
'రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన'
కరీంనగర్:రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగుతోందని బీజేపీ సీనియర్ నేత సీ హెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. పట్టణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అయోమయ పరిస్థితులపై మండిపడ్డారు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్-3పై చర్చించే అధికారం అసెంబ్లీకి లేదని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.