ఇరాన్‌ సుప్రీం నేత సంచలన ట్వీట్‌ | Iran Supreme Leader Sensational Allegations On Middle East Wars | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ వార్నింగ్‌ వేళ.. ఇరాన్‌ సుప్రీం నేత సంచలన ట్వీట్‌

Published Wed, Oct 2 2024 8:31 PM | Last Updated on Wed, Oct 2 2024 8:47 PM

Iran Supreme Leader Sensational Allegations On Middle East Wars

మిడిల్‌ ఈస్ట్‌ రీజియన్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రస్తుత సంక్షోభానికి కారణం ఎవరో చెబుతూ.. వరుస ట్వీట్లు చేశారాయన.

మిడిల్‌ ఈస్ట్‌లో అంతర్యుద్ధాలకు, యుద్ధాలకు.. అమెరికా, యూరోపియన్‌ దేశాలే కారణం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్నవాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ఆ శత్రుమూకలు గనుక వైదొలిగితే.. కచ్చితంగా ఈ అంతర్యుద్ధాలు, యుద్ధాలు ఆగిపోతాయి అని అన్నారాయన. అంతేకాదు.. ఇస్లామిక్‌ రెవల్యూషన్‌ స్ఫూర్తి.. ఇరాన్‌ ప్రజలు, మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారాయన.  

ఇదిలా ఉంటే.. లెబనాన్‌లో హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్‌ 180 మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్‌ మీదకు ప్రయోగించింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వైరంలో ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. తమపై దాడులకు దిగితే గనుక టెహ్రాన్‌(ఇరాన్‌ రాజధాని) వర్గాల నుంచి మరింత ధీటైన బదులు వస్తుందని ఇరాన్‌ రెవల్యూషన్‌ గార్డులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఇరాన్‌ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించగా.. దాడులకు మిత్రపక్షం అమెరికా కూడా మద్దతు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఖమేనీ ఎక్కడ?
గాజా సంక్షోభం తర్వాత.. ఈ మధ్య ఇజ్రాయెల్‌ లెబనాన్‌ను, అక్కడి హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మరణించడం ఆ సంస్థకు భారీ దెబ్బ పడినట్లయ్యింది. అయితే తర్వాతి టార్గెట్‌ ఇరాన్‌ సుప్రీం కావొచ్చనే అనుమానాల నడుమ ఆయన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement