Sardar Vallabh Bhai Patel
-
వల్లభాయ్ పటేల్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పటేల్‌కు నివాళులు అర్పించారు. భారతదేశ అభివృద్దికి ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి ఏకత్వం, సామాజిక సంస్కరణలను అందించిన విజన్ ఉన్న నాయకుడు వల్లభాయ్ పటేల్. దేశాన్ని ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారతదేశ అభివృద్దికి ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. Remembering Sardar Vallabhbhai Patel Ji, the Iron Man of India, on his death anniversary. A visionary leader whose contributions to the unification of India and social reforms shaped the nation we are today. His legacy continues to inspire the spirit of unity and progress.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 -
Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారు. ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి హోంమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం భారత్- పాకిస్తాన్ విభజన ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఆ సమయంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హిందూ ముస్లిం అల్లర్లను నియంత్రించడంలో పటేల్ సహకారం మరువలేనిది. ఇంతటి మహాన్నత వ్యక్తి జీవిత చరమాంకంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రోజు(డిసెంబరు 15) సర్దార్ పటేల్ వర్థంతి.చదువులో వెనుకబడినా..వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నదియాడ్‌లో జన్మించారు. ఝవేర్‌భాయ్ పటేల్- లడ్బా దేవిల ఆరుగురు సంతానంలో వల్లభాయ్ పటేల్ నాల్గవవాడు. అతని చదువు నెమ్మదిగా సాగింది. సర్దార్ పటేల్ తన 22 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తదనంతరం ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టర్ అయ్యాడు.ఎనలేని సన్మానాలుస్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్‌కు దేశ విదేశాల్లో ఎంతో గౌరవం లభించింది. 1948 నుండి 1949 మధ్యకాలంలో నాగ్‌పూర్, అలహాబాద్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. 1947 జనవరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖచిత్రం టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది.తప్పిన విమాన ప్రమాదం1949, మార్చి 29న సర్దార్ పటేల్ తన కుమార్తె మణిబెన్,పటియాలా మహారాజుతో కలిసి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డి హావిలాండ్ డోవ్ విమానంలో ఢిల్లీ నుండి జైపూర్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానయాగ అధికాలు తక్కువ ఎత్తులో ప్రయాణించాలని పైలట్‌కు సూచించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం ఎడారిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. నాడు సర్దార్ పటేల్ అక్కడికి సమీప గ్రామంలో బస చేశారు.క్షీణించిన ఆరోగ్యంవిమాన ప్రమాదం నుంచి బయటపడిన పటేల్‌కు పార్లమెంటులో ఘన స్వాగతం లభించింది. విమాన ప్రమాదంపై చర్చల కారణంగా సభా కార్యక్రమాలు అరగంట వరకు ప్రారంభం కాలేదు. కొంతకాలానికి పటేల్ ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో పటేల్ ఓ ప్రైవేట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. నాటి బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ రాయ్ వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన కూడా పటేల్‌కు చికిత్స అందించారు.ఢిల్లీ నుండి ముంబైకి వచ్చి..1950 నవంబర్ న పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయన తరచూ స్పృహ కోల్పోతుండేవారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమయ్యారు. ఢిల్లీలోని వాతావరణం ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బలీసింది. డాక్టర్ రాయ్ సలహా మేరకు పటేల్ ఢిల్లీ నుంచి ముంబైకి తరలివచ్చారు. అ సమయంలో జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, వీపీ మీనన్‌లు ఆయనను పరామర్శించారు.మెరుగుపడని ఆరోగ్యంముంబై చేరుకున్న పటేల్ చాలా బలహీనంగా మారారు. విమానాశ్రయం వెలుపలనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా బిర్లా హౌస్‌కు తీసుకెళ్లారు. ముంబైలో పటేల్ ఆరోగ్యం మెరుగుపడలేదు. 1950, డిసెంబరు 15న తెల్లవారుజామున 3 గంటలకు సర్దార్ పటేల్ గుండెపోటుకు గురయ్యారు. 9.57 గంటలకు కన్నుమూశారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే -
సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.Akasa Air flight diverted to Ahmedabad airport after security alert https://t.co/BMWokfVVF9 pic.twitter.com/itUSAtj16s— DeshGujarat (@DeshGujarat) June 3, 2024 దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్ నుంచి దించివేశారు.‘ఫైట్ కెప్టెన్ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అకాశ్ ఫ్లైట్.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?
ఉక్కు మనిషిగా అందరికీ సుపరిచితమైన సర్దార్ వల్లభాయ్ పటేల్, క్లిష్ట పరిస్థితుల్లో గట్టి నిర్ణయాలు తీసుకుని మెరుగైన పాలన అందించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేరు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల్లో కూడా పటేల్ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఆయనలో ఉన్న లక్షణాలను అలవరుచుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు మోదీ. బహుశా ఆ ఇష్టమే ఆయన కోసం అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసేందుకు కారణమయ్యిందేమో!. అంతటి మహోన్నత వ్యక్తి పటేల్‌ని ఎందుకు 'ఉక్కుమనిషి' అని పిలుస్తారో తెలుసుకుందామా!. స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి బర్డోలీ వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సరిగ్గా స్వాతంత్రం వచ్చే సమయానికి పటేల్ వయసు 72 ఏళ్లు. అయితే దేశంలో స్వాతంత్ర అనంతరం ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు. తొలి నుంచి విభజించు పాలించు అనే సూత్రంతో ఆంగ్లేయులు అఖండ భారతావనిని మత ప్రాతిపదికన రెండు ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ.. వెళ్తూ.. దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అవసరమైతే భారత్‌లో లేదా... పాకిస్థాన్‌లో కూడా విలీనం కావచ్చే లేదంటే మీకు మీరు సొంతంగా రాజ్యాలు ఏలుకోవచ్చు’ అనే స్వేచ్ఛను కూడా ఇచ్చేశారు. దీంతో సంస్థానాధీశులకు ఎక్కడలేని శక్తి వచ్చింది. ఎవరికివారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి హైదరాబాద్, జూనాగఢ్, కశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్థాన్ కన్నేసింది. ఒకవేళ అవి పాక్‌లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్ల మంటలు భరించాలా? ఇలా కుదరదు.. పిల్ల రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి... దేశమంతా ఒక్కటిగా ఉండాలి.. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి. అదే సమయంలో పటేల్‌కు వయోభారం, అనారోగ్య సమస్యలు ఒక సవాలుగా ఉన్నా వాటిని పక్కన పెట్టి మరి బారతేశాన్ని నిర్మించే పనికి ఉపక్రమించారు. రాష్టాల శాఖకు ఇన్ఛార్జ్ మంత్రిగా దాదాపు 565 రాజరికి రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం వాటి పరిపాలన, సైన్యం వ్యవస్థలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏకీకృతం చేసే స్మారక పనిని భుజానకెత్తుకున్నారు. వాటిలో వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా భారత సమాఖ్యలో అంతర్భాగమయ్యాయి. ఇక మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ అసాధారణమైన పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంతంగా కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటం వల్ల హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది. కానీ పైకి మాత్రం స్వాతంత్య్రం అనంతరం మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని చెప్పేవాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అలా హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగించారు పటేల్. ఇక కాశ్మీర్‌ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే దాయాది పాకిస్థాన్ కశ్మీర్‌లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి దీన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370, 35ఏ. దాదాపు 75 ఏళ్లుగా రావణకష్టానికి ఆజ్యం పోసింది. మోదీ ప్రభుత్వం దీనిపై 2019లో సాహసోపేత నిర్ణయం తీసుకుని, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి పూర్తిగా భారత్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఆయన భారత్‌లోని రాజులను అంత చేయకుండా వారి సంస్థనాలను భారత్‌లో వీలినం చేసే సంకల్పాన్ని నేరవేర్చడంలో దృఢంగా వ్యవహరించడంతో ఉక్కుమనిషి సర్థార్ అని ప్రశంసలందుకున్నారు. అలా ఆయన అవిశ్రాంతంగా దేశం కోసం తాను చేయగలిగినంత వరకు పనిచేశారు. సరిగ్గా నవంబర్ 1950లో, పటేల్ పేగు సంబంధిత రుగ్మత, అధిక రక్తపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తదుపరి చికిత్స కోసం అతన్ని బొంబాయికి తరలించారు. కానీ అతను హార్ట్ స్ట్రోక్‌తో 1950 డిసెంబర్ 15న కన్నుమూయడం జరిగింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి, రాజేంద్ర ప్రసాద్, ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వంటి ఇతర నాయకులు కదిలి వచ్చారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఏకంగా ఆరు మైళ్ల ఊరేగింపుగా ప్రజలు తరలి వచ్చారు. బొంబాయిలోని క్వీన్స్ రోడ్‌లోని శ్మశానవాటికలో పటేల్ కుమారుడు దహ్యాభాయ్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. అంతా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి. ధైర్య, విశ్వాసంలో పటేలో ఎందరికో స్ఫూర్తి, ఆయనలాంటి వ్యక్తిన మళ్లీ చూడలేం అని సి రాజగోపాలాచారి అన్నారు. ఇక మౌలానా ఆజాద్ పటేల్ శౌర్యాన్ని పర్వతాల ఎత్తతోనూ, ఆయన దృఢ సంకల్పాన్ని ఉక్కుతోనూ పోల్చారు. ఇక నెహ్రు కూడా ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ నూతన భారతదేశ నిర్మాత, సంఘటితుగా పిలిచారు. దటీజ్ ఉక్కు మనిషి పటేల్..!. (చదవండి: కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?) -
‘పాక్ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది’
గాంధీనగర్/కేవాడియా: గతేడాది పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశం తన బిడ్డలను కోల్పోయిన బాధలో ఉంటే.. కొందరు మాత్రం తమ స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి గురించి పాకిస్తాన్ మంత్రి తమ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో మన ప్రతిపక్షాల నిజస్వరూపం ఏంటో జనాలకు తెలిసింది అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇక్కడ పరేడ్ నిర్వహించిన అధికారులను చూస్తే.. నా మదిలో పుల్వామా దాడి ఘటన మెదిలింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎన్నటికి మరువం. దేశం బిడ్డలను కోల్పోయి బాధపడుతుంటే.. కొందరు మాత్రం స్వార్థపూరితంగా ప్రవర్తించారు’ అన్నారు. (చదవండి: పాక్‌లో ‘పుల్వామా’ చిచ్చు) ‘పుల్వామా దాడిలో కూడా తమ లాభాన్నే చూసుకున్నారు. ఆనాడు వారు చేసిన వ్యాఖ్యలను దేశం మరవదు. వారి ఆరోపణలను నేను మౌనంగా భరించాను. రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కాన ఇప్పుడు పాకిస్తాన్ తమ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో నిజం బయటపడింది. దాంతో ఈ ఘటనపై రాజకీయాలు చేసిన వారి నిజస్వరూపం కూడా బయటపడింది. ఈ సందర్భంగా నేను కోరేది ఒక్కటే.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయకండి’ అన్నారు మోదీ. ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని మోదీ పేర్కొన్నారు -
ఈ దేశపటం.. పటేల్ ఆత్మ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అకుంఠిత దీక్షతో సంస్థానాలను విలీనం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను (అక్టోబర్ 31, 1875–డిసెంబర్ 16, 1950) ‘ఇండియన్ బిస్మార్క్’గా పిలవడం మొదలయింది. అలాగే సర్దార్‌ను కూడా ఉక్కుమనిషి అనే పిలవడం పరిపాటి. పటేల్ గొప్ప భూమిపుత్రుడు. గుజరాత్‌లోని నాదియాడ్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి జవేర్భాయ్ పటేల్, మొదట ఝాన్సీ సంస్థానంలో సైనికుడు. తరువాత రైతు. తల్లి లాడ్‌బాయ్. దైవభక్తురాలు. వల్లభ్‌భాయ్ తన తండ్రితో కలసి పొలంలో దిగి పని చేసినవారు. చిత్రం ఏమిటంటే ఆయన తన 22వ ఏట మెట్రిక్ ఉత్తీర్ణులయ్యారు. మరో పదేళ్లకు 1910లో ఇంగ్లండ్ వెళ్లారు. పటేల్ టెంపుల్ టౌన్లో బారెట్లాలో చేరారు. అదే సంవత్సరం ఇన్నర్ టెంపుల్ ఇన్‌లో బారెట్లాలో చేరారు మరొక భారతీయుడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ. కానీ వయసులో ఇద్దరికీ ఎంతో తేడా. పటేల్ పెట్లాండ్, నాదియాడ్, బోర్సాద్ల నుంచి వస్తే, నెహ్రూ హేరో, కేంబ్రిడ్జ్లలో చదివి ఇన్నర్ టెంపుల్ వెళ్లారు. పటేల్ 26 మాసాల కోర్సును 20 మాసాలలోనే పూర్తి చేశారు. అన్ని పరీక్షలు ఒకేసారి ఉత్తీర్ణుడైనందుకు ఇచ్చే 50 పౌండ్ల బహుమానం కూడా అందుకున్నారు. 1913లో భారత్‌కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కానీ ఆ రోజుల్లో బొంబాయి బారిస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది. తను బొంబాయి ప్రెసిడెన్సీ వాడే అయినా బొంబాయిని ఆయన ఎంచుకోలేదు. తన స్వస్థలం గుజరాత్‌లోనే అహమ్మదాబాద్‌ను ఎంచుకున్నారు. గోధ్రా, బోర్సాద్లలో కూడా పనిచేశారు. 1916కే చాలా ఖరీదైన న్యాయవాదిగా అవతరించారు. గాంధీజీకి కుడిభుజం అనదగిన పటేల్ తొలి రోజులలో ఆయన సిద్ధాంతాల పట్ల ఎలాంటి మక్కువ చూపలేదు. 1915లో గాంధీజీ అహమ్మదాబాద్ వచ్చారు. కొచ్రాబ్‌లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. చాలామంది యువ లాయర్లతో పాటు, ఇతరులు కూడా ఆయన చుట్టూ ఉండేవారు. అహింస, గాంధీజీ చెప్పే జీవన విధానం ఇవన్నీ పటేల్‌ను అప్పుడు ఆకర్షించలేకపోయాయి. కానీ ఒక మిత్రుని సలహా మేరకు మొత్తానికి గాంధీని చూడడానికి వెళ్లారు పటేల్. అంత సాన్నిహిత్యం అనుభవించినా కూడా పటేల్ వెంటనే గాంధీని అనుసరించలేదు. 1916లో గుజరాత్ సభ, అంటే జాతీయ కాంగ్రెస్ గుజరాత్ శాఖ– బాంబే ప్రెసిడెన్సీ కాంగ్రెస్ సభలు నిర్వహించింది. అతివాదులు, మితవాదులు చాలాకాలం తరువాత ఆ వేదిక మీద పక్కపక్కనే ఆసీనులయ్యారు. గుజరాత్‌కు చెందినవానిగా మహమ్మద్ అలీ జిన్నా ఆ సభలకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సభలు కూడా పటేల్‌ను కదిలించలేదు. చరిత్రాత్మకం అని అంతా చెబుతున్న లక్నో సమావేశాలకు కూడా పటేల్ వెళ్లారు. నచ్చలేదు. ఆఖరికి 1917లో ఆ శుభ ముహూర్తం వచ్చింది. గుజరాత్ సభ మరోసారి ప్రెసిడెన్సీ స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఇంగ్లిష్‌లో కాకుండా, మాతృభాషలో అంటే గుజరాతీలో ఉపన్యసించవలసిందిగా గాంధీజీ వక్తలను కోరారు. జిన్నాకు ఇంగ్లిష్ తప్ప తన మాతృభాష గుజరాతీ కూడా రాదు. విఠల్‌భాయ్ పటేల్ (సర్దార్ అన్నగారు) గుజరాతీలో తడబడుతూ మాట్లాడారు. ఇదే తొలిసారిగా గాంధీగారి పట్ల పటేల్‌కు గౌరవ భావాన్ని కలిగించింది. అంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం కాదు, ఆయన పోరాట పంథా కాదు... గుజరాతీ మీద, మాతృభాషల మీద గాంధీజీ ప్రకటించిన గౌరవమర్యాదలే పటేల్‌ను కదిలించాయి. మరి ఆయన గొప్ప భూమిపుత్రుడు కాదా! పటేల్ ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు కూడా భారతీయులను ఏమన్నా అంటే సహించేవారు కాదు. స్వరాజ్య ఉద్యమం అనేక పాయలతో సాగింది. అందులో రైతాంగ పోరాటాలు కూడా భాగమే. గాంధీ తొలిదశలో రైతాంగ ఉద్యమాలే నడిపారు. తరువాత పూర్తి స్థాయి రాజకీయోద్యమం వైపు మొగ్గారు. పటేల్ ప్రయాణం కూడా అలా సాగిందే. ఇది కూడా గాంధీ పట్ల పటేల్ గౌరవాన్ని పెంచింది. ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ ఘడియలు గర్వించదగినవా? అంతకు ముందు దాదాపు సంవత్సరం పాటు భారతభూమి నెత్తురుతో తడియని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. ముస్లింలీగ్ ఆవేశం ముందు గాంధీజీ అహింస కకావికలైంది. దేశంగా రెండుగా చీలిపోవడం అతి పెద్ద విషాదం. ముస్లింలీగ్ రక్తదాహం ఫలితమే అది. అహింసాయు పంథాలో స్వరాజ్యం సాధించిన దేశమన్న కీర్తి కిరణం మాటున ఈ రక్తపాతం అప్పటికి కనుమరుగైంది. కానీ తరువాత తెలిసింది– అధికార మార్పిడి సమయంలో మరే ఇతర దేశంలోను ఇంతటి రక్తపాతం జరగలేదన్న వాస్తవం. అప్పటిదాకా ఉక్కుపాదంతో భారతదేశాన్ని తమ అధీనంలో ఉంచుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఇంతటి హింసను, రక్తపాతాన్ని, దోపిడీని, లూటీని, మానభంగాలను మౌన ప్రేక్షకునిగా వీక్షించింది. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో భారత తాత్కాలిక ప్రభుత్వంలో సర్దార్ పటేల్ హోంశాఖను నిర్వహిస్తున్నారు. నెహ్రూ ప్రధాని. పైగా ప్రధాని పదవికి నెహ్రూ కంటే పటేల్ పట్లే పార్టీలో ఎక్కువ మొగ్గు ఉండేది. గాంధీ మాటను బట్టి పటేల్ ప్రధాని పదవి పోటీ నుంచి వెనక్కు తగ్గారు. నిరాశ పడలేదు. పైగా స్వతంత్ర భారతం పట్ల తనకున్న బాధ్యతను భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేటంత గొప్పగా నిర్వర్తించారు. ఆ కర్తవ్యమే – సంస్థానాల విలీనం. ఆనాడు దేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇవి ఈ దేశంలో అంతర్భాగాలైనప్పటికీ పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది మౌంట్‌బాటన్ విభజన ప్రణాళిక. అది కూడా ఎలాంటి స్వాతంత్య్రం? ఇటు భారత్‌లో విలీనమయ్యే స్వేచ్ఛ, అటు పాకిస్తాన్లో చేరే వెసులుబాటు కూడా 1947, జూన్ 3 నాటి ఆ విభజన ప్రణాళిక కట్టబెట్టింది. సాంస్కృతిక ఏకత్వంతో పాటు రాజకీయ ఏకత్వం కూడా సాధించాలనీ, పాలనాపరంగా ఒకే ఛత్రం కింద దేశం ఉండాలన్న స్వరాజ్య సమరయోధుల ఆశలకి భంగపాటు కలిగించే నిర్ణయమది. నిజంగానే స్వాతంత్య్రం పోరాట స్ఫూర్తిని కాపాడడానికి స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన తొలి కార్యక్రమం సంస్థానాల విలీనం. ఆ పని పటేల్ చేశారు. విలీనాల చరిత్రను గుర్తు చేసుకునే సమయంలో పటేల్‌తో పాటే మరో మహోన్నత వ్యక్తిని కూడా తలుచుకోవాలి. ఆయన వీపీ మేనన్. 1947లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో పటేల్ హోంమంత్రి, ఉపప్రధాని. వీటితో పాటు సంస్థానాల విలీనం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆయన చేతికి వచ్చింది. గాంధీ, నెహ్రూల అభిమతం కూడా ఇదే. ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్ కూడా కొంచెం సహకరించాడు. తాత్కాలిక ప్రభుత్వమే ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మౌంట్‌బాటన్ రాజ్యాంగ వ్యవహారాల కార్యదర్శి వాప్పాళ పంగుణ్ణి మేనన్ (వీపీ మేనన్)ను పటేల్ ఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ ఇద్దరూ కలసి 99 శాతం సంస్థానాల విలీనం పనిని పూర్తి చేశారు. మిగిలిన ఒకటి కశ్మీర్. ఆ పనిని నెహ్రూ తీసుకున్నారు. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ అంటే కశ్మీర్ సమస్యే. వీపీ మేనన్ దూరదృష్టి, పటేల్ జాతీయ దృక్పథం ఆ ఇద్దరిని 1947 జూలై నుంచే సంస్థానాల విలీనం కృషిని ఆగమేఘాల మీద ఆరంభించేటట్టు చేశాయి. సంస్థానాలకు స్వేచ్ఛను ఇవ్వడంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద ప్రణాళికే ఉంది. ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛనిస్తే దేశ ఏకత్వం ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే, దేశంలో 48 శాతం భూభాగం సంస్థానాల కిందే ఉంది. 28 శాతం జనాభా వాటిలో ఉండేది. ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛ కొనసాగి ఉంటే ఏం జరిగేదో చెప్పనక్కరలేదు. నిజానికి సంస్థానాధీశులలో అ«ధికులు బ్రిటిష్ జాతికీ, ప్రభుత్వానికీ కూడా తొత్తులే. వారిలో కొందరి వైఖరి అప్పుడే స్వాతంత్య్రం తెచ్చుకున్న భారత్ ఉనికికే ప్రమాదకరంగా పరిణిమిస్తున్న సంకే తాలు కూడా వెలువడడం మొదలయింది. హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాఘడ్ సంస్థానాలు పాకిస్తాన్లో కలవడానికి సిద్ధమయినాయి. సంస్థానాల విలీనం కోసం పటేల్ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు. వాటిని మూడు వ్యూహాలుగా అమలు చేయించారాయన. మొదటిగా రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాలను వదులుకోవలసందని సంస్థానాధీశులను కోరారు. ఈ మూడు వదులుకుంటే సంస్థాలన్నీ భారత రాజ్యాంగం పరిధికి లోబడినట్టే. కాబట్టి అది రాజకీయ ఐక్యతలో తొలి మెట్టు కాగలదని పటేల్ భావించారు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వంతో గతంలో సంస్థానాలు చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోమని ఆయన సలహా ఇచ్చారు. దీనితో సంస్థానాలకు ఉన్న కొన్ని అధికారాలు రద్దయిపోతాయి. మూడోది అంతిమ అస్త్రం. యూనియనైజేషన్, డెమాక్రటైజేషన్ పేరుతో సంస్థానాలను విలీనం చేయడమే. కొందరిని భరణాలు ఎరవేసి లొంగదీసుకున్నారు. తిరువాన్కూర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాగఢ్, భోపాల్, కశ్మీర్ సంస్థానాధీశులు మొదట మొండికేసినా తరువాత తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. గ్వాలియర్, బరోడా, పటియాలా వంటి సంస్థానాలు పటేల్ పిలుపునకు వెంటనే స్పందించి విలీనానికి అంగీకరించాయి. నయానో భయానో ఇంకొందరిని లొంగదీశారు. 1947 ఆగస్టు 15వ తేదీకే చాలా సంస్థానాలను పటేల్ భారత్ యూనియన్‌లోకి తెచ్చారు. అంటే రెండు నెలల వ్యవధిలోనే. మధ్య భారతంలోని పిప్లోడా సంస్థానాధీశుడు కూడా మొదట బెట్టు చేసి 1948 మార్చిలో భారత యూనియన్‌లో విలీనం చేశాడు. జునాగఢ్‌లో ప్రజలు తిరుగుబాటు చేశారు. తరువాత ప్లెబిసైట్ ద్వారా సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానం మీద పోలీసు చర్య అవసరమైంది. ఇది సెప్టెంబర్ 17, 1948న భారత్‌లో విలీనమైంది. కశ్మీర్ ఉదంతం వీటికి భిన్నమైంది. పాకిస్తాన్ సైనికులు చొచ్చుకు వచ్చిన నేపథ్యంలో భారత్‌లో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థానం పాలకుడు హరిసింగ్ ప్రకటించారు. సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు ఇష్టమే లేదు. వీటితో పాటు లక్షద్వీప్‌ను స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ నౌకాదళం చేసిన యత్నాన్ని కూడా పటేల్ మన నౌకాదళాన్ని పంపించి భగ్నం చేశారు. దేశ సరిహద్దు విషయంలో కూడా పటేల్‌కు ఉన్న దృష్టి విశేషమైనది. వాస్తవికమైనది. దేశ సార్వభౌమాధికారం సరిహద్దులను, భూభాగాన్ని రక్షించుకోవడం ద్వారా వ్యక్తం కావాలి. పటేల్ అదే చేశారు. భారత్, చైనా సంబంధాల గురించి పరిశోధించిన జాన్ డబ్లు్య గార్వెర్, ‘‘భారత్ పరిస్థితిని పటిష్టం చేయడానికి వాస్తవికమైన అంచనాలతో పటేల్ ఎన్నో సలహాలు ఇచ్చారు. సరిహద్దులలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. భారత సైన్యం సామర్థ్యం పెంచాలన్నారు. ఈశాన్య ప్రాంతాలను భారత్‌లో విలీనం చేయవలసిన అవసరం గురించి చెప్పారు’’ అని పేర్కొన్నారు. కశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు సమ్మతం కాదని రాసినది కూడా గార్వెరే. పటేల్ అంటే ఈ దేశ పటానికి పరిపూర్ణతను, సంపూర్ణ రూపాన్ని సాధించిన రాజనీతిజ్ఞుడు. ఈ దేశం అంతర్యుద్ధాలకు చిరునామాగా మారిపోకుండా కాపాడినవారు పటేల్. భారతదేశ పటంలో ఐక్యమైన రాష్ట్రాలతో పాటు, వాటి వెనుక ఒక అంతస్సూత్రంలా పటేల్ ఆత్మ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. - డా. గోపరాజు నారాయణరావు -
ఉక్కుమణి
మణి.. అమూల్యమైనది.‘ఉక్కు’కు తోడైన ఆ మణి..తండ్రి జీవితాన్నుండి ప్రభావితమైతండ్రి జీవితాన్ని ప్రభావితం చేసి..వారసత్వానికే వన్నె తెచ్చింది.ఉక్కు సంకల్పం నాన్నది. ఉద్యమ గుణం మణిది. అందుకే మణిబెన్.. ఉక్కుమణి! నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. నేడే గుజరాత్లో పటేల్ ఐక్యతా ప్రతిమ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఆ ఉక్కుమనిషికి చివరి వరకు బాసటగా ఉన్న కుమార్తె మణిబెన్ పటేల్ గురించి స్ఫూర్తిదాయకమైన విశేషాలు, విశేషాంశాలూ ఇవి.‘నేనూ పెద్దవాడినైపోయాను. ఇప్పటికైనా ఏదో మార్గం ఎంచుకోవాలి నువ్వు!’ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1944లో తన ఏకైక కుమార్తె మణిబెన్ పటేల్‌కు ఇచ్చిన సలహా ఇది. ‘పటేల్: ఏ లైఫ్’ పేరుతో గాంధీజీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. కూతురితో ఈ మాట అనే నాటికి సర్దార్ స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ కుడిభుజం. తొందరలోనే స్వరాజ్యం వస్తుందని అంతా నమ్ముతున్న కాలం. ఆ అంచనా వాస్తవం కూడా. గాంధీజీకి ముఖ్య అనుచరుడిగా, జవహర్లాల్ నెహ్రూకు సముడిగా స్వతంత్ర భారతదేశంలో పటేల్ స్థానం ఏమిటో ఊహించడం కష్టం కాదు. అయినా ఆయన కూతురికి ఇలాంటి సలహా ఇచ్చారు. అంటే తన సంతానం రాజకీయాలలోకీ, ప్రభుత్వ పదవులలోకీ రావాలని ఆయన ఎంతమాత్రం అనుకోలేదు. సర్దార్ పటేల్, జవేర్బాయి పటేల్‌లకు ఒక కూతురు, కొడుకు. కూతురే మణిబెన్. కొడుకు దహ్యా పటేల్. పటేల్‌కు 33 ఏళ్ల వయసులో భార్యా వియోగం జరిగింది. పటేల్‌కు సంతానమంటే ఎంతో అనురాగం. ద్వితీయ వివాహం చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయనీ, అవి పిల్లలను ఇబ్బంది పెడతాయనీ చేసుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే బారిస్టర్ చదువు కోసం సర్దార్ టెంపుల్ టౌన్‌కు (ఇంగ్లండ్) వెళ్లారు. అప్పుడే చాలాకాలం మణిబెన్ నానమ్మ దగ్గర, పెదనాన్న విఠల్‌భాయ్ పటేల్‌ల దగ్గర పెరిగింది. విఠల్‌భాయ్ పటేల్ కూడా చరిత్ర ప్రసిద్ధుడే. జీవితాంతం తండ్రికి బాసట మణి, దహ్యా కూడా గుజరాత్ విద్యాపీలో చదువుకున్నారు. మణి గుజరాతీ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. నిజానికి మణిబెన్ (1903–1990) దేశ సేవకు అంకితమైంది. ఆమె స్వాతంత్య్రోద్యమంలో తండ్రితో, గాంధీజీతో కలసి నడిచారు. జీవితాంతం తండ్రికి బాసటగా ఉన్నారు. మణిబెన్ తండ్రికి కార్యదర్శి, వ్యక్తిగత సేవిక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే న ర్స్. ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసే పని కూడా ఆమెదే. ఆయన బట్టలు కూడా ఉతికేవారు. తండ్రి జీవిత చరమాంకంలో ప్రతిక్షణం ఆయనను వెన్నంటే ఉన్నారు మణి. అందుకే ఆమె రాసిన డైరీ ‘ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్: ది డైరీ ఆఫ్ మణిబెన్ పటేల్’ ఎన్నో కీలక చారిత్రకాంశాలను, ఇంకా చెప్పాలంటే చరిత్ర పుటలకు ఎక్కడం సాధ్యంకాని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌లోని కరంసద్లోనే (సర్దార్ పటేల్ పూర్వీకుల స్వగ్రామం) మణి జన్మించారు. స్వస్థలంలోను, గుజరాత్ విద్యాపీuŠ‡లోను చదువుతున్నప్పుడే గాంధీజీ ఉపన్యాసాలు, బోధనలు ఆమెకు ఉత్తేజం కలిగించాయి. 1918లో ఆమె అహమ్మదాబాద్‌లోని గాంధీజీ ఆశ్రమంలో చేరారు. మనవరాలి పెళ్లి గురించి పటేల్ తల్లి లాద్బా (తండ్రి పేరు జవేర్భాయ్, పటేల్ భార్య పేరు కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది) తపన పడుతూ ఉండేవారు. కానీ పెళ్లి విషయంలో కూతురి అభిప్రాయం ఏమిటో, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఆయన అడగలేదు. కారణం– ఆ ఇంట పిల్లలు పెద్దల ఎదుట నోరు విప్పరు. పెద్దలు కూడా అంతే. పిల్లలతో చాలా తక్కువ మాట్లాడతారు. తాను 33వ ఏట కూడా చుట్టు పక్కల పెద్దలు ఉంటే పెదవి కదపలేదని ఒక లేఖలో పటేల్ రాశారు. 1926లో మరోసారి మణి అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. 1927 జనవరిలో గాంధీజీ నుంచి పటేల్‌కు ఒక లేఖ అందిది. ‘వివాహం చేసుకునే యోచన ఏదీ ప్రస్తుతం మణి దగ్గర లేదు. ఆ విషయం గురించి మీరు ఆందోళన చెందవద్దు. నాకు వదిలిపెట్టండి!’ ఇదీ సారాంశం. చివరికి ఆమె అవివాహితగానే ఉండిపోయారు. సత్యాగ్రహంలో మూడో పటేల్ సహాయ నిరాకరణోద్యమంలో ఆమె గాంధీజీ, తన తండ్రిలతో కలసి పాలు పంచుకున్నారు. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో కూడా ఆమె పాల్గొన్నారు. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనూ కొద్దికాలం ఉన్నారు. 1928 నాటి బార్డోలీ సత్యాగ్రహంలో ముగ్గురు పటేళ్లు కనిపిస్తారు. మొదటివారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సర్దార్ పటేల్. రెండు, ఆయన అన్నగారు విఠల్‌భాయ్ పటేల్. మూడు, మణిబెన్ పటేల్. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మణి అరెస్టయ్యారు. పూనా దగ్గరి ఎరవాడ జైలుకు ఆమెను పంపారు. గాంధీజీ చరిత్రలోనే కాకుండా, ఉద్యమ చరిత్రలో కూడా కీలకమైన రెండు ఘట్టాలు అక్కడే చోటు చేసుకున్నాయి. ఆ జైలుకు వెళ్లిన పదిరోజులలోనే గాంధీజీకి ఎంతో ఆప్తుడు, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్ అనార్యోంతో హఠాత్తుగా కన్నుమూశారు. తరువాత కొద్దికాలానికే కస్తూర్బా కూడా అక్కడే కన్నుమూశారు. అంటే గాంధీజీని బాగా కదిలించిన, కుంగదీసిన రెండు ఘటనలకు మణి ప్రత్యక్ష సాక్షి. నెహ్రూ తీరుకు నిరాశ! 1950లో తండ్రి మరణించిన తరువాత మణిబెన్ ప్రథమ ప్రధాని నెహ్రూను కలవడానికి ఢిల్లీ Ðð ళ్లారు. ఆ క్షణాలను గురించి అమూల్ రూపశిల్పి వర్ఘీస్ కురియన్ (‘నాకూ ఉంది ఓ కల’ పుస్తకంలో) మనసును కదిలించే ఒక ఘట్టాన్ని నమోదు చేశారు. మణిబెన్ స్వయంగా కురియన్‌కు ఈ సంగతి చెప్పారు. ‘నీవు మాత్రమే ఈ పని చేయాలి’ అంటూ తండ్రి చివరి క్షణాలలో పెట్టిన షరతు మేరకు ఒక పెద్ద సంచి, పద్దుల పుస్తకం ఒకటి నెహ్రూకు అప్పగించారు మణి. ఆ సంచిలో 35 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ పుస్తకం పార్టీ ఖర్చులు, విరాళాల వివరాల పుస్తకం. ఈ రెండు అప్పగించిన తరువాత నెహ్రూ నోటి నుంచి ఒక మాట కోసం మణి ఎదురు చూశారట. అదేమిటని కురియన్ అడిగారు. ‘ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న మాట ఆయన నోటి నుంచి వస్తుందని అనుకున్నాను. కానీ ఆయన (నెహ్రూ) ‘థాంక్స్’ అనే వెళ్లిపోయారు’ అని సమాధానమిచ్చారామె. నెహ్రూకూ, పటేల్‌కు మధ్య వైరుధ్యాలు ఆ కాలానికి ఎంత తారస్థాయిలో ఉండేవో దీనిని బట్టే అర్థమవుతుంది. పటేల్ మరణించడానికి రెండు నెలలముందు జరిగిన ఒక ఉదంతం గురించి మణిబెన్ డైరీలో ఏం రాశారో అహ్మదాబాద్‌కు చెందిన రతీన్దాస్ వెల్లడించారు. ‘బాబ్రీ మసీదు జీర్ణోద్ధరణ, సోమ్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణం వేరువేరు అంశాలు.సోమ్‌నాథ్ ఆలయం కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదు’ అని పటేల్ వివరణ ఇవ్వగానే నెహ్రూ మౌనం వహించారన్నదే ఆ పేజీలోని మాటల సారాంశం. మరోసారి ‘మణి’ దండి యాత్ర గాంధీజీ మరణించే వరకు ఢిల్లీలోని బిర్లా భవన్‌లోనే మణిబెన్ కూడా ఉన్నారు. ఆయన హత్యకు గురైన తరువాత కూడా కొద్దికాలం అక్కడ ఉండవలసిందని బిర్లాలు కోరారు. అందుకు ఆమె అంగీకరించలేదు.తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మణిబెన్ 1976లో మరోసారి దండి యాత్ర జరిపారు. కారణం– భారత ప్రజానీకంలో ధైర్య సాహసాలను పునరుద్ధరించడమే. అది ఎమర్జెన్సీ కాలం.అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న నాయకులను విడుదల చేయాలనీ, ఎమర్జెన్సీ ఎత్తివేయాలనీ, పత్రికల మీద సెన్సార్ షిప్‌ను వెంటనే తొలగించాలనీ నినాదాలు ఇస్తూ ఆమె దండి యాత్ర నిర్వహించారు.ఇందిరాగాంధీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మణిబెన్ ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలను వీక్షించి 1990లో అంతిమ శ్వాస విడిచారు. ‘పటేల్‌ది ఒక తాత్విక వారసత్వం.దానిని మేం సొంతానికి ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. దానిని ప్రజలే అర్థం చేసుకోవాలి. అనుసరించాలి. రుద్దే ఆలోచన మాకు లేదు’ అంటున్నారు పటేల్ వారసులు. ముందే రాజకీయాల్లోకి రాలేదు పటేల్ మరణించిన తరువాత మాత్రమే మణిబెన్ రాజకీయాలలోకి వచ్చారు. గుజరాత్ కాంగ్రెస్ శాఖకు కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఎన్నో సాంఘిక, విద్యా సంస్థల కోసం పనిచేశారు. నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ తరఫున తొలి లోక్‌సభకు (1952–1957) ఆమె దక్షిణ కైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత రెండో లోక్‌సభకు (1957–1962) ఆనంద్ నియోజక వర్గం నుంచి గెలిచారు. 1964–70 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. – గోపరాజు నారాయణరావు -
ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్
వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్’ అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. -
పటేల్ గొప్ప దేశభక్తుడు : కిరణ్ రిజిజు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లబాయి పటేల్ గొప్ప దేశ భక్తుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పటేల్ 140వ జయంతిని పురస్కరించుకుని ‘ఐక్యతా దినోత్సవం’లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సభను నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సాగిన ఈ సభలో రిజిజు పాల్గొని మాట్లాడారు. ఒకే కుటుంబం, ఒకే పార్టీ దేశాన్ని అనేక ఏళ్లు పాలించిందని, వారి పాలన విభజించు - పాలించు అనే దోరణిలో కొనసాగిందని తెలిపారు. మోదీ రాకతో ఆ పార్టీకి పుట్టగతుల్లేకుండా పోయాయని తెలిపారు. నేతాజీ తర్వాత భారతదేశ ముద్దుబిడ్డ పటేలేనని చెప్పారు. ఆదిలోనే మత ఘర్షణలు అణచివేసి, దేశంలో శాంతి స్థాపనకు నడుంకట్టామని చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. పటేల్ జాతీయ సమైక్యతకు ప్రతీక అని చెప్పారు. ఆయన ఇచ్చిన ‘ఒక జాతి ఒకే ప్రజా’ను ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకుముందు బీజేపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వచ్చి శాసనసభ దగ్గర ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ జాతీయనేత మురళీధరరావు పాల్గొన్నారు. -
సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: నల్లు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం ఆయన పటేల్ విగ్రహ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్థానాల విలీనానికి పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. రైతు నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లో నర్మదా నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పటేల్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వాములను చేయాలని మోడీ నిర్ణయించారని, ఇందుకోసం దేశంలోని ఐదు లక్షల మంది సర్పంచ్‌లకు స్వయంగా ఉత్తరాలు రాస్తున్నారని నల్లు తెలిపారు. దేశంలో అన్ని స్కూళ్లలో వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో విజేతలకు మోడీ పంపించిన బహుమతులను అందజేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నెల రోజులపాటు ఈ రథంతో పర్యటిస్తామన్నారు. -
సుపరిపాలనతోనే పేదరికం అంతం
సిరిసిల్ల టౌన్/కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : సుపరిపాలన వచ్చిన ప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని కేంద్రమాజీ మంత్రి, ఏక్తాట్రస్టు రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. గుజరాత్ ప్రభుత్వం తలపెట్టిన మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ యజ్ఞం సిరిసిల్ల డివిజన్‌స్థాయి సభలో, కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.దేశ సమైక్యతను చాటేలా గుజరాత్ ప్రభుత్వం పటేల్ విగ్రహాన్ని ప్రపంచంలోకెల్లా ఎత్తుగా నిర్మిస్తోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి సురాజ్ పిటిషన్ ద్వారా జాతిని ఏకం చేస్తున్నారని చెప్పారు. విగ్రహ నిర్మాణ ప్రక్రియను సర్పంచులు, వార్డు మెంబర్లకు వివరించారు. గ్రామాల నుంచి మట్టి, ఇనుపముక్కలు పంపే సర్పంచుల పేర్లు, ఫొటోలు భావితరాలకు తెలిసేలా మ్యూజియాన్ని నిర్మిస్తున్నారని వివరించారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు జిల్లా నుంచి వ్యవసాయ పనిముట్లు సలాక, మట్టిని సేకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లుపై జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రాష్ట్రపతికి పంపించాలని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ చర్చించి రాష్ట్రపతికి పంపించాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. వచ్చేనెల 3న తెలంగాణ బిల్లుకు లక్ష్మణరేఖ వంటిదని, అది దాటితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని హెచ్చరించారు. టీడీపీపై పొత్తు ఇప్పట్లో లేదని, రాష్ట్ర విభజన తర్వాత ఉండవచ్చని అన్నారు. వేర్వేరు జరిగిన కార్యక్రమాల్లో ట్రస్టు సిరిసిల్ల డివిజన్ కన్వీనర్ చీటి నర్సింగారావు, కొట్టాల మోహన్‌రెడ్డి, డాక ్టర్ చంద్రశేఖర్‌రావు, కొలిమి వేణుగోపాల్, గుర్రం సత్తయ్య, నేవూరిమమతారెడ్డి, ఆడెపు రవీందర్, కరీంనగర్ పార్లమెంట్లో నియోజకవర్గ ఇన్చార్జి కొరివి వేణుగోపాల్, కోశాధికారి హరికుమార్, నాయకుడు ఎడవె ల్లి విజయేందర్ రెడ్డి, జగన్మోహన్, కన్నం అంజయ్య, అయిల ప్రసన్న, సర్దార్ వల్లాబాయ్ ట్రస్టు చైర్మన్ బుస్స శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీధర్, నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ , నాయకులు గాజుల స్వప్న, మధుకార్, మల్లేశ్ పాల్గొన్నారు. -
బీజేపీలో నమో స్థైర్యం !
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ అంచనాలకు మించి జయప్రదం కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో జరిగిన భారీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు వ ుూడున్నర లక్షల మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఆరు నెలల కిందట జరిగిన శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవ డం, ఇటీవల రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలపలేని స్థితి...పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. జేడీఎస్‌కు పరోక్ష మద్దతునిచ్చినా ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. వచ్చే ఏడాది మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు మోడీ ఇప్పటి నుంచే దేశమంతటా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బెంగళూరుకు వచ్చారు. ఆయన ప్రసంగానికి కార్యకర్తల నుంచి ఆద్యంతం చక్కటి స్పందన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికల్లో మోడీనే తమ తురుపు ముక్క అని పార్టీ నాయకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ సభ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో కూడా ఆయనతో మరిన్ని సభలు పెట్టించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. మృదువుగా...సూటిగా దేశ విభజన, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ లాంటి వివాదాస్పద అంశాల జోలికి పోకుండా మోడీ ఈ సభలో జాగ్రత్త పడ్డారు. ఆ విషయాలను ప్రస్తావించవద్దని పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఆయనకు సూచించినట్లు సమాచారం. ఉద్రేకపూరిత ప్రసంగాల్లో దిట్ట అయిన మోడీ ఈ సభలో చాలా సౌమ్యంగా మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం...పదేళ్లలో యూపీఏ సర్కారు వైఫల్యాలపైనే ఆయన దృష్టి సారించారు. పేదలు, మధ్య తరగతి వారిని ఆకర్షించే దిశగా ఆయన ప్రసంగం సాగింది. ‘రూ.15కు మినరల్ వాటర్ కొంటారు. రూ.20 పెట్టి ఐస్‌క్రీం తింటారు. వీరికి చౌక ధరకు బియ్యం ఇవ్వాలా’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను సుతిమెత్తగా విమర్శించారు. పేదలంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని దెప్పి పొడిచారు. దేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించే దిశగా తమ కార్యక్రమాలుంటాయని ప్రకటించారు. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని దెప్పి పొడిచారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యానికే పెద్ద పీట కనుక, వాటి అభివృద్ధి కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శించారు. మొత్తానికి అభివృద్ధి, 8-10 సంవత్సరాల్లో సాధించాల్సిన వృద్ధి లాంటి అభ్యుదయ భావాలతో కూడిన లక్ష్యాలను ప్రకటించడం ద్వారా మోడీ తాను ‘మారిన మనిషి’ అని చాటుకోవడానికి ప్రయత్నించారు.