ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కణికలా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది.
ఈనేపథ్యంలో ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఇదే కాకుండా లెబనాన్, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోందని తెలిపారు.
చదవండి: మధ్యప్రాచ్యంలో యుద్ద భేరీ..
ఈ మేరకు యూఎస్ వాషింగ్టన్‌లోని థింక్ తాంక్ కార్నేగీ ఎండోమెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ‘తీవ్రవాద చర్యగా’ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. అది ఎంతో ముఖమన్న జై శంకర్.. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదన చెప్పారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నట్లు
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ- తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్‌బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment