విద్యాసాగర్‌రావుకు సముచిత స్థానం
అర్వపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాంరాజు విద్యాసాగర్‌రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఈయన గతంలో కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంలో సలహా దారుడిగా నియమించుకుని సముచిత స్థానం కల్పించారు. ఆయనకు జాజిరెడ్డిగూడెంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని కౌలుకు ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి వ్యవసాయాన్ని చూసుకొని వెళుతుంటారు. కాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కూడా మండలంలోని నగేదెలు తెచ్చిన ముప్పు గారం వాసే. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మండల వాసులకు రెండు రాష్ట్ర పదవులు దక్కడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.