Japan firm
-
‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ మూవీ రివ్యూ
భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చాయి. కానీ 31 ఏళ్ల క్రితం జపాన్ వాళ్లు ఇండియన్ టీమ్‌తో కలిసి రామాయణాన్ని యానిమేషన్ రూపంలో తెరకెక్కించారు. ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’(Ramayana: The Legend Of Prince Rama Movie) పేరుతో తెరకెక్కిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. నేడు(జనవరి 24) ఇండియాలో రిలీజైంది. మరి ఈ జపనీస్ రామాయణం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. రాముడి జననం గురించి మొదట వాయిస్ ఓవర్లో చెప్పి, ఆయనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కథను ప్రారంభించారు.రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడటం మొదలు.. సీతా పరిణయం, ఆరణ్యవాసంలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహారణం, రామ, రావణల యుద్దం వరకు ఈ చిత్రంలో చూపించారు(Ramayana: The Legend Of Prince Rama Movie Review)విశ్లేషణరాముడి గురించి, రామాయణం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ప్రత్యేక ఏంటి? అంటే టెక్నాలజీని ఉపయోగించి కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా.. చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. కాకపోతే తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్ వెర్షన్లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపించింది.రాముడి ఎంట్రీతో పాటు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోతాయి. యానిమేషన్ చిత్రమే అయినా నిజంగా కథ జరుగుతున్నంత ఎమోషన్ ని పండించగలిగారు. చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫి, మోషన్ పిక్చర్ క్యాప్చర్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు పాజిటివ్‌గా మారింది. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను చిత్రించారు.1993 లో తీసినా ఇప్పుడు 4K HD క్వాలిటీ అనుగుణంగా సినిమా పిక్చరైజేషన్ చాలా క్లారిటీగా ఉండేలా మార్చారు. జపనీస్ యానిమేషన్ స్టైల్లో తెరకెక్కించినప్పటికీ ఈ తరం పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. -
నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?
-
నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?
జపాన్‌లో సీఎం చెప్పిన మాటలేమయ్యాయి? ఏపీ ప్రభుత్వ తీరుపై సాఫ్ట్‌బ్యాంక్ అసంతృప్తి 10వేల మెగావాట్ల ప్రాజెక్టు హుష్‌కాకి ప్రస్తుతం వెయ్యి మెగావాట్లేనట! అదీ షరతులకు అంగీకరిస్తేనే సాక్షి, హైదరాబాద్: ‘అక్కడలా చెప్పారు?.. ఇక్కడిలా అంటున్నారు? మిమ్మల్ని నమ్మేదెలా?’ అని జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సందేహాలు వ్యక్తం చేసినట్టు సమాచా రం. సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి ఏపీ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌తో మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌బ్యాంక్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రముఖ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషీసోన్తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు నెలకొల్పితే ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల ప్రాజెక్టును స్థాపించేందుకు సాఫ్ట్‌బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. జపాన్ వెళ్లాక తుది నిర్ణయం: సాఫ్ట్‌బ్యాంక్ ఆర్థిక నిపుణుడు రామన్ నందాతో మంగళవారం సమావేశం సందర్భంగా ఇంధనశాఖ అధికారులు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాము అడిగిన ఆర్థికపరమైన ప్రశ్నలకు అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి పెదవి విరిచినట్లు తెలిసింది. తొలి విడతలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టునే స్థాపిస్తామని, జపాన్ వెళ్లాక తుది నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఆ మాటలేమయ్యాయి?: రాష్ట్ర ప్రభుత్వంపై సాఫ్ట్‌బ్యాంక్ భారీ అంచనాలు పెట్టుకుంది. మెగావాట్ సోలార్ ప్రాజెక్టుకు ఐదు ఎకరాల చొప్పున 10 వేల మెగావాట్లకు 50 వేల ఎకరాలు అవసరం. దీన్ని ప్రభుత్వమే సమకూరుస్తుందని సాఫ్ట్‌బ్యాంక్ ఆశించింది. కొంత భాగమే ఇస్తామని, మిగతా భూమి సంస్థే సేకరించుకోవాలని తాజాగా చర్చల్లో అధికారులు స్పష్టం చేయటం తో సాఫ్ట్‌బ్యాంక్ పునరాలోచనలో పడింది. ఆ విద్యుత్ మా ఇష్టం!: తాము నెలకొల్పే కేంద్ర ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో కొంత ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వీలు కల్పించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. నీటి వసతి, రవా ణా తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వమే భరిం చాలన్న షరతు విధించినట్టు తెలిసింది. బాబుతో సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి భేటీ సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి రామన్ నందా సచివాలయంలో సీఎం బాబుతో భేటీ అయ్యారు. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు, ఉత్పాదన ఖర్చులు తగ్గించుకునేందుకు కలసి పనిచేస్తామన్నారు.