
సాక్షి, భోపాల్ : బీజేపీ ఎంఎల్‌ఏ నోటిదురుసు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలపై వేధింపులు ఆగాలంటే అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండాలని మధ్యప్రదేశ్ ఎంఎల్‌ఏ పీఎల్ సఖ్యా సలహా ఇచ్చారు. అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు..?వారిపై వేధింపులు నిలిచిపోవాలంటే వారు అబ్బాయిలతో స్నేహం చేయకూడ’దని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఏ చెప్పుకొచ్చారు.
మహిళలపై వేధింపుల గురించి తనను ప్రశ్నించిన ఓ టీవీ ఛానెల్ వారికి కూడా తాను ఇదే విషయం చెప్పానని అన్నారు. అబ్బాయిలు కూడా పాశ్చాత్య సంస్కృతికి చిహ్నంగా అమ్మాయిలతో స్నేహం పెంచుకోవడానికి దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. మన దేశంలో మహిళలను ఎంతో గౌరవిస్తాం..అలాంటి మహిళలను వేధించడాన్ని తాను అంగీకరించబోనని అన్నారు.
పాశ్చాత్య సంస్కృతిని మట్టుబెట్టి బాయ్ ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌కు స్వస్తి పలకాలని ఆయన పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం విదేశీ సంప్రదాయమని చెప్పారు. సఖ్యా గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటలీలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహం జరిగినందున వారి పెళ్లి దేశభక్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో డబ్బు, పేరుప్రతిష్టలు గడించిన కోహ్లీ విదేశీ గడ్డపై పెళ్లి చేసుకోవడం దారుణమని సఖ్య మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment