
భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చాయి. కానీ 31 ఏళ్ల క్రితం జపాన్ వాళ్లు ఇండియన్ టీమ్‌తో కలిసి రామాయణాన్ని యానిమేషన్ రూపంలో తెరకెక్కించారు. ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’(Ramayana: The Legend Of Prince Rama Movie) పేరుతో తెరకెక్కిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. నేడు(జనవరి 24) ఇండియాలో రిలీజైంది. మరి ఈ జపనీస్ రామాయణం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. రాముడి జననం గురించి మొదట వాయిస్ ఓవర్‌లో చెప్పి, ఆయనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కథను ప్రారంభించారు.రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడటం మొదలు.. సీతా పరిణయం, ఆరణ్యవాసంలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహారణం, రామ, రావణల యుద్దం వరకు ఈ చిత్రంలో చూపించారు(Ramayana: The Legend Of Prince Rama Movie Review)
విశ్లేషణ
రాముడి గురించి, రామాయణం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ప్రత్యేక ఏంటి? అంటే టెక్నాలజీని ఉపయోగించి కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా.. చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. కాకపోతే తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్ వెర్షన్‌లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపించింది.రాముడి ఎంట్రీతో పాటు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోతాయి. యానిమేషన్ చిత్రమే అయినా నిజంగా కథ జరుగుతున్నంత ఎమోషన్ ని పండించగలిగారు. చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫి, మోషన్ పిక్చర్ క్యాప్చర్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు పాజిటివ్‌గా మారింది. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను చిత్రించారు.1993 లో తీసినా ఇప్పుడు 4K HD క్వాలిటీ అనుగుణంగా సినిమా పిక్చరైజేషన్ చాలా క్లారిటీగా ఉండేలా మార్చారు. జపనీస్ యానిమేషన్ స్టైల్లో తెరకెక్కించినప్పటికీ ఈ తరం పిల్లలు చూడాల్సిన సినిమా ఇది.
Comments
Please login to add a commentAdd a comment