Vidya Sagar Rao
-
అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’
సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి అనూహ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు దక్కింది. అనేకమంది ఆశావహులు కుర్చీ కోసం పోటీపడ్డారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలం కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. నిరాశలో ఆశావహులు.. కీలకమైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తయ్యాక జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ అప్పట్లోనే నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలి చిపోయింది. గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే మంత్రి ఆశీస్సులు ఉన్నవారికే పదవులని.. ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలకు అనుకూలమైన నాయకుల ఆశీస్సులు ఉన్నవారికే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అనూహ్యంగా ఆ కుర్చీ దక్కింది. ధర్మపురి జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్, వెల్గటూర్‌కు చెందిన పునుగోటి శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ పదవిని ఆశించారు. వీరితోపాటు మరికొందరు నాయకులు పోటీపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు అందించిన నివేదికలోని పేర్లు, మరికొన్ని పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ భవనం పూర్తి ధరూర్ క్యాంప్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బయోడేటా పేరు : కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, కోరుట్ల) జననం: 10 నవంబర్ 1953 జన్మస్థలం: రాఘవపేట విద్యార్హతలు: బీఏ రాజకీయ ప్రవేశం..:1977లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ 1997 అక్టోబర్‌లో టీడీపీలో చేరారు. 1998లో ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2003లో ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా నియమితులయ్యారు.2008లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తా జగిత్యాల/కోరుట్ల: ‘ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఇటీవల టీటీడీ బో ర్డు సభ్యుడిగా అకాశం కల్పించారు. తెలంగా ణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నాకూ అనూహ్యంగా పదవి ఇచ్చారు. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’ అని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే.. సాక్షి : చాలామంది జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని నియమించారు. మీ స్పందన ఏమిటి? విద్యాసాగర్‌రావు : ఉద్యమ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా నాకు ఈ పదవి అప్పగించారు. బాధ్యతగా ఈ పదవిని నిర్వర్తిస్తా. సాక్షి : ఆశావహులు నిరాశలో ఉంటారు, వారిని ఎలా కలుపుకుపోతారు? విద్యాసాగర్‌రావు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా. సాక్షి : చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు? విద్యాసాగర్‌రావు : జిల్లామంత్రి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆశావహులకు న్యాయం చేస్తా. సాక్షి : రానున్న ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలు చేపడతారు? విద్యాసాగర్‌రావు : టీఆర్ఎస్ ఇప్పటికే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రానున్న ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో గెలుస్తాం. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం. సాక్షి : ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి.. వీటన్నింటికీ ఎలా న్యాయం చేస్తారు? విద్యాసాగర్‌రావు : ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా. టీటీడీ సభ్యుడిగా భక్తులకు దైవ దర్శనం కల్పిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. -
బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది: విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మళ్ళీ బీజేపీలోకి రావడం ఉత్సాహం, ప్రేరణ కల్గిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కేంద్ర బిందువుగా మారుతుందని.. టీఆర్ఎస్కు ధీటైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతుందన్నారు. మొన్నటి వరకు గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌రావు పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకి లక్ష్మణ్ బీజేపీ సభ్వతాన్ని ఇచ్చారు. పార్టీ సభ్యత్వం స్వీకరించిన అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘పార్టీ కార్యకర్తల శ్రమ వల్లనే ఎదిగాను. బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంపై బలహీనమైన ఆలోచనలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో 17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి బీజేపికి పూర్తిగా అంకితమవుతాను. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని’ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంలో విద్యాసాగర్ రావు పాత్ర కీలకమని గుర్తు చేశారు. తన సలహాలు, అనుభవాలు పార్టీకి అవసరమన్నారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ భవన నిర్మాణంపై కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టుగా అభివర్ణించారు. -
కరీంనగర్లో కోరెం అల్లుళ్లు
కరీంనగర్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి బరిలో దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ అల్లుడీయన. కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి హన్మంతరావు, చెన్నాడి సత్యనారాయణరావు స్వయాన సోదరులు. సత్యనారాయణరావు–లచ్చమ్మల కుమార్తె వినోదను విద్యాసాగర్‌రావు వివాహం చేసుకున్నారు. చెన్నాడి హన్మంతరావు–శాంతమ్మల కుమారుడైన చెన్నాడి మార్తాండరావు కుమార్తె డాక్టర్ మాధవిని వినోద్‌కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇద్దరు అల్లుళ్లు.. కరీంనగర్ ఎంపీలుగా ఎన్నిక కావడం యాదృచ్ఛికం. చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998–99, 1999– 2004.. ఈ రెండు పర్యాయాలు బీజేపీ నుంచి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ఇపుడు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్‌కుమార్ ఇపుడు మరోసారి బరిలో ఉంటున్నారు. వినోద్‌కుమార్‌కు విద్యాసాగర్‌రావు వరుసకు బాబాయ్ అవుతారు.– పట్నం ప్రసాద్, బోయినపల్లి్ల స్మార్ట్ ఎంపీ :కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), సిరిసిల్ల, మానకొండూర్ (ఎస్సీ), హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ 2,04,652 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై విజయం సాధించి, కరీంనగర్ 16వ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్‌సభ పక్ష ఉప నేతగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అనర్గళంగా మాట్లాడారు. ప్రత్యేక హైకోర్టు సాధన, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్, కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించడంలో ఈయన పాత్ర ఎనలేనిది. అలాగే, ఈ నెల 17న కరీంనగర్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీగా గెలిచాక, కేంద్రంలో ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వంలో వినోద్‌కు కేంద్ర మంత్రి పదవి బోనస్‌గా వస్తుందని జోస్యం చెప్పారు. కాగా, ఈ ప్రాంతవాసులు ఎంపీ అల్లుళ్లు తమ ప్రాంతానికి చేసిన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. చెన్నమనేని విద్యాసాగర్‌రావు హయాంలో జిల్లాతో పాటు బోయినపల్లి మండలఅభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని నర్సింగాపూర్‌కు చెందిన జోగినిపల్లి ఆదిత్య గుర్తు చేసుకున్నారు. విద్యాసాగర్‌రావు, వినోద్‌కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, బోయినపల్లిమండలానికి, కోరెం గ్రామానికి విశేషమైన సేవలందించారని డాక్టర్ చెన్నాడి అమిత్‌కుమార్ తెలిపారు. -
రాజకీయ ఉద్దండులు.. ఆ ఇద్దరు నేతలు
మెట్పల్లి(కోరుట్ల): ఆ ఇద్దరు నేతలు..పాత కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. మరొకరు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో చెరగని ముద్రను వేసి ‘కరీంనగర్ కీర్తిని’ జాతీయస్థాయిలో చాటారు. వారిలో ఒకరు పీవీ నర్సింహారావు కాగా, మరొకరు చెన్నమనేని విద్యాసాగర్‌రావు. మంథని నుంచి పీవీ అడుగులు.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నర్సింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962,67,72లో వరుసగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ,సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఈ పదవీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1984, 89 సంవత్సరాల్లో మహరాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన తన హయాంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దివాలా తీసే పరిస్థితిలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం పోశారు. మారుమూల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు. మెట్పల్లిలో వికసించిన ‘సాగర్జీ’ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారాం చెన్నమనేని విద్యాసాగర్‌రావు స్వగ్రామం. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అసక్తి కనబర్చిన సాగర్జీ ఏబీవీపీలో చురుకుగా వ్యవహరించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989, 1994లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాదికి జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయ్ ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. సుమారు రెండు దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన సాగర్జీ 2004నుంచి రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సంవత్సరం లోక్‌సభకు జరిగిన ఎన్నిల్లో పరాజయం పాలయ్యారు. 2009లోను మరోసారి పరాభావం ఎదురైంది. దీంతో ఆయన తిరిగి అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టిసారించి 2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయినా ఆ ఎన్నికల్లోను విజయం దక్కలేదు. 2014లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీ చేయగా, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. వరుస పరాజయాలతో ఇక సాగర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్లేననే ప్రచారం జరిగింది. కాని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఊహించని విధంగా ఆయనను మహరాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. -
భావ ప్రకటనతో సామాజిక న్యాయం
సిరిసిల్ల: భావప్రకటనతో సామాజిక న్యాయం జరుగుతుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2017’డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డికి సోమవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సాహిత్యకారులు సమాజహితాన్ని కోరుకుంటారని, వారి భావప్రకటన, భాషా ప్రయోగంతో సామాజిక న్యాయం దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకమైన పాత్ర పోషించిందన్నారు. కవులు, కళాకారులు తమ కలాలు, గళాలను ఊరూవాడా వినిపించారన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ సాహిత్యం ప్రవాహంలా వచ్చిందన్నారు. దివంగత పీవీ నర్సింహారావు వంటి భారత ప్రధానులు ముందుగా సాహిత్యకారులని, ఆయన తన స్వీయ అనుభవాలను కథల రూపంలో ఆవిష్కరించారని వివరించారు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం వస్తుందన్నారు. దేశానికి విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గవర్నర్ చెప్పారు. మేకిన్ ఇండియాలో చాలా పెట్టుబడులు వచ్చాయని, మనదేశంలోని చేతివృత్తులపై, మన యువతరంపై వారికి ఉన్న అపారమైన నమ్మకమే పెట్టుబడిగా మారుతోందని వెల్లడించారు. యువశక్తిలో ప్రపంచంలోనే ఇండి యా మొదటి స్థానంలో ఉంటుందన్నారు. రంగినేని ట్రస్ట్ సాహిత్యసేవలు, అనాథ పిల్లల సేవ, వృద్ధాశ్రమ నిర్వహణలో మానవత్వాన్ని ప్రదర్శిస్తూ.. ముందుకు సాగుతోందన్నారు. తానే స్వయంగా ఎంతోమంది అనాథ పిల్లలను ట్రస్ట్‌లో చేర్పించానని, ట్రస్ట్ ఉప్పు తిన్నందుకు ఇక్కడి దాకా వచ్చానని విద్యాసాగర్‌రావు అన్నారు. తెలంగాణ మంచి సీఎం ఉన్నారని, భాషతోనే తన దిశమారిందని కేసీఆర్ చెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. -
ఆదర్శ్ స్కాం.. మాజీ సీఎంకు భారీ ఊరట
సాక్షి, ముంబై : ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమత్రి అశోక్ చవన్‌కు భారీ ఊరట లభించింది. ఆయన్ని ప్రాసెక్యూట్ చేయాలన్న రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్యాప్తులో సీబీఐ సాక్ష్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ సీఎం తరహా వ్యక్తులను విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చించాకే గవర్నర్ ఈ ఉత్తర్వులను వెలువరించారు. అయినా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించకపోవటం విశేషం. కాగా, 2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి రాగా.. చవన్ రాజీనామా చేసి ఆ స్థానంలో పృథ్వీరాజ్ సీఎంగా పగ్గాలు చేపట్టాడు. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. -
ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతాం
ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల రంగంలో విశేష సేవలు అందించినందుకు గుర్తుగా రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో నిర్ణయించి ప్రతిపాదనలు పంపాలని నీటి పారుదల శాఖను ఆదేశించారు. ఆయన మృతి తెలంగాణ జాతికి తీరని లోటు అని అన్నారు. శనివారం సాయంత్రం ఆయన సతీసమేతంగా వెళ్లి విద్యాసాగర్‌రావు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ చేరుకున్న సీఎం విషణ్ణ వదనంతో కనిపిం చారు. విద్యాసాగర్ రావు అంత్యక్రి యలను అధికారిక లాంఛనాలతో జరిపించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్‌ని ఆదేశించారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై ఆయన చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్య మైనదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ, సలహాలు ఇస్తూ ముందుకు నడిపారన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు అని సీఎం పేర్కొన్నారు. -
'జల్లికట్టు' ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
-
'జల్లికట్టు' ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
చెన్నై: సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్‌కు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. శుక్రవారమే ఈ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి. అనంతరం ఆ ఆర్డినెన్స్‌ను తిరిగి రాష్ట్రానికి పంపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు(పర్ఫామింగ్ యానిమల్స్)' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఈ ఆర్డినెన్స్‌ను జనవరి 23 నుంచి జరుగబోయే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం అళంగనలూర్లో ఈ ఆటను రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా వారి సంబంధిత జిల్లాలో జల్లికట్టు ఆటకు స్వీకారం చుట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం పలు మార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని నిరసనకారులు.. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆందోళనలు విరమించే అవకాశంఉంది. (ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు) -
‘కృష్ణా’పై ఏం చెబుతారో..?
♦ నేడు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో విచారణ ♦ కేంద్రం సమర్పించే అఫిడవిట్‌పై అందరి దృష్టి ♦ ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు కీలక విచారణ జరుగనుంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు బ్రజేష్ ట్రిబ్యునల్ పరిధిని రెండు తెలుగు రాష్ట్రాలకే సరిపెడుతుందా? లేక 4 రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా? అన్నది వెల్లడికానుంది. పునః కేటాయింపులు రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని గత విచారణ సందర్భంగా కేంద్ర జల వనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో బుధవారం నాటి తదుపరి విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ వెల్లడయ్యే కేంద్రం వైఖరిపైనే తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఆధారపడి ఉండటంతో విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రజేష్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. బ్రజేష్ తీర్పు, తుది తీర్పును కలిపి గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించమని కర్ణాటక, మహారాష్ట్రలు పిటిషన్ వేసిన విదితమే. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తెలంగాణను సైతం చేర్చేందుకు అంగీకరించిన సుప్రీం, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినిచ్చింది. వీటిపై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేసిన సుప్రీం తన నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. బుధవారం విచారణలో కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లిన ప్రభుత్వ సలహాదారు.. కాగా బ్రజేష్ తీర్పును పూర్తిగా సమీక్షించి 4 రాష్ట్రాలకు కలిపి కొత్తగా పునః కేటాయింపులు జరపాలని తెలంగాణ మరోమారు కోరనుంది. ముఖ్యంగా మిగులు జలాలను గుర్తించి వాటిని పంపిణీ చేయడంతో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని వివరించనుంది. దీనిపై చర్చిం చేందుకు ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. -
ప్రాణహిత’పై దిద్దుబాటు చర్యలు
ప్రాజెక్టుపై వివాదాల నేపథ్యంలో సలహాదారు విద్యాసాగర్‌రావు వివరణ స్వచ్ఛ ఇరిగేషన్ నినాదంతో ముందుకెళ్తామని వెల్లడి హైదరాబాద్: ‘స్వఛ్చ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ మాదిరే సాగునీటి రంగంలోనూ స్వచ్ఛ ఇరిగేషన్ నినాదంతో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ (దిద్దుబాటు చర్యలు) చేపట్టాం. అందులో భాగంగానే గత ప్రభుత్వాలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఆయకట్టు, నీటివినియోగం లక్ష్యాలు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయాలు తయారు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సహా స్వరాష్ట్రంలోనూ ముంపు వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రాజెక్టును త్వర గా పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం’ అని ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై వస్తున్న కథనాలపై సోమవారం సచివాలయంలో వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు డిజైన్ మార్పుపై మాట్లాడుతున్న విపక్షాలు, స్వయంప్రకటిత మేధావులు తుమ్మిడిహెట్టి ఎత్తుతో జరుగుతున్న ముంపుపై మహారాష్ట్రను ఒప్పించగలరా? అని ప్రశ్నించారు. వ్యాప్కోస్ ఇచ్చే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలన్నీ సమూలంగా నపరిశీలించాకే ప్రాజెక్టుపై ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకుంటుందని విద్యాసాగర్‌రావు చెప్పారు. నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు... ప్రాణహిత ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే నాటి ప్రభుత్వాలు అనుమతులిచ్చి ప్రాజెక్టు పనులను ప్రారంభించాయని విద్యాసాగర్‌రావు విమర్శించారు. రూ. 38,500 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టాలంటే అనుమతులు, కేంద్రసాయం తీసుకోవాలని తెలిసినా దాన్ని విస్మరించి జాతీయహోదా అంటూ అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలను నమ్మించారన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో మహారాష్ట్రలో ముంపును పట్టించుకోకుండా, ఆ రాష్ట్ర అభ్యంతరాలను వినిపించుకోకుండా పనులు చేపట్టారన్నారు. లక్ష్యం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయం... మహారాష్ట్ర అభ్యతంరాల నేపథ్యంలోనే ప్రస్తుతం కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద నీటి మళ్లింపుకు పూనుకున్నామని విద్యాసాగర్‌రావు తెలిపారు. తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. 160 టీఎంసీల నీటిని 90 రోజుల్లో మళ్లించి వాటిని నిల్వ చేసుకునేందుకు బ్యారేజీ లేదన్న సీడబ్ల్యూసీ సూచన మేరకే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి బ్యారేజీ సామర్ధ్యం పెంచామన్నారు. ఆదిలాబాద్ ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా తుమ్మిడిహెట్టి లేదా, దిగువన మరో బ్యారేజీ నిర్మించి జిల్లాకు నీరందిస్తామని తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లింపల్లికి నీటి తరలింపు ఖర్చు కన్నా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు ఖర్చు తక్కువని విద్యాసాగర్‌రావు వివరించారు. -
మహారాష్ట్రలో కేసీఆర్ పుట్టినరోజు
రాజ్ భవన్లో కేక్ కట్ చేయించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు దంపతులు కేసీఆర్‌కు ప్రధాని మోదీ, నరసింహన్, చంద్రబాబు శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్, ముంబై: సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర రాజ్‌భవన్‌లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వయంగా కేక్ తెప్పించి కేసీఆర్‌తో కట్ చేయిం చారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు, రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు గవర్నర్ విందు ఇచ్చారు. కాగా.. పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలి పారు. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సీఎంకు పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎంపీ లు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, పాటిల్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఉన్నతాధికారులు స్వయంగా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాలను సందర్శించిన కేసీఆర్ రాజ్‌భవన్‌లో పుట్టినరోజు వేడుకలకు ముందు ముంబైలోని ప్రసిద్ధ దేవాలయమైన సిద్ధి వినాయక ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గేట్ వే ఆఫ్ ఇండియాతో పాటు నారీమాన్ పాయింట్‌లోని వివిధ పరిసరాలను తిలకిస్తూ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముంబై పర్యటన సందర్భంగా వివిధ తెలుగు సంఘాల నాయకులు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ముంబైలోని తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
విద్యాసాగర్‌రావుకు సముచిత స్థానం
అర్వపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాంరాజు విద్యాసాగర్‌రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఈయన గతంలో కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంలో సలహా దారుడిగా నియమించుకుని సముచిత స్థానం కల్పించారు. ఆయనకు జాజిరెడ్డిగూడెంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని కౌలుకు ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి వ్యవసాయాన్ని చూసుకొని వెళుతుంటారు. కాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కూడా మండలంలోని నగేదెలు తెచ్చిన ముప్పు గారం వాసే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మండల వాసులకు రెండు రాష్ట్ర పదవులు దక్కడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన'
కరీంనగర్:రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగుతోందని బీజేపీ సీనియర్ నేత సీ హెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. పట్టణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అయోమయ పరిస్థితులపై మండిపడ్డారు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్-3పై చర్చించే అధికారం అసెంబ్లీకి లేదని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. -
సుపరిపాలనతోనే పేదరికం అంతం
సిరిసిల్ల టౌన్/కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : సుపరిపాలన వచ్చిన ప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని కేంద్రమాజీ మంత్రి, ఏక్తాట్రస్టు రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. గుజరాత్ ప్రభుత్వం తలపెట్టిన మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ యజ్ఞం సిరిసిల్ల డివిజన్‌స్థాయి సభలో, కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.దేశ సమైక్యతను చాటేలా గుజరాత్ ప్రభుత్వం పటేల్ విగ్రహాన్ని ప్రపంచంలోకెల్లా ఎత్తుగా నిర్మిస్తోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి సురాజ్ పిటిషన్ ద్వారా జాతిని ఏకం చేస్తున్నారని చెప్పారు. విగ్రహ నిర్మాణ ప్రక్రియను సర్పంచులు, వార్డు మెంబర్లకు వివరించారు. గ్రామాల నుంచి మట్టి, ఇనుపముక్కలు పంపే సర్పంచుల పేర్లు, ఫొటోలు భావితరాలకు తెలిసేలా మ్యూజియాన్ని నిర్మిస్తున్నారని వివరించారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు జిల్లా నుంచి వ్యవసాయ పనిముట్లు సలాక, మట్టిని సేకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లుపై జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రాష్ట్రపతికి పంపించాలని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ చర్చించి రాష్ట్రపతికి పంపించాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. వచ్చేనెల 3న తెలంగాణ బిల్లుకు లక్ష్మణరేఖ వంటిదని, అది దాటితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని హెచ్చరించారు. టీడీపీపై పొత్తు ఇప్పట్లో లేదని, రాష్ట్ర విభజన తర్వాత ఉండవచ్చని అన్నారు. వేర్వేరు జరిగిన కార్యక్రమాల్లో ట్రస్టు సిరిసిల్ల డివిజన్ కన్వీనర్ చీటి నర్సింగారావు, కొట్టాల మోహన్‌రెడ్డి, డాక ్టర్ చంద్రశేఖర్‌రావు, కొలిమి వేణుగోపాల్, గుర్రం సత్తయ్య, నేవూరిమమతారెడ్డి, ఆడెపు రవీందర్, కరీంనగర్ పార్లమెంట్లో నియోజకవర్గ ఇన్చార్జి కొరివి వేణుగోపాల్, కోశాధికారి హరికుమార్, నాయకుడు ఎడవె ల్లి విజయేందర్ రెడ్డి, జగన్మోహన్, కన్నం అంజయ్య, అయిల ప్రసన్న, సర్దార్ వల్లాబాయ్ ట్రస్టు చైర్మన్ బుస్స శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీధర్, నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ , నాయకులు గాజుల స్వప్న, మధుకార్, మల్లేశ్ పాల్గొన్నారు. -
రాయల తెలంగాణకు ఒప్పుకోం: విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే రాయల తెలంగాణ ప్రతిపాదన అని, దీన్ని తాము ఒప్పుకోబోమని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుటిల నీతికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. నాటి కేంద్రప్రభుత్వం-నిజాంనవాబు, రజాకార్లతో యథాతథ స్థితి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టే నేడు సోనియా, మజ్లిస్‌తో ఒప్పందానికి వచ్చారన్నారు. మేం కోరుతున్నది తెలంగాణ మాత్రమే: గండ్ర స్వయంపాలన కోసమే తామంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామే తప్ప రాయల తెలంగాణ కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుతుంటే రాయల తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మూడు రోజుల గడువు ఇచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దురుద్దేశాలతోనే రాయల తెలంగాణ : ఈటెల గోదావరిఖని, న్యూస్‌లైన్: దురుద్దేశాలతోనే రాయల తెలంగాణను కాంగ్రెస్‌పార్టీ తెరమీదకు తెచ్చిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సోమవారం టీబీజీకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. బిల్లు పెట్టకుండా, కాలయాపన చేస్తుండడం వల్లే రాయల తెలంగాణ వంటి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కేసీఆర్ వల్లే ‘రాయల’ ప్రతిపాదన: ఎంపీ రాథోడ్ మంచిర్యాల, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ వల్లే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రకటించి జాప్యం చేయడవం వల్లనే కాంగ్రెస్ రాజకీయ లబ్దికోసం కోసం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాయల పేరుతో కాంగ్రెస్ కుట్ర: ఎర్రబెల్లి పాలకుర్తి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకురావడంలో కుట్ర దాగి ఉందన్నారు. ‘రాయల’ ఆమోదిస్తే ఉద్యమం: టీజేఎఫ్ హైదరాబాద్,న్యూస్‌లైన్: రాయలతెలంగాణ ప్రతిపాదన చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సోమవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 4న జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాయల తెలంగాణ అంటే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు. 5న విద్యాసంస్థల బంద్: శ్రీనివాస్ మాదిగ సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న తెలంగాణ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. తెలంగాణ కోసం 6న టీసీఎంజీ చలోఢిల్లీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నిర్ణయించింది. ఈనెల 6న ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు అక్కడే మకాం వేయాలని తీర్మానించింది. సోమవారం రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ నివాసంలో సారథ్య బృందం నాయకులు జి.నిరంజన్, బి.కమలాకరరావు, నర్సింహారెడ్డి, శ్యాంమోహన్, డాక్టర్ శంకర్, బొల్లు కిషన్ తదితరులు సమావేశమై యాత్ర గురించి చర్చించారు. -
రాహుల్ గాంధీకి ఎవరిద్వారా ప్రాణహాని ఉంది: విద్యాసాగర్‌రావు
రాహుల్‌గాంధీకి ఎవరి ద్వారా ఎలాంటి ప్రాణహాని ఉందో బయటపెట్టాలని బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. అలాంటిదేమీ లేకపోతే మాత్రం రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. దేశంలో శాంతి భద్రతలు దిగజారినట్లు చూపించి, అత్యవసర పరిస్థితి తీసుకొచ్చి, రాజ్యాంగబద్ధంగా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిపై రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని విద్యాసాగర్‌రావు హెచ్చరించారు.