Sensational Comment
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు
-
ఇరాన్ సుప్రీం నేత సంచలన ట్వీట్
మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రస్తుత సంక్షోభానికి కారణం ఎవరో చెబుతూ.. వరుస ట్వీట్లు చేశారాయన.మిడిల్ ఈస్ట్‌లో అంతర్యుద్ధాలకు, యుద్ధాలకు.. అమెరికా, యూరోపియన్ దేశాలే కారణం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్నవాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ఆ శత్రుమూకలు గనుక వైదొలిగితే.. కచ్చితంగా ఈ అంతర్యుద్ధాలు, యుద్ధాలు ఆగిపోతాయి అని అన్నారాయన. అంతేకాదు.. ఇస్లామిక్ రెవల్యూషన్ స్ఫూర్తి.. ఇరాన్ ప్రజలు, మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారాయన. The root of the problem in our region, these conflicts and wars, is the presence of those who claim to advocate peace in the region. That is, the United States and some European countries.— Khamenei.ir (@khamenei_ir) October 2, 2024If the villainy of the US and certain European countries is removed from this region, undoubtedly these conflicts and wars will be completely eliminated. Then the countries in the region can live together in peace, health, and prosperity.— Khamenei.ir (@khamenei_ir) October 2, 2024ఇదిలా ఉంటే.. లెబనాన్‌లో హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్ 180 మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. ఇరాన్-ఇజ్రాయెల్ వైరంలో ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. తమపై దాడులకు దిగితే గనుక టెహ్రాన్(ఇరాన్ రాజధాని) వర్గాల నుంచి మరింత ధీటైన బదులు వస్తుందని ఇరాన్ రెవల్యూషన్ గార్డులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇరాన్ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించగా.. దాడులకు మిత్రపక్షం అమెరికా కూడా మద్దతు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఖమేనీ ఎక్కడ?గాజా సంక్షోభం తర్వాత.. ఈ మధ్య ఇజ్రాయెల్ లెబనాన్‌ను, అక్కడి హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణించడం ఆ సంస్థకు భారీ దెబ్బ పడినట్లయ్యింది. అయితే తర్వాతి టార్గెట్ ఇరాన్ సుప్రీం కావొచ్చనే అనుమానాల నడుమ ఆయన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. రేవంత్ సంచలన కామెంట్స్
-
నీ శకం ముగిసింది బాబు..
-
కాబోయే సీఎం జగనే..
-
సీబీఐ వందసార్లు పిలిచినా వెళ్లి సమాధానం ఇస్తా: కేజ్రీవాల్
-
రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు..!
-
తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
-
అమ్మాయిలపై బీజేపీ ఎంఎల్ఏ దురుసు వ్యాఖ్యలు
సాక్షి, భోపాల్ : బీజేపీ ఎంఎల్ఏ నోటిదురుసు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలపై వేధింపులు ఆగాలంటే అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండాలని మధ్యప్రదేశ్ ఎంఎల్ఏ పీఎల్ సఖ్యా సలహా ఇచ్చారు. అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు..?వారిపై వేధింపులు నిలిచిపోవాలంటే వారు అబ్బాయిలతో స్నేహం చేయకూడ’దని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ చెప్పుకొచ్చారు. మహిళలపై వేధింపుల గురించి తనను ప్రశ్నించిన ఓ టీవీ ఛానెల్ వారికి కూడా తాను ఇదే విషయం చెప్పానని అన్నారు. అబ్బాయిలు కూడా పాశ్చాత్య సంస్కృతికి చిహ్నంగా అమ్మాయిలతో స్నేహం పెంచుకోవడానికి దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. మన దేశంలో మహిళలను ఎంతో గౌరవిస్తాం..అలాంటి మహిళలను వేధించడాన్ని తాను అంగీకరించబోనని అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని మట్టుబెట్టి బాయ్ ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌కు స్వస్తి పలకాలని ఆయన పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం విదేశీ సంప్రదాయమని చెప్పారు. సఖ్యా గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటలీలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహం జరిగినందున వారి పెళ్లి దేశభక్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో డబ్బు, పేరుప్రతిష్టలు గడించిన కోహ్లీ విదేశీ గడ్డపై పెళ్లి చేసుకోవడం దారుణమని సఖ్య మండిపడ్డారు. -
గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు
-
గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు
►కార్పొరేట్ వైద్య రంగంలో ధనార్జనే ధ్యేయంగా మారింది ►సామాన్యులకు వైద్యం మిథ్యగా మారింది ►సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు జిల్లాలను దత్తత తీసుకోవాలి ►ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా సదస్సులో ప్రసంగం హైదరాబాద్: అతి త్వరలో తాను సాధారణ పౌరుడిని కాబోతున్నానంటూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సాధారణ పౌరుడిని కాబోతున్నానని చెప్పారు. వైద్య విజ్ఞాన రంగంలో నూతన అవిష్కరణలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నా రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులు సామాన్యుడిని వైద్యానికి దూ రం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైద్య సంరక్షణ సామాజిక బాధ్యత. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధారణ ప్రజలకు వైద్యం మిథ్యగా మారింది. వ్యవసాయరంగంలో మాదిరి వైద్య రంగంలో కూడా క నీస మద్దతు ధర స్థిరీకరించాలి. కార్పొరేట్ వైద్య రంగంలో ధనార్జనే ధ్యేయం కావడంతో నైతిక విలువలు కానరావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా కొన్ని జిల్లాలను దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ఇంటి వైద్యుడు (ఫ్యామిలీ ఫిజీషియన్) పూర్తిగా కనుమరుగై పోయాడు. జనరిక్ మందుల ధరలు బ్రాండెడ్ ఔషధాల కన్నా తక్కువగా ఉన్నాయి. వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ దేశంలో అతిపెద్ద రంగ మనీ, 2020 నాటికి మెడికల్ టూరిజం ద్వారా 32 కోట్ల మంది భారత్‌ను సందర్శించనున్నారని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ సి.డి.అర్హా చెప్పారు. వైద్య రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, తెలంగాణ, ఏపీలో కొత్తగా మెడికల్, నర్సింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి సూచించారు. దంత వైద్యంలో ప్రత్యూషకు అవార్డు దంత వైద్యంలో మెరుగైన వైద్య సేవలందిస్తున్న ప్రత్యూషకు బెస్ట్ హెల్త్‌కేర్ అండ్ ఫార్మా ప్రొఫెషనల్ అవార్డు లభించింది. ఆమె కిమ్స్‌లో డెంటల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. వైద్యులు వినోద్ ప్రవీణ్ శర్మ, సమీర్ భాటి, ఉదయ్ కృష్ణ మైనేని, అమిత్ డాంగ్, నబిత్ కపూర్, పి.ఎల్.కె.ఎం.రావు, ఎంవీవీ నాగేశ్వర్ రెడ్డి, శివరాజు, ప్రదీప్ రెడ్డి, కౌషిక్ రెడ్డి కూడా ఈ అవార్డు అందుకున్నారు. జీవిత సాఫల్య అవార్డు గ్రహీతలు.. డాక్టర్ రాబర్ట్ వాహ్: ప్రెసిడెంట్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రొఫెసర్ డి.బాలసుబ్రమణియన్: డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఆంథోని జె డెస్టిఫానో: అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సయీద్ ఖురేషి- సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, థెరాపెటిక్ ప్రోడక్ట్స్ డెరైక్టరేట్, కెనడా డాక్టర్ జెర్రీ సి.పార్కర్- అసోసియేట్ డీన్ ఫర్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి, అమెరికా డాక్టర్ జి.ఎన్.సింగ్-డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ పి.వి.అప్పాజీ- డెరైక్టర్ జనరల్, ఫార్మాక్సిల్. -
యస్..కలుస్తాం!
- ఉద్ధవ్‌తో కలిసి పనిచేసే విషయమై రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్య - అన్నదమ్ములం కలిసి పనిచేస్తే మీకేంటి బాధని ఎదురుప్రశ్న - రాజకీయాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ - తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉద్ధవ్ ఫోన్‌చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకోలు సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే అన్నదమ్ములిద్దరం కలిసి పనిచేస్తామని రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన నేత ఉద్ధవ్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. అసలు తామిద్దరం కలిసి పనిచేస్తే వేరే వారికి ఎందుకు బాధ, ఇబ్బందులో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. ‘మా ఇద్దరి సిద్ధాంతాలు వేరైనా రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటికంటే ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్ధవ్,నేను అవసరమైతే ఒక్కటవుతాం.. దీనిలో మీకెందుకంత ఉత్సాహం.. మా పని మేం చూసుకుంటాం..’ అని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. పొత్తులు బెడిసికొట్టిన నేపథ్యంలో అన్ని పార్టీలకూ ఒంటరి పోరు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త సమీకరణాలకు తలుపులు తెరుచుకునేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీ, శివసేన కూటమి విడిపోయిన తర్వాత రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు ఒక్కటి కానున్నారంటూ హల్చల్ చేసిన పుకార్లు నిజం కానున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అవసరమైతే ఈ రెండు పార్టీలూ కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజ్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఉద్ధవ్ ఫోన్ చేసిన మాట వాస్తవమే... తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసిన విషయం వాస్తవమేనని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయితే ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయానన్నారు. ‘కేవలం ఎలా ఉన్నావు..? ఆరోగ్యం ఎలా ఉందని ఉద్ధవ్ అడిగాడు. కాని నాకు విపరీతంగా దగ్గువస్తుండడం ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాన’నని వివరించారు. భూతద్దంలో చూడొద్దు... ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం సరికాదని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ నేత నితిన్ గడ్కరి, తాను అనుకోకుండా ఒకే హోటల్ల్లో దిగామని.. అలా ఆయనతో తాను మాట్లాడానని తెలిపారు. కాని దీనిపై గడ్కరీతో భేటీ కావడం వెనుక రహస్యమేమిటి.,.? రహస్యంగా గడ్కరితో భేటీ అయిన రాజ్ ఠాక్రే.. అని శీర్షికలతో కథనాలు వెలువడటం సరి కాదన్నారు. గడ్కరీతో నాకు వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలున్నాయా.. లేవే.. అలాంటి సమయంలో రహస్యంగా కలవాల్సిన అవసరం నాకేంటి..’ అని రాజ్ ఎదురు ప్రశ్నించారు.