ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష | Donald Trump aide Hope Hicks tests positive for coronavirus | Sakshi
Sakshi News home page

ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష

Published Fri, Oct 2 2020 8:00 AM | Last Updated on Fri, Oct 2 2020 9:52 AM

Donald Trump aide Hope Hicks tests positive for coronavirus - Sakshi

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రంప్ కూడా కోవిడ్-19 పరీక్ష  చేయించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ట్విటర్ ద్వారా  వెల్లడించారు.  చిన్నవిరామం కూడా తీసుకోకుండా కష్టపడుతున్న హోప్ హిక్స్ కరోనా బారిన పడ్డారు. దీంతో తన భార్య, తాను పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. క్వారంటైన్ లోకి వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. ఈ వారంలో ఆమె  ట్రంప్‌తో పలుసార్లు ప్రయాణించారు. అలాగే బుధవారం ఒక ర్యాలీలో పాల్గొన్న మరుసటి రోజు ఆమెకు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది.(ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ కష్టం)

మంగళవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా ఆమె ఇటీవల అధ్యక్షుడితో పలుసార్లు ప్రయాణించారు. మిన్నెసోటాలో ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ముందు జాగ్రత్త చర్యగా అధ్యక్షుడు ట్రంప్‌ పరీక్షలు చేయించుకున్నట్టు పేర్కొన్నారు. హిక్స్ గతంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్  ప్రతినిధిగా పనిచేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తిరిగి వైట్ హౌస్ కు వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement