పాత్రకు ఉన్న ఆదరణ. అంతేగాదు కోవిడ్-19 ఆంక్షల మధ్య అభిమానులు టిక్కెట్లు కొనుక్కొని థియేటర్లలో సినిమా చూసేందుకు ఎగబడ్డారు. పైగా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడూ 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీ వేలంలో ఇంత ధర పలకడంతో ఆ పాత్రకు ఉన్న ప్రజాదారణ మరోసారి తేటతెల్లం అయ్యింది.
(చదవండి: ఆ చిన్నారి బరువుని చూసి డాక్టర్లే ఆశ్యర్యపోతున్నారు!..రక్త పరీక్షలు కూడా నిర్వహించలేరట !)
Comments
Please login to add a commentAdd a comment