నమ్మి పెట్టుబడి పెట్టేదెలా? | Soft bank disappoints on AP government behaviour | Sakshi
Sakshi News home page

నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?

Published Wed, Dec 10 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?

నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?

జపాన్‌లో సీఎం చెప్పిన మాటలేమయ్యాయి?  
ఏపీ ప్రభుత్వ తీరుపై సాఫ్ట్‌బ్యాంక్ అసంతృప్తి
10వేల మెగావాట్ల ప్రాజెక్టు హుష్‌కాకి
ప్రస్తుతం వెయ్యి మెగావాట్లేనట!
అదీ షరతులకు అంగీకరిస్తేనే

 
సాక్షి, హైదరాబాద్: ‘అక్కడలా చెప్పారు?.. ఇక్కడిలా అంటున్నారు? మిమ్మల్ని నమ్మేదెలా?’ అని జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సందేహాలు వ్యక్తం చేసినట్టు సమాచా రం. సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి ఏపీ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌తో మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌బ్యాంక్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రముఖ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషీసోన్‌తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు నెలకొల్పితే ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల ప్రాజెక్టును స్థాపించేందుకు సాఫ్ట్‌బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది.  
 
 జపాన్ వెళ్లాక తుది నిర్ణయం: సాఫ్ట్‌బ్యాంక్ ఆర్థిక నిపుణుడు రామన్ నందాతో మంగళవారం సమావేశం సందర్భంగా ఇంధనశాఖ అధికారులు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాము అడిగిన ఆర్థికపరమైన ప్రశ్నలకు అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి పెదవి విరిచినట్లు తెలిసింది. తొలి విడతలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టునే స్థాపిస్తామని, జపాన్ వెళ్లాక తుది నిర్ణయం తెలియజేస్తామన్నారు.
 
 ఆ మాటలేమయ్యాయి?: రాష్ట్ర ప్రభుత్వంపై సాఫ్ట్‌బ్యాంక్ భారీ అంచనాలు పెట్టుకుంది. మెగావాట్ సోలార్ ప్రాజెక్టుకు ఐదు ఎకరాల చొప్పున 10 వేల మెగావాట్లకు 50 వేల ఎకరాలు అవసరం. దీన్ని ప్రభుత్వమే సమకూరుస్తుందని సాఫ్ట్‌బ్యాంక్ ఆశించింది. కొంత భాగమే ఇస్తామని, మిగతా భూమి సంస్థే సేకరించుకోవాలని తాజాగా చర్చల్లో అధికారులు స్పష్టం చేయటం తో సాఫ్ట్‌బ్యాంక్ పునరాలోచనలో పడింది.
 
 ఆ విద్యుత్ మా ఇష్టం!: తాము నెలకొల్పే కేంద్ర ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో కొంత ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వీలు కల్పించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. నీటి వసతి, రవా ణా తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వమే భరిం చాలన్న షరతు విధించినట్టు తెలిసింది.
 
 బాబుతో సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి భేటీ
 సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి రామన్ నందా సచివాలయంలో సీఎం బాబుతో భేటీ అయ్యారు. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు, ఉత్పాదన ఖర్చులు తగ్గించుకునేందుకు కలసి పనిచేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement