సుపరిపాలన వచ్చిన ప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని కేంద్రమాజీ మంత్రి, ఏక్తాట్రస్టు రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు
సిరిసిల్ల టౌన్/కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ :
సుపరిపాలన వచ్చిన ప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని కేంద్రమాజీ మంత్రి, ఏక్తాట్రస్టు రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. గుజరాత్ ప్రభుత్వం తలపెట్టిన మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ యజ్ఞం సిరిసిల్ల డివిజన్‌స్థాయి సభలో, కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.దేశ సమైక్యతను చాటేలా గుజరాత్ ప్రభుత్వం పటేల్ విగ్రహాన్ని ప్రపంచంలోకెల్లా ఎత్తుగా నిర్మిస్తోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి సురాజ్ పిటిషన్ ద్వారా జాతిని ఏకం చేస్తున్నారని చెప్పారు. విగ్రహ నిర్మాణ ప్రక్రియను సర్పంచులు, వార్డు మెంబర్లకు వివరించారు. గ్రామాల నుంచి మట్టి, ఇనుపముక్కలు పంపే సర్పంచుల పేర్లు, ఫొటోలు భావితరాలకు తెలిసేలా మ్యూజియాన్ని నిర్మిస్తున్నారని వివరించారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు జిల్లా నుంచి వ్యవసాయ పనిముట్లు సలాక, మట్టిని సేకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లుపై జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రాష్ట్రపతికి పంపించాలని అన్నారు.
ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ చర్చించి రాష్ట్రపతికి పంపించాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. వచ్చేనెల 3న తెలంగాణ బిల్లుకు లక్ష్మణరేఖ వంటిదని, అది దాటితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని హెచ్చరించారు. టీడీపీపై పొత్తు ఇప్పట్లో లేదని, రాష్ట్ర విభజన తర్వాత ఉండవచ్చని అన్నారు. వేర్వేరు జరిగిన కార్యక్రమాల్లో ట్రస్టు సిరిసిల్ల డివిజన్ కన్వీనర్ చీటి నర్సింగారావు, కొట్టాల మోహన్‌రెడ్డి, డాక ్టర్ చంద్రశేఖర్‌రావు, కొలిమి వేణుగోపాల్, గుర్రం సత్తయ్య, నేవూరిమమతారెడ్డి, ఆడెపు రవీందర్, కరీంనగర్ పార్లమెంట్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి కొరివి వేణుగోపాల్, కోశాధికారి హరికుమార్, నాయకుడు ఎడవె ల్లి విజయేందర్ రెడ్డి, జగన్‌మోహన్, కన్నం అంజయ్య, అయిల ప్రసన్న, సర్దార్ వల్లాబాయ్ ట్రస్టు చైర్మన్ బుస్స శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీధర్, నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ , నాయకులు గాజుల స్వప్న, మధుకార్, మల్లేశ్ పాల్గొన్నారు.