పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం కనిపిస్తోంది. హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హిజ్బుల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడు ఇజ్రాయెల్‌పై యుద్దానికి దండెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కాగా గత మంగళవారం బీరుట్‌లో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గత వారం గోలన్ హైట్స్‌లో జరిగిన ఘోరమైన రాకెట్ కాల్పులకు ప్రతిస్పందనగా ఈ చర్యకు పాల్పడినట్లు టెల్ అవీవ్ పేర్కొంది. అనంతరం హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఇక హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకూర్ సైతం గత నెలలో లెబనాన్‌లో జరిగిన సమ్మెలో మరణించాడు.
అయితే హమాస్, హిజ్బుల్లా నాయకుల తాజా హత్యలతో సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్‌లలో ఇరాన్ మద్దతిచ్చే గ్రూప్స్‌లో ఉద్రిక్తతలను పెంచింది. దీంతో ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న భారత్ వంటి ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ పశ్చిమాసియా హెచ్చరించింది
ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. స్థానికంగా ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్ పాటించాలని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు లెబనాన్‌కు వెళ్లవద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. లెబనాన్‌ను విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు సూచించింది. ఈ క్రమంలోనే ఎయిరిండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్ ఆవీవ్‌కు ఆగస్ట్ 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment