అతి త్వరలో తాను సాధారణ పౌరుడిని కాబోతున్నానంటూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సాధారణ పౌరుడిని కాబోతున్నానని చెప్పారు. వైద్య విజ్ఞాన రంగంలో నూతన అవిష్కరణలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నా రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులు సామాన్యుడిని వైద్యానికి దూ రం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైద్య సంరక్షణ సామాజిక బాధ్యత. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధారణ ప్రజలకు వైద్యం మిథ్యగా మారింది. వ్యవసాయరంగంలో మాదిరి వైద్య రంగంలో కూడా క నీస మద్దతు ధర స్థిరీకరించాలి. కార్పొరేట్ వైద్య రంగంలో ధనార్జనే ధ్యేయం కావడంతో నైతిక విలువలు కానరావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా కొన్ని జిల్లాలను దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ఇంటి వైద్యుడు (ఫ్యామిలీ ఫిజీషియన్) పూర్తిగా కనుమరుగై పోయాడు. జనరిక్ మందుల ధరలు బ్రాండెడ్ ఔషధాల కన్నా తక్కువగా ఉన్నాయి. వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ దేశంలో అతిపెద్ద రంగ మనీ, 2020 నాటికి మెడికల్ టూరిజం ద్వారా 32 కోట్ల మంది భారత్‌ను సందర్శించనున్నారని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ సి.డి.అర్హా చెప్పారు. వైద్య రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, తెలంగాణ, ఏపీలో కొత్తగా మెడికల్, నర్సింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి సూచించారు.
Published Fri, Jul 24 2015 8:20 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement