ఉక్కు మనిషిగా అందరికీ సుపరిచితమైన సర్దార్ వల్లభాయ్ పటేల్, క్లిష్ట పరిస్థితుల్లో గట్టి నిర్ణయాలు తీసుకుని మెరుగైన పాలన అందించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేరు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల్లో కూడా పటేల్ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఆయనలో ఉన్న లక్షణాలను అలవరుచుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు మోదీ. బహుశా ఆ ఇష్టమే ఆయన కోసం అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసేందుకు కారణమయ్యిందేమో!. అంతటి మహోన్నత వ్యక్తి పటేల్‌ని ఎందుకు 'ఉక్కుమనిషి' అని పిలుస్తారో తెలుసుకుందామా!.
స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి బర్డోలీ వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సరిగ్గా స్వాతంత్రం వచ్చే సమయానికి పటేల్ వయసు 72 ఏళ్లు. అయితే దేశంలో స్వాతంత్ర అనంతరం ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు. తొలి నుంచి విభజించు పాలించు అనే సూత్రంతో ఆంగ్లేయులు అఖండ భారతావనిని మత ప్రాతిపదికన రెండు ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ.. వెళ్తూ.. దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అవసరమైతే భారత్‌లో లేదా... పాకిస్థాన్‌లో కూడా విలీనం కావచ్చే లేదంటే మీకు మీరు సొంతంగా రాజ్యాలు ఏలుకోవచ్చు’ అనే స్వేచ్ఛను కూడా ఇచ్చేశారు.
దీంతో సంస్థానాధీశులకు ఎక్కడలేని శక్తి వచ్చింది. ఎవరికివారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి హైదరాబాద్, జూనాగఢ్, కశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్థాన్ కన్నేసింది. ఒకవేళ అవి పాక్‌లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్ల మంటలు భరించాలా? ఇలా కుదరదు.. పిల్ల రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి... దేశమంతా ఒక్కటిగా ఉండాలి.. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి. అదే సమయంలో పటేల్‌కు వయోభారం, అనారోగ్య సమస్యలు ఒక సవాలుగా ఉన్నా వాటిని పక్కన పెట్టి మరి బారతేశాన్ని నిర్మించే పనికి ఉపక్రమించారు. రాష్టాల శాఖకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా దాదాపు 565 రాజరికి రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం వాటి పరిపాలన, సైన్యం వ్యవస్థలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏకీకృతం చేసే స్మారక పనిని భుజానకెత్తుకున్నారు.
వాటిలో వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా భారత సమాఖ్యలో అంతర్భాగమయ్యాయి. ఇక మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ అసాధారణమైన పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంతంగా కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటం వల్ల హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది.
కానీ పైకి మాత్రం స్వాతంత్య్రం అనంతరం మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని చెప్పేవాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అలా హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగించారు పటేల్. ఇక కాశ్మీర్‌ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు.
అయితే దాయాది పాకిస్థాన్ కశ్మీర్‌లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి దీన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370, 35ఏ. దాదాపు 75 ఏళ్లుగా రావణకష్టానికి ఆజ్యం పోసింది. మోదీ ప్రభుత్వం దీనిపై 2019లో సాహసోపేత నిర్ణయం తీసుకుని, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి పూర్తిగా భారత్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఆయన భారత్‌లోని రాజులను అంత చేయకుండా వారి సంస్థనాలను భారత్‌లో వీలినం చేసే సంకల్పాన్ని నేరవేర్చడంలో దృఢంగా వ్యవహరించడంతో ఉక్కుమనిషి సర్థార్ అని ప్రశంసలందుకున్నారు.
అలా ఆయన అవిశ్రాంతంగా దేశం కోసం తాను చేయగలిగినంత వరకు పనిచేశారు. సరిగ్గా నవంబర్ 1950లో, పటేల్ పేగు సంబంధిత రుగ్మత, అధిక రక్తపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తదుపరి చికిత్స కోసం అతన్ని బొంబాయికి తరలించారు. కానీ అతను హార్ట్ స్ట్రోక్‌తో 1950 డిసెంబర్ 15న కన్నుమూయడం జరిగింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి, రాజేంద్ర ప్రసాద్, ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఇతర నాయకులు కదిలి వచ్చారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఏకంగా ఆరు మైళ్ల ఊరేగింపుగా ప్రజలు తరలి వచ్చారు.
బొంబాయిలోని క్వీన్స్ రోడ్‌లోని శ్మశానవాటికలో పటేల్ కుమారుడు దహ్యాభాయ్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. అంతా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి. ధైర్య, విశ్వాసంలో పటేలో ఎందరికో స్ఫూర్తి, ఆయనలాంటి వ్యక్తిన మళ్లీ చూడలేం అని సి రాజగోపాలాచారి అన్నారు. ఇక మౌలానా ఆజాద్ పటేల్ శౌర్యాన్ని పర్వతాల ఎత్తతోనూ, ఆయన దృఢ సంకల్పాన్ని ఉక్కుతోనూ పోల్చారు. ఇక నెహ్రు కూడా ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ నూతన భారతదేశ నిర్మాత, సంఘటితుగా పిలిచారు. దటీజ్ ఉక్కు మనిషి పటేల్..!.
(చదవండి: కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment