adviser
-
గాఢాంధకారంలో ఒక గైడ్, బంగ్లాదేశ్ టాప్ అడ్వైజర్
గాఢాంధకారంలో ఒక వెలుగు రేఖ ఎంతో ఆశను, నమ్మకాన్ని ఇస్తుంది. సంక్షోభపు చీకటి నుంచి వెలుగు దారుల వైపు అడుగులు వేయడానికి సన్నద్ధం అవుతున్న బంగ్లాదేశ్‌కు కనిపిస్తున్న వెలుగు రేఖల్లో షర్మీన్ ఒకరు. ప్రపంచానికి ఆమె పేరు అపరిచితం కావచ్చు. బంగ్లా ప్రజలకు మాత్రం సుపరిచితం. బంగ్లాదేశ్ పునర్నిర్మాణానికి రాళ్లెత్తుతున్న మేధావులు, ఉద్యమకారులలో షర్మీన్ ప్రముఖురాలు. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌కు సహాయపడే ఉన్నత స్థాయి సలహాదారులలో షర్మీన్ ఒకరు....‘శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడం, సుపరిపాలన అందించే రోజులను తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటోంది షర్మీన్. విద్యావంతుల కుటుంబం, సామాజిక ఉద్యమాల్లో భాగమయ్యే కుటుంబంలో ఢాకాలో పుట్టింది షర్మీన్. ఆమె తండ్రి ఖాన్ సర్వర్ ముర్షీద్ ప్రఖ్యాత విద్యావేత్త. దౌత్యవేత్త, మేధావి. తల్లి నూర్జహాన్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఎన్నో సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల్లో భాగం అవుతూ వస్తుంది షర్మీన్.సామాజిక మార్పుల కోసం శ్రమించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేసిన షర్మీన్ ‘బ్రోటీ’ అనే మానవ హక్కుల, ఎన్నికల పర్యవేక్షణ బృందానికి సీయీవోగా పనిచేసింది. పారదర్శకమైన, ప్రలోభాలకు వీలులేని, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఈ సంస్థ లక్ష్యం. కళలు, సాంస్కృతిక వారసత్వం కోసం పనిచేసే ‘ఉత్తర్సురీ’ అనే సాంస్కృతిక కేంద్రానికి కార్యదర్శిగా పనిచేసింది.లింగ సమానత్వం నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సంగీతానికి మాత్రం ఎంతో కొంత సమయం కేటాయిస్తుంది షర్మీన్. 1995లో వచ్చిన ‘ముక్తీర్ గాన్’ అనే డాక్యుమెంటరీ గాయకులలో షర్మీన్ ఒకరు.‘ఏ భేదాలు లేకుండా ప్రజలను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉంది’ అంటుంది షర్మీన్. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం మాట ఎలా ఉన్నప్పటికీ సామాజిక ఉద్యమాలకు సంబంధించి షర్మీన్ ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నది. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదు. తన ధైర్యమే తనకు రక్షగా నిలిచింది.తాజా విషయానికి వస్తే...బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను షర్మీన్ ఖండిస్తుంది. ‘ఇవి మత కలహాలు కాదు. రాజకీయ ప్రేరేపిత దాడులు’ అంటున్న షర్మీన్ బాధితుల తరఫున నిలబడుతుంది. వారికి ధైర్యాన్ని ఇస్తోంది. ‘విషాదగతాన్ని మరచి΄ోదాం. బంగారు భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెడదాం’ అని అన్ని వర్గాల ప్రజలకు పిలుపు ఇస్తోంది షర్మీన్. ‘షర్మీన్’ అనే పేరుకు ఉన్న అర్థాలలో ‘గైడ్’ కూడా ఒకటి. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు షర్మీన్ ఖచ్చితంగా ఒక గైడ్!‘గత ఏడాది కాలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై మన అవగాహన తప్పుడు సమాచారంపైనే ఆధారపడి ఉంది. దాని నుంచి బయటికి రావాలి. స్థూల జాతీయ ఉత్పతి (జీడీపి) గురించి గత ΄ాలకులు చెప్పినవి నిజాలు కావు. విదేశీ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రాథమిక, మౌలిక మార్పులు జరగబోతున్నాయని మీకు హామీ ఇస్తున్నాను’ అని బంగ్లా ప్రజలను ఉద్దేశించి చెబుతోంది షర్మీన్ ముర్షిద్. -
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ఇజ్రాయిల్‌లోని భారతీయులకు అలర్ట్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం కనిపిస్తోంది. హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హిజ్బుల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడు ఇజ్రాయెల్‌పై యుద్దానికి దండెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.కాగా గత మంగళవారం బీరుట్లో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గత వారం గోలన్ హైట్స్‌లో జరిగిన ఘోరమైన రాకెట్ కాల్పులకు ప్రతిస్పందనగా ఈ చర్యకు పాల్పడినట్లు టెల్ అవీవ్ పేర్కొంది. అనంతరం హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇక హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకూర్ సైతం గత నెలలో లెబనాన్‌లో జరిగిన సమ్మెలో మరణించాడు.అయితే హమాస్, హిజ్బుల్లా నాయకుల తాజా హత్యలతో సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్లలో ఇరాన్ మద్దతిచ్చే గ్రూప్స్‌లో ఉద్రిక్తతలను పెంచింది. దీంతో ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న భారత్ వంటి ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ పశ్చిమాసియా హెచ్చరించిందిఇజ్రాయెల్లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. స్థానికంగా ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్ పాటించాలని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు లెబనాన్‌కు వెళ్లవద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. లెబనాన్‌ను విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు సూచించింది. ఈ క్రమంలోనే ఎయిరిండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్ ఆవీవ్‌కు ఆగస్ట్ 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసింది. -
Chief Economic Adviser V Anantha Nageswaran: వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
నాదెండ్ల బుకాయింపు.. రామోజీ దరువు!
సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట! చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్ధాలు వల్లిస్తే రాజగురువు రామోజీ తాటికాయంత అక్షరాలతో ముద్రించి మురిసిపోయారు! సలహాదారుల పేరుతో 89 మందిని నియమించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.680 కోట్లు వ్యయం చేసిందని.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే రూ.140 కోట్లు చెల్లించారంటూ నాదెండ్ల గాలి కబుర్లు చెప్పారు.అసలు ప్రభుత్వం నియమించిందే 46 మంది సలహాదారులైతే మిగతావారంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? నాదెండ్ల ఆరోపణల్లో నిజం లేదని ఇక్కడే తేలిపోతోంది. నెలకు రూ.లక్షన్నర లోపే జీతభత్యాల రూపంలో చెల్లిస్తుండగా ఏకంగా రూ.వందల కోట్లు ఇస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచురించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలో సలహాదారులను నియమిస్తోంది? వారికి వేతనాలు, భత్యాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు జీవోల రూపంలో పారదర్శకంగానే ఉన్నా గోప్యంగా దాచిపెడుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడుతోంది. 2023–24లో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం బడ్జెట్ కేటాయింపులే రూ.29.61 కోట్లు అయినప్పుడు ఒక్క సలహాదారులకే రూ.వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ♦ రాష్ట్రప్రభుత్వం ఐదు కేటగిరీలుగా సలహాదారులను నియమిస్తోంది. కేటగిరీ ‘ఎస్’ కింద నియమితులైన వారికి క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది కానీ జీతభత్యాలు కానీ ఉండవు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులకు క్యాబినెట్ మంత్రులతో సమానంగా వసతులు క ల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎలాంటి గౌరవ వేతనాలు లేకుండా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ♦చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని డిజైన్ల పేరుతో ప్రచార ఆర్భాటం కోసం కన్సల్టెన్సీలు, సలహాదారులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని గుమ్మరించారు. నార్మన్ ఫోస్టర్, సుర్బానా జురాంగ్ తదితర కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలోనే ఉన్నాయి.పోలవరం సందర్శన పేరుతో చంద్రన్నకు జయము జయము అంటూ సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించేందుకు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో షూటింగ్‌లను తలపిస్తూ సినీ దర్శకుడితో డ్రోన్లతో చిత్రీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతోపాటు అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న రామోజీగానీ నాదెండ్లగానీ అప్పుడు నోరెత్తితే ఒట్టు!.ఫేక్ ప్రచారంఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న టీడీపీకి ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమని, శాశ్వత సమాధి తప్పదని వైఎస్సార్సీపీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొంది. సలహాదారులకు రూ.వందల కోట్లు చెల్లిస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లిస్తున్నారని మండిపడింది. -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్
ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి) భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్ కన్‌క్లేవ్‌లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్ మస్క్ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ న్యూస్ కథనం వివరించింది. గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల వికేక్ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోసివ్స్ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది. -
విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయాన్ని అమలుచేస్తున్నారని, ఇంత గొప్పగా ఎప్పుడూ జరగలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, చంద్రబాబు, లోకేశ్ చేసే విమర్శలను ప్రజాప్రతినిధులు, పార్టీ ఇతర నేతలంతా ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఓ హోటల్లో సోమవారం వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగానికి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీలకు సంబంధించి తాజా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీలో సీఎం జగన్ మినహా మిగిలిన వారందరూ కార్యకర్తలేనన్నారు. ఎవరి బాధ్యతలు వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తే పార్టీ మరింతగా బలోపేతమవుతుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేదలలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. ఈ పథకాలతో లబ్ధిదారులు తమ భవిష్యత్తు మరింత మెరుగ్గా మారుతుందనే విషయాన్ని గుర్తించేలా వారిలో చైతన్యం తేవాలి. మంత్రి ఆదిమూలపు సురేష్‌పై జరిగిన రాళ్ల దాడి విషయంలో టీడీపీ ఓ కార్పొరేట్ స్థాయిలో దుష్ప్రచారానికి ఒడిగట్టింది. అయితే, ఈ విషయంలో వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు కుట్రలను, కుయుక్తులను మరింతగా తిప్పికొట్టాల్సి ఉంది. ఓ వైపు దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేస్తున్న విధానాలను, పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాల కుట్రలను సైతం తిప్పికొట్టాలి. ఇందుకు ప్రధాన మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. మనం చేసిన సామాజిక న్యాయాన్ని ప్రతి గడపకూ చేరవేయాలి. ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. బాబు, లోకేశ్‌కు బుద్ధి చెప్పేది దళితులే: నారాయణస్వామి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌కు బుద్ధిచెప్పేది దళితులు మాత్రమేనన్నారు. పచ్చపత్రికలను దుష్ప్రచారానికి వాడుతున్నారనే విషయం ప్రజలకు తెలుసునని.. టీడీపీలోని దళితులతో అబద్ధాలు చెప్పిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అండ జగన్‌కే ఉందన్నారు. దళితులను అపహాస్యం చేస్తున్న చంద్రబాబులాంటి దుష్టుడ్ని పల్లెల్లోకి రానీయొద్దని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో దళితులకు రూ.53వేల కోట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మూలసూత్రాలైన పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ నాలుగేళ్లలో దళిత కుటుంబాలకు రూ.53 వేల కోట్లకు పైగా లబ్ధి చేకూరిందన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మొండితోక అరుణ్‌కుమార్, కైలే అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. దళితులు వైఎస్సార్సీపీకి ఎల్లప్పుడూ తరగని ఆస్తి అని వారు తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి, నాడు–నేడు వంటి పథకాలవల్ల దళితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిందన్నారు. దళితులను అనేక రకాలుగా అవమానించిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదన్నారు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయంగా అంతర్థానం అవుతారని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తున్న సీఎం జగన్‌కు ప్రతి దళితుడు అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశానికి మంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షత వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి కూడా పాల్గొన్నారు. (చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు ) -
గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్!
న్యూఢిల్లీ: ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ టీసీఎస్‌ను త్వరలో వీడనున్న ప్రస్తుత ఎండీ, సీఈవో రాజేష్ గోపీనాథన్ తదుపరి కంపెనీకి సలహాదారుగా సేవలందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోపీనాథన్ టీసీఎస్ నుంచి తప్పుకోనున్నారు. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మరికొంతకాలంపాటు గోపీనాథన్ సేవలను వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గోపీనాథన్‌తో చంద్రశేఖరన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశాలపై టాటా సన్స్, టీసీఎస్ స్పందించడానికి నిరాకరించాయి. విభిన్న టెక్నాలజీ విభాగాల(డొమైన్స్)లోకి విస్తరిస్తున్న టీసీఎస్‌కు నమ్మకమైన, అనుభవజ్ఞులైన వ్యక్తుల ఆవశ్యకత ఉన్నట్లు టాటా గ్రూప్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి సెప్టెంబర్ 15 తదుపరి గోపీనాథన్‌ను టీసీఎస్‌కు సలహాదారు(అడ్వయిజరీ) పాత్రలో వినియోగించుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన కాగా.. ఇలాంటి ప్రణాళికలేవీ లేవని గోపీనాథన్ విలేకరుల సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం! గోపీనాథన్, చంద్రశేఖరన్ రెండున్నర దశాబ్దాలపాటు కలసి పనిచేశారు. ఈ కాలంలో టీసీఎస్ వృద్ధికి గోపీనాథన్ ఎంతగానో దోహదపడ్డారు. ఆయన హయాంలో కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 82,600 కోట్లు) ఆదాయాన్ని జత చేసుకుంది. కంపెనీ మార్కెట్ విలువకు సైతం 70 బిలియన్ డాలర్లు జమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ నికర లాభం రూ. 10,846 కోట్ల మైలురాయికి చేరిన సంగతి తెలిసిందే! -
రానున్న సంవత్సరాల్లోనూ 6.5 శాతం పైనే వృద్ధి
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి పట్ల కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన సంవత్సరాల్లోనూ దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంపైనే ఉండొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5–7 శాతం మధ్య ఉండొచ్చన్నారు. ఆర్బీఐతోపాటు అంతర్జాతీయ సంస్థలైన ఓఈసీడీ, ఐఎఎంఫ్ అంచనాలను ఆయన ప్రస్తావించారు. ‘‘ఈ సమయంలో ఇది సహేతుకమే. రెండో త్రైమాసికం వృద్ధి గణాంకాలు కొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. దీంతో భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది’’అని నాగేశ్వరన్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) భారత్ జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని సిటీ గ్రూపు అంచనా వేయగా, ఎస్అండ్పీ రేటింగ్స్ 7.3 శాతంగా ఉంటుందని పేర్కొనడం తెలిసిందే. కానీ, ఇక నుంచి ఏటా వృద్ధి రేటు 6.5 శాతంపైనే ఉంటుందన్న అంచనాను నాగేశ్వర్ వ్యక్తీకరించారు. మూలధన పెట్టుబడుల సైకిల్ తిరిగి వేగాన్ని అందుకోవడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, గత కొన్నేళ్లలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు మధ్యకాలానికి అధిక వృద్ధి రేటుకు బాటలు వేస్తాయన్నారు. వృద్ధికి మద్దతుగా, రేట్ల కఠినతరం విషయంలో ఆర్బీఐ కాస్త ఆచితూచి వ్యవహరించగా, నాగేశ్వరన్ దీనికి మద్దతుగా మాట్లాడారు. 2021–22లో రేట్ల కఠినతరం మరింత బలంగా ఉండాలన్నారు. -
ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్ కపూర్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. 1994వ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు హరిరంజన్ రావు, అతీశ్ చంద్ర పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు. చదవండి👉🏾 సీఎం జగన్ బాటలోనే పంజాబ్ ప్రభుత్వం -
శాస్త్ర సలహాదారంటే ఈవెంట్ మేనేజరా?
పరిశోధన–అభివృద్ధి, సైన్స్ విద్య, వాతావరణ మార్పు, విద్యుత్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్ నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రధాన శాస్త్ర సలహాదారును నియమించింది కానీ, మునుపటి పనితీరునే కొనసాగిస్తే శాస్త్ర సలహాదారు ఆఫీసు కూడా అర్థరహితంగానే ఉండిపోతుంది. ప్రధానమంత్రి శాస్త్ర సలహా కమిటీ కార్యాలయం 1999లో ఉనికిలోకి వచ్చినప్పటికీ అది ‘పని పురోగతిలో ఉంది’ చందాన ఉండిపోయింది. వరుసగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు దాని క్రియాశీలక పాత్రపై దృష్టి పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు లేదా ఆయన కార్యాలయం ప్రభుత్వానికి ఈవెంట్ ఆర్గనైజర్‌గా మిగిలిపోకూడదు. భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు డాక్టర్ కె. విజయరాఘవన్ పదవీకాలం ఏప్రిల్ ప్రారంభంలోనే ముుగిసిపోయింది. ఆయన వారసుడిగా అజయ్ కుమార్ సూద్‌ని నియమించడానికి ప్రభుత్వం కాస్త సమయం తీసు కుంది. ఈయన బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కి చెందిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త. కీలకమైన ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు (పీఎస్ఏ) నియామకం విషయంలోనూ జాప్యం జరగటాన్ని అర్థం చేసుకోవడం క్లిష్టంగా ఉంటోంది. మాజీ పీఎస్ఏ విజయరాఘవన్ కూడా 2018 ఆగస్టులో ఏర్పడిన ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలను మోయాల్సి వచ్చింది. భారత్‌లో లెక్కకు మించిన శాస్త్ర విభాగాలు, ఏజెన్సీలు ఉంటు న్నాయి. అలాగే పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విభాగాలు కూడా చాలానే ఉంటున్నాయి. దేశంలోని అన్ని శాస్త్ర సంస్థల పనిని సమన్వయ ధోరణిలో మార్గనిర్దేశనం చేసి ముందుకు తీసుకుపోవడానికి విస్తృత స్థాయిలోని ఏజెన్సీ అవసరమున్నట్లు కనిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి శాస్త్ర సలహాదారుగా 1999లో నియమితులైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ తర్వాత భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన స్థానంలో అణుఇంధన సంస్థ మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్. చిదంబరం ప్రధాన శాస్త్ర సలహాదారు అయ్యారు. 16 సంవత్సరాల పాటు ఈ పదవిలో అదనపు సమ యంలో బాధ్యతలు నిర్వహించిన చిదంబరం తర్వాత విజయ రాఘవన్ ఆయన స్థానంలోకి వచ్చారు. శాస్త్ర సంబంధ వ్యవహారాల్లో భారత ప్రభుత్వానికి సలహా ఇవ్వగల యంత్రాంగం అవసరం ఉందని 1950లలోనే గుర్తించారు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశం శాస్త్ర పరిశోధన, విద్యను సంఘటితం చేయడానికి భారీ ప్రాజెక్టులను చేపట్టసాగింది. నూతన శాస్త్ర విభాగాలను నెలకొల్పింది. జాతీయ ప్రయోగశాలలు ఏర్ప డ్డాయి. ఉన్నతవిద్య, పరిశోధన సంస్థలు రూపుదిద్దుకుంటూ ఉండేవి. శాస్త్రజ్ఞుల కోసం, పోటీపడుతున్న ప్రయోజనాల కోసం వెదుకు లాడుతున్న కాలంలోనే ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ అన్ని పరి ణామాల సమన్వయం కోసం శాస్త్ర సలహా కమిటీలను కాలాను గుణంగా ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ శాస్త్ర సలహా కమిటీలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసు కున్నాయి. అనేక కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి చిక్కు సమస్యలను పరిష్కరించాయి. అంతరిక్ష పరిశోధనపై భారత జాతీయ కమిటీ (ఇదే తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా రూపొం దింది) కేంద్ర మంత్రిమండలికి శాస్త్ర సలహా ప్యానెల్ కృషి ఫలితంగానే ఆవిర్భవించింది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావ్ నేతృత్వంలో ప్రధానమంత్రి శాస్త్ర సలహా కమిటీ కొత్త సైన్స్ యూనివర్సిటీల – ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – స్థాపనకు సిఫార్సు చేసింది. ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం 1999లో ఉనికిలోకి వచ్చినప్పటికీ అది ‘పని పురోగతిలో ఉంది’ చందాన ఉండిపోయింది. వరుసగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు దాని క్రియాశీలక పాత్ర మీద దృష్టి పెట్టడంపై మనసు నిలుపలేక పోయాయి. ప్రభుత్వ వ్యవస్థలో శాస్త్ర సలహాదారుకు తగిన స్థానం కల్పించలేకపోయాయి. డాక్టర్ అబ్దుల్ కలామ్‌కు కేబినెట్ ర్యాంకు ఇవ్వగా, చిదంబరంకు సహాయ మంత్రి ర్యాంకును ఇచ్చారు. జరుగుతున్న పనిపై నిశిత పరిశీలన లేకుండానే ఆయనను నిరవధికంగా తన పదవిలో కొన సాగడానికి అనుమతించారు. వాస్తవానికి ఆ పదవి రిటైరైన శాస్త్రజ్ఞు లకు విడిది స్థలం స్థాయికి కుదించుకుపోయింది. ప్రత్యేకించి అణు ఇంధన సంస్థలో రిటైరైనవారికి తుది మజిలీగా అది మారి పోయింది. బయోటెక్నాలజీ విభాగంలో సెక్రటరీగా అప్పుడే రిటైరైన విజయ రాఘవన్‌ని 2018 ఏప్రిల్‌లో ప్రధాన శాస్త్ర సలహాదారుగా నియ మించారు. కాకపోతే అదే సెక్రటరీ ర్యాంకునే కల్పించారు. దీని ఫలితంగా, ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం మరో సాధారణ శాస్త్ర విభాగం స్థాయికే కుదించుకుపోయింది. పీఎస్ఏ కూడా ఇతర సెక్రటరీల్లాగే పనిచేసేవారు. 2018 ఆగస్టులో ప్రధాన శాస్త్ర సలహాదారును ప్రధాని సలహామండలి చైర్మన్‌గా కూడా చేశారు. విజయరాఘవన్‌ని ప్రధాని సలహామండలి చైర్మన్‌గా నియమించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సలహాదారు కార్యాలయాన్ని మరిం తగా కుదించివేసింది. ఎందుకంటే సలహా మండలి... ప్రధాన శాస్త్ర సలహాదారు ఆఫీసు ద్వారానే సేవలందిస్తుందని ప్రభుత్వ ఆదేశం స్పష్టంగా చెప్పేసింది. దీంతో పీఎస్ఏ కార్యాలయం ప్రభుత్వ విభాగం స్థాయికి కుదించుకుపోయింది. అయితే నిర్దిష్ట శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో పరిస్థితిని అంచనా వేసేలా, సవాళ్లను పరిష్కరించేలా, అంతర్గత సంప్రదింపులు జరి పేలా, భవిష్యత్ రోడ్ మ్యాప్‌ను అభివృద్ధి చేసి దానికి అనుగుణంగా ప్రధానమంత్రికి సలహా ఇచ్చేలా తమకు ప్రధానమంత్రి సలహా మండలే వీలు కల్పిస్తుందని పీఎస్ఏ కార్యాలయం చెబుతూ వచ్చింది. అంటే సలహామండలి మాటే శిరోధార్యం అన్నమాట. దీంతో వాస్తవంగా ప్రధాని శాస్త్ర సాంకేతిక సలహాదారు ఎవరు? ప్రధాన మంత్రి సలహా మండలా లేక పీఎస్ఏ ఆఫీసా అని అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ రెండు వ్యవస్థల పాత్ర, స్థాయి పట్ల స్పష్టత ఇవ్వకుండా వాటిని మరింత దుర్వినియోగం చేశారు. సలహాలు ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసే స్థాయికి పీఎస్ఏ పాత్రను బద్నాం చేశారు. ఉదాహరణకు, కొన్ని కర్తవ్యాల పురోగతిని పర్యవేక్షించడానికి ‘ఇన్వెస్ట్ ఇండియా’ ప్రాజెక్టు టీమ్‌లతో ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహా దారు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల కోసం ఈవెంట్లు, ప్రదర్శనలను నిర్వహించాలని శాస్త్ర సాంకేతిక సలహాదారును కోరారు. భారతీయ భాషల్లో సైన్స్ కమ్యూనికేషన్‌ని ప్రోత్సహించడానికి పీఎస్ఏ ఆఫీసు కసరత్తులు చేయాల్సి వచ్చింది. ఈ కర్తవ్యం కోసం అప్పటికే కనీసం మూడు పూర్తి స్థాయి ప్రభుత్వం ఏజెన్సీలు ఉనికిలో ఉన్నాయని మర్చిపోకూడదు. ఏవిధంగా చూసినా సరే... పీఎస్ఏ గానీ, ఆయన కార్యాలయం గానీ ఒక అమలు చేసే ఏజెన్సీగా, ప్రభుత్వం కోసం ఈవెంట్లు నిర్వహించే సంస్థగా ఉండకూడదు. ఇక పాలసీ స్థాయిలో, ఇటీవల సాధించిన విజయం ఏమిటంటే, కొత్త నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీని రూపొం దించడమే. దీని అమలు బాధ్యతను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ఇచ్చారు తప్పితే పీఎస్ఏకి గానీ, ఆయన ఆధ్వర్యంలో ఉండే ప్రధాని సలహా మండలికి గానీ కాదు. చివరకు ఫండింగ్ ఏజెన్సీల ద్వారా పరిశోధకులకు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చేయడం వంటి సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేని స్థాయికి పీఎస్ఏ కార్యాలయం తగ్గిపోయింది. పరిశోధన–అభివృద్ధి, సైన్స్ విద్య, వాతావరణ మార్పు, విద్యుత్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్ నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు మరీ సంక్లిష్టంగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రధాన శాస్త్ర సలహాదారును నియమించింది కానీ, మునుపటి పనితీరునే కొనసాగిస్తే శాస్త్ర సలహాదారు ఆఫీసు కూడా అర్థరహితం గానే ఉండిపోతుంది. శాస్త్ర సలహాదారు లేదా ఆయన కార్యాలయం ప్రభుత్వానికి ఈవెంట్ ఆర్గనైజర్‌గానో, అమలు చేసే ఏజెన్సీగానో మిగిలిపోకూడదు. ఈ నేపథ్యంలో భారత శాస్త్ర సలహాదారు కార్యాలయం పాత్రను పునర్నిర్వచించాలి. లేదా ఆ ఆఫీసును రద్దుచేయాలి. వ్యాసకర్త: దినేష్ సి. శర్మ సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రష్యాపై అమెరికా ఆంక్షలు.. మనోడిదే కీలక పాత్ర
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా, పుతిన్ స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షల విధింపులో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తరపున కీలకంగా వ్యవహరించింది భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం విశేషం. ఆయనే ఆర్థిక సలహాదారు దలీప్ సింగ్. ఇండో-అమెరికన్ అయిన దలీప్ సింగ్.. నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా, ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ విభాగానికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు. గత కొన్నిరోజులు ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వైట్ హౌజ్ ప్రెస్ రూమ్‌లో దలీప్ రెండుసార్లు కనిపించారు. రష్యాపై ఆర్థిక ఆంక్షల వ్యవహారంలో బైడెన్‌కు ప్రతీది దగ్గరుండి క్షుణ్ణంగా వివరించడంతో పాటు, ఏ మేర అమలు చేయాలనే విషయాలపై కీలక సూచనలు ఇచ్చింది ఈయనే. అంతేకాదు ఆ అమలును బైడెన్ తర్వాత ప్రపంచానికి ప్రకటించింది దలీప్ సింగ్ కావడం విశేషం. దలీప్ ఏం చెప్పాడంటే.. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దీర్ఘకాలంగా సమీక్ష తర్వాత దండయాత్ర మొదలుపెట్టింది. దానికి మా స్పందనే ఇది. ఇవాళ అధ్యక్షుడు (జో బైడెన్) మిత్రదేశాలు.. భాగస్వాములతో చర్చించి త్వరగతిన ప్రతిస్పందించారు. ఈ చర్యలు చరిత్రలో నిలిచిపోయేవి. ఒక నిర్ణయాత్మక ప్రతిస్పందన కోసం వారాల నుంచి నెలలు పట్టింది.. అంటూ మొదలుపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించారు దలీప్ సింగ్. జర్మనీతో రాత్రికి రాత్రే సంప్రదింపులు జరిపి.. పైప్లైన్ల ఆపరేషన్లను నిలిపివేయించాం. ఆపై ఆర్థిక ఆంక్షలు విధించాం. బిలియన్ల డాలర్లు విలువ చేసే ఆస్తుల్ని, ఆర్థిక లావాదేవీలను ఆపేశాం. తద్వారా అమెరికా, యూరప్ దేశాలతో ఎలాంటి లావాదేవీలు ఉండబోవు. పైగా కొత్త అప్పులు పుట్టవు. రష్యా ఉన్నత కుటుంబాలు, ధనికులపై అదనపు చర్యలూ ఉంటాయి. ఇవేం పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కావు. పరస్సర సహకారంతోనే ముందుకెళ్లాం. ఈరోజు మేము తీసుకున్న చర్యలు మొదటి విడత మాత్రమే. మేము ఇంకా వెల్లడించనివి చాలానే ఉన్నాయి. పుతిన్ గనుక మొండిగా ముందుకెళ్తే.. ఆర్థిక ఆంక్షల్ని, ఎగుమతి నియంత్రణలను ఉపయోగించి ఒత్తిడి పెంచుతాము. మిత్రదేశాల సహకారంతో పూర్తిస్థాయిలో ఆంక్షల్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని దలీప్ సింగ్ స్పష్టం చేశారు. రష్యా పాలనా విధానంలో సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నందునే.. తాను కీలక బాధ్యతలు చేపట్టాల్సిన వచ్చిందంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీకి చెప్పడం.. రష్యా ఆంక్షల వ్యవహారంలో దలీప్ సింగ్ ప్రాధాన్యం ఏపాటిదో చెప్పనకనే చెప్తుంది. దలీప్ సింగ్ నేపథ్యం.. దలీప్ సింగ్ పుట్టింది మేరీల్యాండ్ ఓల్నీ, పెరిగింది నార్త్ కరోలినా రాలేయిగ్‌లో. కాంగ్రెస్(అమెరికా చట్ట సభ)కు ఎంపికైన తొలి ఏషియన్ అమెరికన్ దలీప్ సింగ్ సౌంధుకి బంధువు ఈ దలీప్ సింగ్. ఆర్థిక శాస్త్రంలో డీగ్రీ చేసిన దలీప్, పలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యల్ని అభ్యసించాడు. గతంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా, ఒబామా హయాంలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహిచాడు. ప్రస్తుతం బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు 47 ఏళ్ల దలీప్ సింగ్. -
కొత్త అవతారంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొత్త అవతారంతో కన్పించనున్నారు. బెంగుళూరుకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాంలో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్‌గానే కాకుండా సదరు కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా..! ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్‌టెక్ సంస్థ గ్రో (Groww) లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్‌తో పాటుగా కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేశ్రే శనివారం ట్విటర్లో వెల్లడించారు. ప్రపంచంలో అత్యుత్తమ సీఈవోల్లో ఒకరు గ్రోకు ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌లో ఆర్థికసేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మా ఆశయంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని లలిత్ ట్వీట్ చేశారు. భారీ ఆదరణతో ‘గ్రో’త్..! యువతను ఆకర్షించడంలో గ్రో విజయవంతమైంది. తక్కువ కాలంలోనే ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీగా పెట్టుబడులను గ్రో సమీకరించింది. గత ఏడాదిలో జరిగిన రెండు ఫండింగ్ రౌండ్లలో మొత్తంగా 251 డాలర్లను గ్రో సేకరించింది. దీంతో అక్టోబర్ 2021 నాటికి మూడు బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీగా గ్రో అవతరించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో పాటుగా రాబిట్ క్యాపిటల్, సింఖోయా వై కాంబినేటర్, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ పార్ట్నర్స్, ఐకానిక్ గ్రోత్, అల్కెన్, లోన్ పైన్క్యాపిటల్, స్టెడ్‌ఫాస్ట్ మొదలైనవి గ్రో(Groww)కు ఇన్వెస్టింగ్ పార్టనర్స్‌గా ఉన్నాయి. గతంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన లలిత్ కేశ్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ 2018లో గ్రోని స్థాపించారు. దీనిలో సుమారు 20లక్షల మంది యూజర్లు ఉన్నారు. Groww gets one of the world’s best CEOs as an investor and advisor. Thrilled to have @satyanadella join us in our mission to make financial services accessible in India. — Lalit Keshre (@lkeshre) January 8, 2022 చదవండి: బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్ -
వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నీరా టాండన్
వాషింగ్టన్: భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ (51)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీని యర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించినట్లు వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. అధ్యక్ష భవనం స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను నీరా టాండన్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. అందుకే, వైట్‌హౌస్‌కు సంబంధించి ఈ పోస్టును అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. జో బైడెన్ 8 నెలల క్రితం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్ పదవికి ఆమెను నామినేట్ చేయగా రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. దీంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం
చండీగఢ్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఇన్నాళ్లు ప్రధాన సలహాదారు (ప్రిన్సిపల్ అడ్వైజర్)గా కొనసాగగా తాజాగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘తాత్కాలికంగా ప్రజా జీవితానికి విరామం ఇస్తున్నా’ అని పేర్కొంటూ గురువారం రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. ఈ పరిణామం జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ‘నా భవిష్యత్ చర్యల కోసం ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగలేకపోతున్నా. ఈ విషయం మీకు కూడా తెలుసు. తాత్కాలికంగా ప్రజా జీవితం నుంచి కొంత విరామం కోరుకుంటున్నా. సలహాదారు పదవిని స్వీకరించలేను. అన్యథా భావించకుండా నా విజ్ఞప్తిని పరిశీలించి ఆ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలి’ అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు. ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో సీఎంకు తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పీకే చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పలుమార్లు రాహుల్, ప్రియాంకగాంధీలతో పీకే సమావేశమయ్యారు. పంజాబ్ సీఎం సలహాదారుగా ఈ ఏడాది మార్చిలో పీకే నియమితులయ్యారు. ప్రశాంత్ కిశోర్ రాజీనామా వెనకాల వేరే ప్రణాళిక ఉందని సమాచారం. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయనున్నారని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు పార్టీలో చేరితే కాంగ్రెస్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక పదవిలోనే ఉండాలని ఉండడంతో ఈ రాజీనామా చేశారని చర్చ కొనసాగుతోంది. తాజాగా ఈ పదవి నుంచి వైదొలగడంతో ఆయన రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. -
కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ రాకపోవచ్చు: విజయరాఘవన్
సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్ వేవ్‌ను తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కే విజయరాఘవన్ వెనక్కి తగ్గారు.. అవసరమైన చర్యలు తీసుకుంటే కరోనావైరస్ మూడో దశను ఓడించలగమంటూ తాజాగా చెప్పుకొచ్చారు. వైరస్ థర్డ్ వేవ్ ఎపుడు ఎలా వస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం ఖాయమని ప్రకటించిన రెండు రోజుల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కఠిన చర్యలు తీసుకుంటే, మూడో వేవ్ అన్ని ప్రదేశాలలోనూ రాకపోవచ్చు. అసలు ఎక్కడా రాకపోవచ్చన్నారు. స్థానిక స్థాయిలో ఆయా రాష్ట్రాలలో, జిల్లాల్లో, ప్రతిచోటా ఎంత బాగా ఆంక్షలను, మార్గదర్శకాలను అమలు చేస్తారనేదానిపై వైరస్ తీవ్రత ఆధారపడి ఉంటుందని విజయరాఘవన్ చెప్పుకొచ్చారు. దేశంలో రెండో దశలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. సగం కేసులు లెక్కల్లోకి రావడం లేదని విమర్శలున్నప్పటికీ, రోజుకు 4లక్షల కేసులకు తగ్గడం లేదు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్‌దొరకక, ఆక్సిజన్, మందుల కొరతతో బాధితులకు దిక్కుతోచడం లేదు. చిరవకి చనిపోయిన తమ ఆత్మీయులను గౌరవంగా సాగనంపేందుకు శ్మశానవాటికలు కూడా ఖాళీ లేని పరిస్థితి. కాగా శుక్రవారంనాటి గణాంకాల ప్రకారం 4,14,188 రోజువారీ కేసులతో దేశం మరో రికార్డును నమోదు చేసింది. 3,915 మరణాలతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,34,083 కు చేరింది. అధికారిక లెక్కలతో పోలిస్తే ఇది ఐదు నుండి 10 రెట్లు ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారుగా చెప్పుకుంటున్న దేశం తగినంత టీకాల ఉత్పత్తి, పంపిణీకి అష్టకష్టాలు పడుతోంది. 15.7 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చామని, ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ టీకాల రేటు ఇటీవలి రోజుల్లో బాగా పడిపోవడం గమనార్హం. చదవండి : కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పారేయాల్సిందే! కరోనా థర్డ్ వేవ్ తప్పదు: సంచలన హెచ్చరికలు -
చంద్రబాబు యూటర్న్.. వ్యూహకర్త నియామకం
సాక్షి, అమరావతి : చెప్పిన మాటపై నిలబడకుండా తరచూ వైఖరులు మార్చుకునే చంద్రబాబు తాజాగా మరో యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో వైఎస్సార్సీపీ తన రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్ వ్యవస్థాపకుడు పీకే (ప్రశాంత్ కిషోర్)ను నియమించుకున్నప్పుడు చంద్రబాబు, ఆయన పరివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలు చేతకాక ప్రతిపక్షం కన్సల్టెంట్‌ను పెట్టుకుందని చంద్రబాబు మీడియా సమావేశాలు, బహిరంగ వేదికలపైనా విమర్శించేవారు. ఎంతమంది పీకేలు వచ్చినా తమను ఏమీ చేయలేరని, చంద్రబాబు వెయ్యి పీకేలతో సమానమని టీడీపీ సీనియర్ నాయకులు సైతం చెప్పేవాళ్లు. చంద్రబాబు అపర చాణక్యుడని, ఆయన వ్యూహాల ముందు పీకే ఎంతని ధీమా వ్యక్తం చేసేవారు. చంద్రబాబు కూడా దేశంలోనే సీనియర్ నాయకుడినని, రాజకీయాల్లో తల పండిన వాడినని చెప్పుకోవడమే కాకుండా పీకే నియామకాన్నిచూపించి వైఎస్సార్సీపీని చులకనగా విమర్శించేవారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు చాణక్యం పని చేయలేదు. తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. చివరికి చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యాడు. అధికారం పోయాక కన్సల్టెంట్ల మార్గం అధికారాన్ని పోగొట్టుకుని నామమాత్రపు ప్రతిపక్షంగా మిగిలిన చంద్రబాబుకు ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో చెప్పిన మాటలు, చేతలకు విరుద్ధంగా తానే స్వయంగా ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. అది కూడా పీకే దగ్గర పని చేసిన వ్యక్తే కావడం గమనార్హం. 2019 ఎన్నికలకు ముందు పీకే బృందంలో ఒకడిగా పనిచేసిన రాబిన్ శర్మ ఆ తర్వాత సొంతంగా షోటైమ్ కన్సల్టింగ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనే తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పూర్తి స్థాయిలో పని చేసేందుకు చంద్రబాబుతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2024 ఎన్నికలకు ఆయన్నే చంద్రబాబు కన్సల్టెంట్‌గా నియమించుకోవడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా రోజుల నుంచి చంద్రబాబు తన వ్యూహాలను పక్కనపెట్టి రాబిన్ శర్మ వ్యూహాలనే అమలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు హిందూ మతం ప్రతినిధిగా మారిపోయి, క్రిస్టియన్లపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేయడం కూడా అతని వ్యూహమేనని, కానీ అది విఫలమైందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా కన్సల్టెంట్‌ను నియమించుకోవడం ద్వారా చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
హోప్ హిక్స్ ఫొటో గ్యాలరీ
-
ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రంప్ కూడా కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చిన్నవిరామం కూడా తీసుకోకుండా కష్టపడుతున్న హోప్ హిక్స్ కరోనా బారిన పడ్డారు. దీంతో తన భార్య, తాను పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. క్వారంటైన్ లోకి వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. ఈ వారంలో ఆమె ట్రంప్‌తో పలుసార్లు ప్రయాణించారు. అలాగే బుధవారం ఒక ర్యాలీలో పాల్గొన్న మరుసటి రోజు ఆమెకు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది.(ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ కష్టం) మంగళవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా ఆమె ఇటీవల అధ్యక్షుడితో పలుసార్లు ప్రయాణించారు. మిన్నెసోటాలో ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ముందు జాగ్రత్త చర్యగా అధ్యక్షుడు ట్రంప్ పరీక్షలు చేయించుకున్నట్టు పేర్కొన్నారు. హిక్స్ గతంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రతినిధిగా పనిచేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తిరిగి వైట్ హౌస్ కు వచ్చారు. Hope Hicks, who has been working so hard without even taking a small break, has just tested positive for Covid 19. Terrible! The First Lady and I are waiting for our test results. In the meantime, we will begin our quarantine process! — Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020 -
సీఎం సలహాదారు గా రాజీవ్‌శర్మ
ఈ నెలాఖరున సీఎస్‌గా రిటైరయ్యాక కొత్త బాధ్యతలు? ► పరిపాలనా సంస్కరణల సలహాదారుగా నియామకానికి సర్కారు యోచన ► నూతన సీఎస్‌గా ప్రదీప్ చంద్రవైపు సర్కారు మొగ్గు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి సలహాదారుగా కొత్త పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల పరిధిలో ఇప్ప టికే ఉన్న సలహాదారుల తరహాలో పరిపా లనా సంస్కరణల సలహాదారుగా ప్రభుత్వం ఆయన్ను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుభవజ్ఞుడు కావటం, తెలం గాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ సీఎస్‌గా ఉండటంతో రాజీవ్ శర్మ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణా మాలు, క్షేత్రస్థాయిలో పరిపాలనా విభాగాల కుదింపు, సిబ్బంది సర్దుబాటు ప్రభావంతో పాటు కేంద్రంతో ముడిపడిన అంశా లను అధ్యయనం చేసే బాధ్యతలను సర్కారు రాజీవ్‌శర్మకు అప్పగించాల నుకుంటోంది. అందుకు సంబంధిం చిన ఫైలు ముఖ్యమంత్రి పరిశీల నలో ఉంది. మరోవైపు కొత్త సలహాదారుకు సీ బ్లాక్‌లో ప్రత్యేక చాంబర్ రూపుదిద్దుకుంటోంది. సీ బ్లాక్‌లోని ఆరో అంతస్తులో ఉత్తరం వైపున ఆర్ అండ్ బీ అధికారులు కొత్త చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. అందుకు వీలుగా ప్రస్తుతం సీఎం వ్యక్తిగత కార్యదర్శి అరుణ్ కుమార్ చాంబర్‌ను కుడి పక్కనున్న సీఎం చాంబర్ వైపు మార్చారు. అక్కడే ఉన్న ప్రొటోకాల్ క్యాంటీన్‌ను అక్కణ్ణుంచి తరలించారు. దీంతో రాజీవ్‌శర్మ కొత్త పాత్రలో కొలువు దీరేందుకు మార్గం సుగమమైనట్లు స్పష్టమవుతోంది. ప్రదీప్ చంద్రకే సీఎస్ చాన్స! కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమిం చేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ముఖ్యమంత్రి సైతం అందుకు సూచనప్రా యంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ చంద్ర...సీఎస్ రాజీవ్‌శర్మ తర్వాత ఐఏఎస్ అధికారుల్లో సీనియర్. ప్రస్తుతం ఆయన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక శాఖలతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాల్లో, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా సైతం పని చేశారు. తెలు గు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావటం తోపాటు వివిధ శాఖల్లో పని చేసిన అను భవం ఉండటంతో ఆయన్ను సీఎస్‌గా నియ మించే అవకాశాలున్నాయి. సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్‌లు ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ, ఎంజీ గోపాల్, ఆర్.ఆర్. ఆచార్య పేర్లు ఉన్నప్పటికీ సీఎం మాత్రం ఈ కీలక బాధ్యతలను ప్రదీప్ చంద్రకు అప్పగించను న్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఐఏఎస్‌ల బదిలీలు వివిధ విభాగాల్లో ఉన్న అవసరాల దృష్ట్యా వచ్చే వారంలో భారీగా ఐఏఎస్ అధికారు లను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రాధమిక కసరత్తు పూర్తి చేశారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సచివాలయం తరలింపునకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గే ప్రమాదముండటంతో ఈ తరుణంలో సచివాలయం నిర్మాణం చేపట్టడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. 24న సీఎం గృహప్రవేశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న కొత్త క్యాంపు ఆఫీసులోకి గృహ ప్రవేశం చేయ నున్నారు. తెల్లవారుజామున నిర్ణీత సుముహూర్తంలో కొత్త నివాసంలో అడుగుపెట్టనున్నారు. బేగంపేటలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం వెనుక ఆధు నిక హంగులతో కొత్త క్యాంపు కార్యాల యం నిర్మించటం తెలిసిందే. -
విద్యాసాగర్‌రావుకు సముచిత స్థానం
అర్వపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాంరాజు విద్యాసాగర్‌రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఈయన గతంలో కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంలో సలహా దారుడిగా నియమించుకుని సముచిత స్థానం కల్పించారు. ఆయనకు జాజిరెడ్డిగూడెంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని కౌలుకు ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి వ్యవసాయాన్ని చూసుకొని వెళుతుంటారు. కాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కూడా మండలంలోని నగేదెలు తెచ్చిన ముప్పు గారం వాసే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మండల వాసులకు రెండు రాష్ట్ర పదవులు దక్కడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.